Janhvi Kapoor: అతిలోక సుందరి శ్రీదేవి పుట్టినరోజు.. తిరుమలలో జాన్వీ కపూర్ - అచ్చం అమ్మలాగే!
Janhvi Kapoor: అతిలోక సుందర, దివంగత హీరోయిన్ శ్రీదేవి పుట్టిన రోజు ఆగస్టు 13. ఆమె బాటలోనే నడుస్తుంది కూతురు జాన్వీ కపూర్. ఈసందర్భంగా ఆమె షేర్ చేసిన ఒక ఫొటో ఫ్యాన్స్ కి కంటతడి పెట్టిస్తుంది.
![Janhvi Kapoor: అతిలోక సుందరి శ్రీదేవి పుట్టినరోజు.. తిరుమలలో జాన్వీ కపూర్ - అచ్చం అమ్మలాగే! Janhvi Kapoor Take Annual Pilgrimage to Tirupati Temple on Sridevi's Birth Anniversary continuing her Mothers Tradition Janhvi Kapoor: అతిలోక సుందరి శ్రీదేవి పుట్టినరోజు.. తిరుమలలో జాన్వీ కపూర్ - అచ్చం అమ్మలాగే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/13/2008ad3d877f7987af774f343d0c42011723545274725932_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Janhvi Kapoor Take Annual Pilgrimage to Tirupati Temple on Sridevi's Birth Anniversary: అతిలోక సుందరి, దివంగత హీరోయిన్ శ్రీదేవి పుట్టిన రోజు సందర్భంగా ఆమె కూతురు జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అంతేకాకుండా శ్రీదేవి బతికుంటే ఏం చేసేదో జాన్వీకపూర్ కూడా అదే చేశారు. సినిమాల విషయంలో, పద్ధతుల విషయంలో తల్లి బాటలోనే ఆమె కూడా నడస్తున్నారు. శ్రీదేవి పుట్టిన రోజు సందర్భంగా జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఆ ఫొటోలను షేర్ చేసి అభిమానులు శ్రీదేవిని గుర్తు చేసుకునేలా చేశారు.
తిరుపతితో ప్రత్యేక అనుబంధం..
శ్రీదేవి నిత్యం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సేవలో తరియిస్తుంటారు. అయితే ఆమె పుట్టిన రోజున మాత్రం కచ్చితంగా ఆమె తిరుమల వస్తారు. ఆ దేవదేవుడిని దర్శించుకునుని మొక్కులు చెల్లించుకుంటారు. అది కూడా కాలినడకన తిరుమల చేరుకుని స్వామి వారిని దర్శించుకుంటారు. ఆమె మరణించిన తర్వాత జాన్వీ కపూర్ ఆ పద్ధతిని కొనసాగిస్తూనే ఉన్నారు. శ్రీదేవి పుట్టిన రోజు సందర్భంగా జాన్వీ కపూర్ కాలినడకన తిరుమలకి వెళ్ళి స్వామి వారిని దర్శించుకున్నారు. దానికి సంబంధించిన ఫొటోలను ఆమె షేర్ చేశారు. శ్రీదేవికి తరచూ తిరుమల రావడం ఎలా అలవాటో.. జాన్వీ కపూర్ కూడా నిత్యం తిరుమల వెళ్తూ ఉంటారు. గతంలో కూడా ఆమె చాలా సార్లు శ్రీ వారిని దర్శించుకున్నారు.
View this post on Instagram
ఎమోషనల్ పోస్ట్..
తన తల్లి జయంతి సందర్భంగా జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. మొత్తం మూడు ఫొటోలు షేర్ చేశారు జాన్వీ. మొదటిది మెట్లు ఎక్కుతున్న ఫొటో, రెండోది తన తల్లితో చిన్నప్పుడు దిగిన ఫొటో, తిరుమలలో దర్శనం అనంతరం తీసుకున్న ఫొటోలను పోస్ట్ చేశారు జాన్వీ కపూర్. 'హ్యాపీ బర్త్ డే ముమ్మా ఐ లవ్వ్యూ' అని రాసుకొచ్చారు జాన్వీ. పసుపుపచ్చ చీరలో ట్రెడిషనల్ డ్రస్ లో మెరిసిపోయారు జాన్వీ.
శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్, శ్రీ దేవి భర్త బోనీ కపూర్ కూడా ఆమెను గుర్తు చేసుకున్నారు. ఆమెతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. జాన్వీ కపూర్, శ్రీదేవితో ఉన్న ఫొటోలను షేర్ చేసింది ఖుషి. హ్యాపీ బర్త్ డే జాన్ అంటూ భార్యను గుర్తు చేసుకున్నారు బోనీ కపూర్.
2018లో అకస్మాత్తుగా..
శ్రీదేవి.. ఆమెను అందరూ అతిలోక సుందరి అని పిలిచేవాళ్లు. అంత అందంగా ఉంటారు శ్రీదేవి. ఆమె అద్భుతమైన నటన, డ్యాన్స్ తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు ఆమె. తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో ఎన్నో హిట్ సినిమాలు తీశారు శ్రీదేవి. అయితే, ఉన్నట్లుంది 2018లో అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. ఆమెకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు జాన్వీ కపూర్, చిన్న కూతురు ఖుషి కపూర్. ఇద్దరు సినిమా ఫీల్డ్ లో ఉన్నారు. జాన్వీ కపూర్ ఇప్పటికే ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. ఇక ఇప్పుడు తెలుగులో ఆమె మొదటి సినిమా రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ సరసన 'దేవర' సినిమాలో నటిస్తున్నారు జాన్వీ కపూర్. ఇటీవల ఆ సినిమాలో విడుదలైన పాట సూపర్ హిట్ అయ్యింది.
Also Read: కమిటీ కుర్రోళ్ళు ఫస్ట్ వీక్ @ 10 కోట్లు - మొదటి సినిమాతో లాభాల్లోకి నిహారిక!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)