Nindu Noorella Saavasam Serial Today April 4th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: అనామికను నిజం చెప్పమన్న అమర్ - మౌనంగా ఉండిపోయిన అనామిక
Nindu Noorella Saavasam Today Episode: ఆకాష్‌ను కాపాడిన అనామికను అమర్ అనుమానిస్తాడు. తనెవరో నిజం చెప్పమని అడగడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: చదువుకోకుండా డిస్టర్బ్ చేస్తున్న అంజును తిడతాడు ఆకాష్. చదువుకోకున్నా నువ్వు ఎలాగైనా మేనేజ్ చేసుకుంటావని మేమే ఇబ్బంది పడతామిన సీరియస్ అవుతాడు. ఆకాష్‌కు బ్రీతింగ్ ప్రాబ్లమ్ వస్తుంది. ఆకాస్‌కు వాటర్ ఇచ్చి అంజును తీసుకుని బయటకు వస్తారు అమ్ము, ఆనంద్.
అమ్ము: ఆకాష్‌కు ఆస్తమా ప్రాబ్లమ్ ఉంది. వాడు ఎక్కువగా అరవకూడదని నీకు తెలియదా.. అంజు?
అంజు: తెలుసు అమ్ము.. కానీ ఇంత చిన్న విషయానికి నా మీద అరుస్తాడని అనుకోలేదు. అయినా వాడు టెన్షన్ అవుతున్నాడని కొంచెం రిలాక్స్ చేద్దామని బయటకు వెళ్లి ఆడుకుందామని అడిగాను అంతే
ఆనంద్: సరేలేవే.. టెన్షన్ అవ్వకు..ఒక్క ఐదు నిమిషాల్లో నిన్ను తిట్టానన్న బాధతో వాడే బయటకు వస్తాడు.
అని మాట్లాడుకుంటుంటే.. ఆకాష్‌కు ఆస్తమా ఎక్కువ అవుతుంది. అక్కా అంటూ బెడ్ మీద నుంచి కింద పడి గిలా గిలా కొట్టుకుంటుంటాడు. కిందకు వచ్చిన అంజు వాళ్లను అనామిక చూస్తుంది.
అనామిక: అరే చదువుకోకుండా ఎక్కడికి పోతున్నారు.
అంజు: మా సిలబస్ అయిపోయింది. సిలబస్ అయిపోతే థర్టీ మినిట్స్ ప్లే అని నువ్వే చెప్పావు కదా..?
అనామిక: సరే సరే వెళ్లండి జాగ్రత్త.. అవును అంజు ఆకాష్ ఎక్కడ..?
అమ్ము: పైనే ఉన్నాడు. వాడు కాసేపు ఆగి వస్తా అన్నాడు.
అనామిక: సరే జాగ్రత్త..
అంటూ అనామిక కిచెన్‌లోకి వెళ్తుంది. గుప్త చెప్పిన మాటలు గుర్తుచేసుకుంటూ బాధపడుతుంది. పైన రూంలో ఆకాష్ కింద పడి గిలగిల కొట్టుకుంటుంటాడు. ఇంతలో రాథోడ్ మనోహరి దగ్గరకు వెళ్తాడు.
మనోహరి: ఏంటి ఎందుకు వచ్చావు
రాథోడ్: సార్ మిమ్మల్ని రెడీ అవ్వమన్నారు.. అరగంటలో బయటకు వెళ్లాలట.
మనోహరి: బయటికా..? ఎవరెవరు
రాథోడ్: మీరు నేను సారు
మనోహరి: మా మధ్య నువ్వెందుకు ఏం అవసరం లేదు. ఏదో ఒకటి చెప్పి ఇంట్లోనే ఉండు. నేను అమర్ సరదాగా బయటకు వెళ్లొస్తాం..
రాథోడ్: మీరు సరదాగా వెల్లడానికి సార్ తీసుకు వెల్తుంది షాపింగ్‌కు కాదండి.. మిలటరీ ఆఫీసుకు.. మా మేజర్ గారిని కలవడానికి
మనోహరి: నేనెందుకు మేజర్ గారిని కలవాలి.
రాథోడ్: మీరు మీనన్ మనుషులతో చేతులు కలిపారు కదా దాని గురించి మా సారు మాట్లాడుతున్నారు మీ గురించి మాట్లాడేటప్పుడు మీరు లేకపోతే ఎలా..?
మనోహరి: నేను మీనన్‌తో చేతులు కలపడం ఏంటి..?
రాథోడ్: అదే మిమ్మల్ని బయపెట్టాడని మీనన్‌కు మీరు హెల్ప్ చేశారు కదా
అంటూ రాథోడ్ చెప్పగానే.. మనోహరి భయంగా సరే రెడీ అయి వస్తాను అని చెప్పగానే.. రాథోడ్ ఫైల్ పైనే మర్చిపోయాను అని పైకి వెళ్తాడు. రూంలో ఆకాష్ పడి ఉండటం చూసి భయంతో గట్టిగా అందరినీ పిలుస్తాడు. అందరూ వచ్చి ఆకాష్‌ను చూసి కంగారు పడుతుంటారు. అనామిక మాత్రం కూల్‌గా ఆకాష్‌కు అస్తమా హీలర్ ఇచ్చి రిలీప్ చేస్తుంది. అనామిక అలా చేయడంతో ఆకాష్ స్పృహలోకి వస్తాడు. అందరూ ఊపిరి పీల్చుకుంటారు. అనామిక అక్కడి నుంచి గార్డెన్ లోకి వెళ్తుంది. అమర్ కూడా అనామిక వెనకాలే వెళ్తాడు. అనామికను నువ్వు నీలా కనిపించడం లేదని నిజం చెప్పాలంటే తన ఆరులా కనిపిస్తున్నావని అడుగుతాడు. దీంతో ఆరు షాక్ అవుతుంది. ఏం చెప్పాలో అర్థం కాక మనసులో బాధపడుతుంది. మీకు నేనే మీ ఆరు అని ఎలా చెప్పాలి అనుకుని ఎమోషనల్ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















