Committee Kurrollu: కమిటీ కుర్రోళ్ళు ఫస్ట్ వీక్ @ 10 కోట్లు - మొదటి సినిమాతో లాభాల్లోకి నిహారిక!
Committee Kurrollu Box Office Collection: నిహారిక కొణిదెల కొత్త వాళ్ళతో తీసిన 'కమిటీ కుర్రోళ్ళు' 7.48 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ఫస్ట్ వీక్ క్లోజ్ అయ్యే లోపు పది కోట్ల మార్క్ చేరుతుందని అంచనా.
Box Office Collection Of Committee Kurrollu: 'కమిటీ కుర్రోళ్ళు'కు థియేటర్లలో చాలా మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఆడియన్స్ ఆదరణతో బాక్సాఫీస్ బరిలో ఈ సినిమా మంచి నంబర్స్ నమోదు చేస్తోంది. నిర్మాతగా మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) వెండితెరపై వేసిన మొదటి అడుగులో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆల్రెడీ ఆవిడ వెబ్ షోస్ ప్రొడ్యూస్ చేశారు. కానీ, ఫీచర్ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేయడం ఇదే తొలిసారి. ఆల్రెడీ ఈ సినిమా రూ. 7.48 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయ్యింది.
కమిటీ కుర్రోళ్ళు ఫస్ట్ వీక్ @ 10 కోట్లు!
Committee Kurrollu First Week Collection: 'కమిటీ కుర్రోళ్ళు' సినిమాలో హీరోలుగా నటించిన వారందరికీ ఎటువంటి ఇమేజ్ లేదు. కొత్త కుర్రాళ్ళు. హీరోయిన్లుగా ఒకటి రెండు సన్నివేశాలు కనిపించిన అమ్మాయిలు సైతం ఇంతకు ముందు షార్ట్ ఫిలిమ్స్ చేశారు తప్ప సినిమాల్లో పెద్దగా చేసింది లేదు. దర్శకుడు యదు వంశీకి సైతం ఇదే తొలి సినిమా. కథ, కంటెంట్ మీద నమ్మకంగా నిహారిక ధైర్యంగా ముందడుగు వేసింది. ఆవిడ నమ్మకం వమ్ము కాలేదు. సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. అటు ప్రేక్షకుల ఆదరణ సైతం లభిస్తోంది.
థియేటర్లలో విడుదలైన నాలుగు రోజుల్లో 'కమిటీ కుర్రోళ్ళు' రూ. 7.48 కోట్లు కలెక్ట్ చేసింది. మొదటి రోజు కంటే రెండు, మూడు రోజుల్లో ఎక్కువ వసూళ్లు సాధించి అందరి చూపు తన వైపు తిప్పుకొన్న చిత్రమిది. ఏ సినిమాకు అయినా ఫస్ట్ వీకెండ్ తర్వాత కలెక్షన్లలో డ్రాప్ కనబడుతుంది. కానీ, 'కమిటీ కుర్రోళ్ళు'కు పెద్దగా డ్రాప్ కనిపించలేదు. సోమవారం ఆల్మోస్ట్ కోటిన్నర కలెక్ట్ చేసింది. మంగళ, బుధ వారాల్లో కోటి కోటి చొప్పున వచ్చే అవకాశం కనబడుతోంది. గురువారం పరిస్థితి ఏమిటనేది చూడాలి.
#CommitteeKurrollu does wonders at the box office! 𝗪𝗪 𝗚𝗥𝗢𝗦𝗦 - 𝟕.𝟒𝟖 𝐂𝐑 🥳
— Pink Elephant Pictures (@PinkElephant_P) August 13, 2024
Nostalgic Entertainer Breaches All Areas Breakeven Mark in just 𝟰 𝗗𝗮𝘆𝘀!❤️🔥✅️
Blockbuster Run Continues💪💥
🎟 https://t.co/MsqA9nQyFY @IamNiharikaK @SRDSTUDIOS_ @yadhuvamsi92 pic.twitter.com/fSSnQiYVYn
గురువారం ఆగస్టు 15 కావడంతో 'మిస్టర్ బచ్చన్', 'డబుల్ ఇస్మార్ట్', 'తంగలాన్', ఆ తర్వాత రోజు 'ఆయ్' సినిమాలు వస్తున్నాయి. హిందీలో 'స్త్రీ 2', 'వేదా', 'ఖేల్ ఖేల్ మే' ఉన్నాయి. మెజారిటీ థియేటర్లు ఆ సినిమాలకు వెళతాయి. అందువల్ల, 'కమిటీ కుర్రోళ్ళు' థియేటర్స్ నంబర్ డ్రాప్ కావడమే కాదు... కలెక్షన్స్ కూడా డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ రోజు రూ. 50 లక్షలు వస్తే చాలు... మొదటి వారంలో 'కమిటీ కుర్రోళ్ళు' సినిమా పది కోట్ల కలెక్షన్ మార్క్ చేరుకుంటుంది. ఈ సినిమాకు ఏడెనిమిది కోట్ల ఖర్చు అయ్యిందట. ప్రచారంతో కలిపి తొమ్మిది వరకు చేరుతుంది. బ్రేక్ ఈవెన్ కావడంతో పాటు ఓటీటీ, శాటిలైట్ రైట్స్ ఉండటం వల్ల నిహారిక కొణిదెలకు లాభాలు వస్తాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు.
Also Read: 'కల్కి 2898 ఏడీ'... వచ్చే వారమే ప్రైమ్ వీడియో ఓటీటీలోకి... అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది