అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today April 18th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కిడ్నాప్‌ గురించి మనోహరికి చెప్పిన రణవీర్‌ - రణవీర్‌ కోసం గాలిస్తున్న అమర్‌

Nindu Noorella Saavasam serial Today Episode April 18th: మనోహరి, రణవీర్‌కు కాల్ చేసి అమర్‌కు ఫోన్‌ చేసి బెదిరించమని చెప్తుంది. దీంతో ఇవాల్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది  

Nindu Noorella Saavasam Serial Today Episode: రణవీర్‌ ఫోన్‌ కాల్‌ కోసం మనోహరి ఎదురు చూస్తూ గార్డెన్‌లో అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. మనోహరి టెన్షన్‌ పడటం గమనించిన చంభా మనోహరి దగ్గరకు వెల్తుంది.

చంభా: ఏంటి మనోహరి రాత్రి నుంచి ఇంత టెన్షన్‌ పడుతున్నావు.. ఫోన్‌ చేయమని రణవీర్‌కు చెప్పావు కదా..? ఇంకా టెన్షన్‌ దేనికి

మనోహరి: వాడు చెప్పిన పని కరెక్టుగా చేసేవాడే అయితే నాకు ఇంత టెన్షన్‌ ఎందుకు ఉంటుంది. వాడు కరెక్టుగా వినేవాడే అయితే ఈ పాటికి నాకు ఫోన్‌ చేసేవాడు. ఇంకో రెండు గంటల్లో ఆకాష్‌కు ఇంజక్షన్‌ చేయాలి. లేదంటే చనిపోతాడు

చంభా: అమ్మో అదే కనక జరిగితే అమరేంద్ర ఎవ్వరినీ వదిలిపెట్టడు. రణవీర్‌తో మొదలుపెట్టి నీదాకా వచ్చి అందరినీ చంపేస్తాడు

మనోహరి: అదే కదా నా భయం కూడా కనీసం వాడు అమరేంద్రకైనా ఫోన్‌ చేసి చెప్పాడో లేదో తెలియదు

మనోహరికి కొత్త నెంబర్‌ నుంచి రణవీర్‌ కాల్‌ చేస్తాడు.

మనోహరి: హలో ఎవరు

రణవీర్‌: ఇంకెవరు నేనే మనోహరి

మనోహరి: హలో రణవీర్‌ ఫోన్‌ చేయడానికి ఇంత సేపు ఏంటి..? నిన్ను ఎప్పుడు చేయమన్నాను ఎప్పుడు చేస్తున్నావు..

రణవీర్‌: నా కోసం అమరేంద్ర పిచ్చి కుక్కలా రోడ్ల మీద తిరుగుతున్నాడు కదా..? వాణ్ని బాగా టెన్షన్‌ పెడుతున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది

మనోహరి: ఇది గర్వ పడే టైం కాదు. ఆకాష్‌కు ఇంకో రెండు గంటల్లో ఇంజక్షన్‌ చేయాలి

రణవీర్‌: నాకు గుర్తుంది మనోహరి. నువ్వు చెప్పావు కదా..? ఇంజక్షన్‌ ఇవ్వకపోతే వీడు పోతాడు అని కూడా చెప్పావు..

మనోహరి: వెంటనే అమరేంద్రకు కాల్‌ చేయ్‌ మర్యాదగా మన కూతురుని అప్పగించమని చెప్పు

రణవీర్‌: అలాగే ఇప్పుడే కాల్‌ చేస్తాను

మనోహరి: ఇంకో రెండు గంటల్లో ఆకాష్‌కు ఇంజక్షన్‌ ఇవ్వకపోతే చనిపోతాడన్న విషయం నీకు తెలుసన్న విషయం అమర్‌తో చెప్పు.. అప్పుడే ప్రెషర్‌ పెరిగి మన కూతురును అప్పగిస్తాడు. అర్థం అయిందా

రణవీర్‌: అర్థం కాకపోవడానికి నేనేమైనా చిన్న పిల్లాడినా మనోహరి

మనోహరి: అమర్‌కు ఫోన్‌ చేసి గంటల కొద్ది సోది చెప్పకు..  నీ ఫోన్‌ ట్రాప్‌ చేసి నువ్వు ఎక్కడున్నది తెలుసుకుని నిన్ను పట్టుకుంటాడు

రణవీర్‌: నాకు తెలుసే నా మాజీ భార్యామణి నువ్విలా స్పూన్‌ ఫ్రీడింగ్‌ ఇస్తే నాకు చిరాకు వస్తుంది

మనోహరి: సరే అంతా కరెక్టుగా చేయ్‌ ఉంటాను

అని కాల్  కట్‌ చేసి చూడగానే మనోహరి ఎదురుగా అంజు నిలబడి ఉంటుంది. అంజును చూసిన మనోహరి, చంభా షాక్ అవుతారు.

మనోహరి: (చంభా చెవిలో) ఇది ఎప్పుడు వచ్చింది..

చంభా: ఏమో తెలియదు

మనోహరి: అంతా వినేసింది అంటావా..?

చంభా: ఏమో తెలియదు మనోహరి

అంజు: మీరేం చేస్తున్నారు ఆంటీ ఏదో కాల్‌ ట్రేసింగ్‌ అంటున్నారు. ఎవరి ఫోన్‌ టాప్‌ చేస్తున్నారు

చంభా: (మనోహరి చెవిలో) విన్నావా మనోహరి ఆ పిల్ల ఏమీ వినలేదు

అంజు: చెప్పండి ఆంటీ ఫోన్‌లో ఎవరితో మాట్లాడుతున్నారు

మనోహరి: నేను ఆన్‌లైన్‌లో ఒక ఆర్డర్‌ పెట్టాను అంజు.. అది మిస్‌ అయింది. ఆ కంపెనీ వాళ్లకు ఫోన్‌ చేసి ఆర్డర్‌ ట్రేస్‌ చేయమని చెప్తున్నాను

అంజు: ఏం ఆర్డర్‌ పెట్టారు..?

మనోహరి: అవన్నీ నీకెందుకు పెద్ద ఆరిందలాగా అన్ని అడుగుతున్నావు..

అంజు: నేను తెలుసుకోకూడదా ఆంటీ..?

మనోహరి: అవన్నీ నీకు అవసరం లేదు.

అంజు: నేను తెలుసుకోకూడదా ఆంటీ..? ఆకాష్‌ ఏమో హాస్పిటల్‌ లో ఉన్నాడు. తనకు ఎలా ఉందో తెలియదు. రాత్రి రాథోడ్‌ ఎవరినో కిడ్నాప్‌ చేశారని వెళ్లాడు. ఇంత వరకు రాలేదు. మీరేమో ట్యాపింగ్‌ ట్రేసింగ్‌ అంటున్నారు నాకేం అర్థం కావడం లేదు

మనోహరి: చిన్న పిల్లవి చిన్నపిల్లలాగా ఉండు.. పెద్ద వాళ్ల విషయాల్లో వేలు దూర్చకు పైకి వెళ్లి చదువుకో.. వెళ్లు

అంటూ మనోహరి కోప్పడగానే.. అంజు వెళ్లిపోతుంది. మనోహరి కోపంగా చూస్తుంటే.. చంభా మెల్లగా ఆ పిల్లను చూస్తుంటే.. నిన్ను చూసినట్టే ఉంది మనోహరి ఈ పిల్లే నీ కూతురేమో అనిపిస్తుంది అంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Charishma Shreekhar : బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
Godavari Serial Today August 20th: 'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
Nindu Manasulu Serial Today August 20th: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Embed widget