Nindu Noorella Saavasam Serial Today April 24th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: అమర్ చేతికి ఆరు కేసు ఫైల్ – మనోహరిని ప్రశ్నించిన కొడైకెనాల్ పోలీసులు
Nindu Noorella Saavasam Today Episode: అరుంధతి హత్య జరిగినప్పుడు పక్కనే ఉన్న మనోహరిని కొడైకెనాల్ పోలీసులు ప్రశ్నించడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: కొడైకెనాల్ వచ్చినప్పుడు ఇక్కడ ఆరు అక్కకు ఎక్కువ ఇష్టం ఏది అని భాగీ పిల్లలను అడుగుతుంది. పిల్లలు అమ్మకు ఇక్కడ డాబా మీదకు వెళ్లి గాలిపటం ఎగురవేయడం అంటే చాలా ఇష్టం అని చెప్తారు. అయితే మనం కూడా ఇప్పుడు గాలిపటాలు ఎగురవేద్దామా అంటూ పిల్లలను తీసుకుని పైకి వెళ్తారు. అందరూ కలిసి గాలిపటం ఎగురవేస్తుంటే ఇంతలో మనోహరి గాలిపటం ఎగురవేస్తుంది.
భాగీ: ఇంకో గాలిపటం వచ్చింది. అది ఎవరిది..?
మనోహరి: నాదే.. నేనే ఎగురవేశాను. ఏంటి మీ అమ్మను ఎవ్వరూ ఓడించలేరని తెగ మురిసిపోతున్నారు. చిన్నప్పటి నుంచి మీ అమ్మను ఈ గాలిపటం ఆటలో ఎన్నిసార్లు ఓడించానో తెలుసా..?
అంజు: అబద్దం మా మమ్మీ మీ మీద ఎన్నిసార్లు గెలిచిందో మాకు చెప్పింది
భాగీ: నిజం చెప్పడానికి అక్క లేదని మీరు మీకు నచ్చిన అబద్దం చెప్పి అదే నిజమని నమ్మించాలని చూస్తున్నారా..? మనోహరి గారు
రాథోడ్: అదేంటో మేడం అబద్దం చెప్పడం వెంటనే దొరికిపోవడం అది మీకే సాధ్యం.
అనామిక: మీరు అరుంధతి గారి ముందు ఎప్పుడూ గెలవలేదు మనోహరి గారు. ఇదే నిజం.
మనోహరి: కరెక్టే.. ఆరుతో పోటీ పడిన ప్రతిసారి నేను ఓడిపోయాను. అసలు గెలిచే చాన్స్ కూడా నాకు ఇవ్వలేదు. కానీ ఉన్నదంతా పణంగా పెట్టి ఒక్క ఆట ఆడాను గెలిచాను. అది ఈ అన్ని ఓటములను మరిపించింది.
అనామిక: నీ ఆట కట్టించి నిన్ను ఓడించడానికే మళ్లీ వచ్చాను ( మనసులో అనుకుంటుంది.)
మనోహరి: నువ్వు ఎన్నిసార్లు ఎన్ని అవతారాలు ఎత్తి వచ్చినా నా చేతిలో ఓడిపోవడం తప్పా వేరే ఆఫ్షన్ లేదు ఆరు. (మనసులో అనుకుంటుంది.)
భాగీ: అసలు మీరు ఇద్దరూ ఏమి మాట్లాడుకుంటున్నారు.
రాథోడ్: మాకైతే అర్థం కావడం లేదు. మీకేమైనా అర్తం అవుతుందా..?
అనామిక: పిల్లలతో పోటీ పడి గెలవమని చెప్తున్నాను రాథోడ్
మనోహరి: పిల్లలతో ఎందుకు నీతో ఆడి గెలుస్తాను. రమ్మని చెప్తున్నాను.. ఏ అనామిక ఈసారి గెలుపు ఎవరిదో చూద్దామా.?
అనామిక: నీతో గెలవడానికి నేనెందు ఆడాలి మనోహరి గారు పిల్లలతో ఆడించి గెలిపిస్తాను.
మనోహరి: వీళ్లతో ఆడాలా..? పిల్లలతో నేను ఆడటం ఏంటి.?
అంజు: మనోహరి ఆంటీ మాతో గెలవలేరని మీరు భయపడుతున్నారా..?
అమ్ము: భయపడకండి ఆంటీ మరీ అంత ఫాస్ట్‌గా గెలవము.. కాసేపు మిమ్మల్ని ఆడించి అప్పుడు మీ గాలిపటాన్ని కట్ చేస్తాం.
భాగీ: మనోహరిగారిని చూస్తుంటే పాపం భయపడుతున్నట్టు ఉన్నారు పిల్లలు. మనం ఎందుకు ఆమెను భయపెట్టడం మనం ఆడుకుందా పదండి
మనోహరి: సరే ఆడుదాం కానివ్వండి.
ఇద్దరి మధ్య గేమ్ మొదలవుతుంది.
అనామిక: అమ్ము గాలిపటాన్ని కాస్త లూస్ చేసి కిందకు లాగి మనోహరి గాలిపటం రైట్‌కు వెళ్లు .. కంగారు పడకు కాస్త మెల్లగా లాగు
అమ్ము: ఆ సరే ఓకే
అంటూ అనామిక చెప్పినట్టు ఆడి మనోహరిని ఓడిస్తారు పిల్లలు. మనోహరి కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత ఇటికి పోలీసులు రావడం చూసిన మనోహరి భయపడుతుంది.
మనోహరి: రాథోడ్ పోలీసులను తీసుకొచ్చాడేంటి..? అమర్‌కు నిజం తెలిసిపోయిందా ఏంటి నన్ను అరెస్ట్ చేయించడానికి తీసుకొచ్చారా..? ( మనసులో అనుకుంటుంది)
పోలీస్: అమరేద్ర గారు మీరు అడిగిన మేడం గారి మర్డర్ ఫైల్. ఆరోజు మీ ఇంట్లో వాళ్లు కాకుండా మేడం గారి ఫ్రెండ్ ఎవరో మీతో ఉన్నారని స్టేట్‌మెంట్ లో ఉంది.
అమర్: అవును ఉన్నారు.. తను మనోహరి… తనే ఆ రోజు ఆరుతో ఉంది.
పోలీస్: సార్ మీరు ఏమీ అనుకోకపోతే మేము ఒకసారి మనోహరి గారిని ప్రశ్నించవచ్చా…?
అమర్: తప్పకుండా అడగండి. మనోహరి వీళ్లు ఇక్కడి లోకల్ పోలీసులు. ఆరు మర్డర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. వీళ్లు నీతో మాట్లాడాలి అంట. నీకు తెలిసింది. నువ్వు చూసింది చెప్పు.
అని అమర్ చెప్పగానే.. మనోహరి సరే అంటుంది. పోలీస్ వెళ్లి మనోహరిని ప్రశ్నిస్తుంటే మను భయపడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















