Nindu Noorella Saavasam Serial Today April 12th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: మిస్సమ్మ దొంగ అని ఫ్రూవ్ చేసిన మనోహరి – మిస్సమ్మను ఇంట్లోంచి వెళ్లిపొమ్మన్న అమర్
Nindu Noorella Saavasam Today Episode: మిస్సమ్మే నగలు దొంగతనం చేసిందని మనోహరి నిరూపించడంతో అమర్ మిస్సమ్మను ఇంట్లోంచి వెళ్లిపోమ్మని చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది.
Nindu Noorella Saavasam Serial Today Episode: ఆ ఇంట్లోంచి ఇప్పుడే ఎందుకొచ్చావని అమర్ అడగడంతో ఏం మాట్లాడకుండా ఉంటుంది మనోహరి. దీంతో నాకు మౌనంతో కాదు మాటలతో సమాధానం కావాలని అమర్ అడుగుతాడు. చెప్తాను అమర్ కానీ ఈ ఇంట్లో ఒకర్ని నాలుగు ప్రశ్నలడిగి ఆ తర్వాత నీకు సమాధానం చెప్తాను అంటుంది మనోహరి. కోపంగా మిస్సమ్మను పిలుస్తుంది. మిస్సమ్మ వస్తుంది.
మనోహరి: వావ్ మిస్సమ్మ వావ్ నీ స్క్రీన్‌ప్లే అదిరిపోయింది. ఇంత ఎక్స్ పీరియన్స్ ఉన్న నాకే అర్థం కావడానికి చాలా టైం పట్టింది.
మిస్సమ్మ: పొగిడినందుకు థాంక్స్. కానీ మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు.
మనోహరి: అర్థం అవుతుంది మిస్సమ్మ.. మెల్లగా ఒక్కోక్కటి అర్థం అవుతుంది. ఫోటో దగ్గర నగలు పెట్టి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పింది మిస్సమ్మే కదా?
అనగానే మిస్సమ్మ అవును అంటూ నీ దగ్గర ఉన్నవి డూప్లికేట్ నగలు అంటూ ప్రూవ్ చేయడానికే ఇలా చెప్పానని మిస్సమ్మ చెప్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. దూరం నుంచి చూస్తున్న అరుంధతి ఆయ్యో మనోహరి ప్లాన్ ఇంకా మిస్సమ్మకు అర్థం కాలేదని బాధపడుతుంది. నేను ఎలా ఆపగలను అని ఏడుస్తుంది.
అమర్: అసలేం జరిగింది మనోహరి. ఆరు నగలు ఎక్కడున్నాయి. నీ దగ్గరికి ఈ డూప్లికేట్ నగలు ఎందుకొచ్చాయి.
మనోహరి: అది అడగాల్సింది నన్ను కాదు అమర్. ప్లాన్ చేసి పర్ఫెక్టుగా ఎగ్జిక్యూట్ చేసి ఏమీ తెలియనట్టు ఇక్కడ నిల్చున్న ఈ మిస్సమ్మని.
అని మనోహరి చెప్పగానే అందరూ షాక్ అవుతారు. నగలకు, మిస్సమ్మకు సంబంధం ఏంటి? అని అమర్ అడగ్గానే మిస్సమ్మ, వాళ్ల నాన్న కలిసి అసలు నగలు కొట్టేసి వాటి స్థానంలో డూప్లికేట్ నగలు పెట్టారు. అంటూ మిస్సమ్మను వాళ్ల నాన్నను తిడుతుంటే మిస్సమ్మ వాళ్లకు వార్నింగ్ ఇస్తుంది. అమర్ కూడా మిస్సమ్మ తప్పు చేసిందంటే నేను నమ్మను అంటాడు.
శివరాం: అమ్మా మనోహరి ఆరోపణలు చేసే ముందు ఆధారాలుండాలి.
మనోహరి: మీకు కావాల్సింది ఆధారాలే కదా? మూసుకున్న మీ కళ్లు తెరుచుకునేలా వీళ్ల మాయలో బయటపడేలా? నిజాన్ని మీ కళ్లకు కట్టినట్లు చూపిస్తాను రండి.
అని మిస్సమ్మ రూంలోకి వెళ్లి నగలు ఉన్న బ్యాగ్ తీసుకొచ్చి అందరికీ చూపిస్తుంది. దూరం నుంచి చూస్తున్న అరుంధతి బాధపడుతుంది. మనోహరి అందరికీ చూపిస్తుంది. ఆ నగలు చూసిన శివరాం, నిర్మల ఇవి అరుంధతి నగలే అని అంటారు.
మనోహరి: మీలో ఎవరికైనా ఇంకా అనుమానం ఉంటే జువ్వెల్లరీ షాపుకు వెళ్లి చెక్ చేయిద్దాం..
మిస్సమ్మ: మనోహరి గారు నామీద దొంగ అనే ముద్ర వేయాలని చూడకండి. ఈ నగలు తీసుకునే అవసరం నాకు లేదు.
మనోహరి: నువ్వు తీసుకురాకుండా నువ్వు చేంజ్ చేయకుండా డూప్లికేట్ నగలు నా దగ్గరకు ఎలా వచ్చాయి. వర్జినల్ నగలు నీ రూంలోకి ఎలా వచ్చాయి.
మిస్సమ్మ: ఎలా వచ్చాయో నాకు కూడా తెలియదు.
మనోహరి: అవునా నగలు నీ రూంలో ఉన్నాయని నీకు తెలుసా? లేదా?
మిస్సమ్మ: తెలుసు కానీ ఎలా వచ్చాయో కానీ తెలియదు.
మనోహరి: విన్నావా అమర్ ఉన్నాయని తెలుసట. కానీ ఎలా వచ్చాయో తెలియదట.
అంటూ నువ్విదంతా ఎందుకు చేశావంటే నువ్వు ఈ పెళ్లి అపాలనుకున్నావు కాబట్టి ఈ తతంగం అంతా నడిపించావు అంటుంది మనోహరి. అమర్ ఈ మిస్సమ్మను వెంటనే ఇంట్లోంచి వెళ్లిపోమ్మని చెప్పు అంటుంది. దీంతో మిస్సమ్మ సార్ నేను అనగానే అమర్ తప్పు చేశావు మిస్సమ్మ. నీకు ముందే చెప్పాను నాకు అబద్దం అంటే నచ్చదని అనడంతో మిస్సమ్మ ఇక తానే వెళ్లిపోతానని అనడంతో..
మనోహరి: నీలాంటి మోసగాళ్లు, దొంగలు ఈ ఇంట్లో ఇంకొక క్షణం కూడా ఉండటానికి వీల్లేదు.
అరుంధతి: గుప్త గారు ప్రళయం ముంచుకొస్తుంది. ప్రమాదం మనోహరి రూపంలో వస్తుంది అంటే నాకు అర్థం కాలేదు. నేనే ప్రళయాన్ని సృష్టించడానికి ఒక అవకాశం ఇస్తాననుకోలేదు.
అనగానే గుప్త కోపంగా నేను ముందే చెప్పాను కదా ఆ బాలికకు శక్తుల తోడవుతున్నాయి. అనగానే ఇప్పుడే వెళ్లి మిస్సమ్మకు నిజం ఎంటో చెప్పేస్తాను అనగానే నువ్వు ఇచ్చిన మాట తప్పిన వెంటనే నిన్ను ఈ లోకం నుంచి మా లోకం తీసుకెళ్తాను అని గుప్త చెప్పగానే ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: శ్రద్దాదాస్ అందాల జాతర- శారీలో గ్లామర్ షో!