Nindu Noorella Saavasam Serial Today April 3rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: మనోహరికి సినిమా చూపించిన ఆరు ఆత్మ – మిస్సమ్మను చూసి ఆరును గుర్తు చేసుకున్న అమర్
Nindu Noorella Saavasam Today Episode: మిస్సమ్మ బాడీలోకి వెళ్లిన ఆరు ఆత్మ మనోహరికి చుక్కలు చూపిస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.
Nindu Noorella Saavasam Serial Today Episode: తనకు వచ్చిన శక్తుల గురించి అర్థం చేసుకున్న అరుంధతి గుప్త చెప్తుండగానే పరుగెత్తుకెళ్లి మిస్సమ్మ బాడీలోకి వెళ్లిపోతుంది. మరోవైపు రూంలో కూర్చున్న మనోహరి ఘోర చెప్పింది గుర్తు చేసుకుంటుంది. ఇంతలో నీల రూంలోకి వస్తుంది.
మనోహరి: ఇది నా చేతికి కట్టు నీల.
నీల: ఈ తాడు మీ చేతికి ఎందుకు కట్టాలి అమ్మా..
అనగానే ఘోర చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది మనోహరి.
ఘోర: నేను నువ్వు నీ కోరిక ఏ విపత్తు జరగకుండా ఆపలేము. కానీ ఆ ఆత్మని నీ దగ్గరకు రానివ్వకుండా చేసేది ఈ తాడు. ఇది నీ చేతికి కట్టుకో మనోహరి
మనోహరి: అమర్ కట్టే తాళి నా మెడలో పడాలంటే ఈ తాడు నా చేతికి ఉండాలి. ఘోర, మంగళ చెప్పింది వింటే అక్కాచెల్లేల్లు ఏకమై నాకు అమర్‌తో పెళ్లి జరగకుండా చూస్తున్నారు.
అంటూ చెప్పి తాయెత్తు చేతికి కట్టించుకుంటుంది మనోహరి. తర్వాత కిందకు వస్తుంటే మిస్సమ్మ లో ఉన్న అరుంధతి మనోహరికి ఎదురుగా వస్తుంది.
మనోహరి: ఎంటి నన్నేదో కొత్తగా చూస్తున్నట్లు అలా చూస్తున్నావు.
మిస్సమ్మ: ఇలా చూడ్డం కొత్తే కదా మను.
మనోహరి: ఏయ్ నువ్వు నన్ను మను అని ఎందుకు అన్నావ్. నన్ను మను అని ఆరు తప్పా ఇంకెవ్వరూ పిలవరు. నువ్వెందుకు పిలిచావు.
మిస్సమ్మ: ఊరికే పిలవాలనిపించింది. నమ్మిన స్నేహాన్ని అంత మోసం ఎలా చేయాలనిపించింది. ఆదుకుని ఆశ్రయం ఇచ్చిన ఈ కుంటుంబానికి కీడు చేయాలని ఎందుకు అనిపించింది. అసలు మనిషి నుంచి మృగంలా ఎప్పుడు మారావు.
మనోహరి: ఏయ్ ఎంటి కొత్తగా మాట్లాడుతున్నావు. నేరుగా ఎదుర్కోలేక కొత్త నాటకం ఆడుతున్నావా? చూడు నువ్వు ఏం చేసినా కూడా అమర్ తో నా పెళ్లి ఆపలేవు.
మిస్సమ్మ: ఆపుతా.. నీ కళ్ల ముందే నువ్వు కట్టుకున్న ఈ కలల కోటని పునాదులతో సహా కూల్చిపడేస్తా..
అంటూ వార్నింగ్ ఇస్తుంటే పిల్లలు వస్తారు. పిల్లలను చూసి దగ్గరకు తీసుకుంటుంది. ప్రేమగా అందరిని ముద్దాడుతుంది. ఇంతలో అందరూ వస్తారు.
అమర్: మిస్సమ్మ ఏంటి పిల్లల్ని ఇవాళే కొత్తగా చూసినట్లు చేస్తున్నావు.
అంజు: మిస్సమ్మ మమ్మల్ని డైలీ చూస్తున్నావు కదా మరి ఈరోజు ఏంటి అంత ఎమోషనల్ అవుతున్నావు.
మిస్సమ్మ: మీరు సమ్మర్ క్యాపుకు వెళ్లిపోతే చాలా రోజులు చూడలేకపోయేదాన్ని కదా అది గుర్తొచ్చి బాధేసింది. అంజు.
శివరాం: అయ్యో పిచ్చి పిల్లా వాళ్లు నిన్ను వదిలేసి ఎక్కడికి పోలేదు. తల్లి నుంచి బిడ్డల్ని ఎవరైనా వేరు చేయగలరా?
మనోహరి: అంకుల్ మిస్సమ్మ ఎంటి తల్లి.
శివరాం: కేర్ టేకర్ అంటే తల్లి లాంటిదే కదమ్మా అందుకే ఆలా అన్నాను.
మనోహరి: సరే అంకుల్ భోజనం చేద్దామా? నాకు కడుపు మంటగా ఉంది. అదే కడుపులో మంటగా ఉంది.
అనడంతో అందరూ భోజనం చేయడానికి వెళ్తారు. మిస్సమ్మ అందరికీ తానే వడ్డిస్తానని అచ్చం అరుంధతిలా వడ్డిస్తుంది. పిల్లలకు కొసరి కొసరి తినిపిస్తుంది. దీంతో నువ్వు అచ్చం మా అరుంధతి లా వడ్డిస్తున్నావని అంటుంది నిర్మల. అమర్ కూడా అరుంధతిని గుర్తు చేసుకుంటాడు. ఇంతలో మిస్సమ్మ అమర్ దగ్గరకు వెళ్లి ఏవండి ఈ డైట్ గియిటు అనకుండా ఇవాళ కడుపు నిండా తినండి. అనగానే శివరాం కూడా మిస్సమ్మ నువ్వు అచ్చం మా కొడలిలా వడ్డిస్తున్నావు అంటాడు. మా ఇష్టాలు ఇంత బాగా ఎలా గుర్తు పెట్టుకున్నావు మిస్సమ్మ అని నిర్మల అడగ్గానే.. మిస్సమ్మ ఎమోషనల్‌గా ఫీలవుతూ అవి ఎలా మర్చిపోతాను అత్తయ్య అంటుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. మనోహరి అత్తయ్యనా? అనగానే సారీ ఆంటీ మా అత్తయ్య వాళ్ల ఇంటికి వెళ్లొచ్చాను అలవాటులో మిమ్మల్ని అలాగే పిలాచాను అంటుంది మిస్సమ్మ దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఖైరతాబాద్ RTO ఆఫీసుకి జూనియర్ ఎన్టీఆర్ - ఎందుకో తెలుసా?