Nindu Noorella Saavasam Serial Today April 19th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: అరుంధతికి అడ్డంగా మారిన ఘోర గీసిన బంధన రేఖ
Nindu Noorella Saavasam Today Episode: గుప్తాకు ఇచ్చిన మాట తప్పిన అరుంధతి. మిస్సమ్మ శరీరంలోకి ప్రవేశించి మనోహరి పెళ్లి ఆపాలనుకుంటుంది. పిల్లలతో కలిసి మండపానికి వెళుతుంది కానీ అక్కడ ..
Nindu Noorella Saavasam Today Episode: పిల్లలకి కథ చెప్పడం పూర్తి చేసిన మిస్సమ్మ రూపంలో ఉన్న అరుంధతి, వాళ్ళని తీసుకుని కళ్యాణ మండపానికి బయలుదేరుతుంది. వాళ్ల పెళ్లి అయిపోయింది కదా ఎలా ఆపగలం అని అడుగుతాడు రాథోడ్. పెళ్లి ఇంకా అవలేదు తాళి కట్టలేదు ఎలా అయినా ఆపుదామని అందరినీ బయలుదేరదీస్తుంది మిస్సమ్మ లో ఉన్న అరుంధతి. అదే సమయానికి కల్యాణ మండపానికి బీహార్ గ్యాంగ్ చేరుకుంటారు. కోపంతో రగిలిపోతూ మనోహరి దగ్గరకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. కానీ అప్పటికే వాచ్మెన్ ద్వారా సమాచారం అందుకున్న మనోహరి బాగా ఆలోచించి పెళ్లికూతురు స్థానంలో తనతో ఉండే పని అమ్మాయిని కూర్చోబెడుతుంది. పెళ్ళికూతురు పేరు మనోహరి కానీ ఇద్దరూ ఒకటి కాదు అని తెలుసుకొని బయటకు వెళ్ళిపోతాడు బీహార్ గ్యాంగ్ పెద్దమనిషి. కానీ అతనికి అనుమానం ఉండిపోతుంది పెళ్లయ్యే వరకు ఇక్కడే ఎక్కడో ఒకదగ్గర ఉండి మనోహరి పని పడదామని నిర్ణయించుకుంటారు.
పిల్లలతో కలిసి అరుంధతి కళ్యాణ మండపాన్ని చేరుకుంటుంది. ఎందుకైనా మంచిది మరోసారి ఆలోచించమని చెబుతాడు చిత్రగుప్త. కానీ అందుకు ససేమిరా అంటుంది అరుంధతి. నేను చేయాలనుకున్నది ఇప్పుడు చెయ్యకపోతే పక్కనే ఉండి కూడా పిల్లలను కాపాడుకోలేకపోయానని ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాను అంటుంది. కానీ ఆశ్చర్యకరంగా ఎంత ప్రయత్నించినా కళ్యాణమండపం లోపలికి వెళ్లలేక పోతుంది అరుంధతి. ఏం జరిగిందో తెలిసేలోపే మిస్సమ్మ శరీరాన్ని వదిలేస్తుంది.
అరుంధతి : గుప్తా గారు ఏం జరిగిందో చెప్పండి నేను ఎందుకు లోపలికి వెళ్లలేక పోతున్నాను. . దయచేసి చెప్పండి
గుప్త : ఆ ఘోర నువ్వు లోపలికి ప్రవేశించకుండా బంధన రేఖ గీశాడు.
అరుంధతి : అంటే నేనిప్పుడు లోపలికి..
ప్లాష్ బ్యాక్ లో
ఘోరా : లోపలికి రాలేదు. ఈ ఘోర గీసిన బంధనాన్ని దాటి లోపలికి రాలేదు. ఆత్మ రాలేదని అభయమించాను కదా ఇంకా ఎందుకు నీ మనసులో సందేహ పడుతున్నావు.
మనోహరి : పెళ్లి పీటల మీదకి వచ్చేవరకు గెలుపు నాదేనని చాలా ధీమాగా ఉన్నాను కానీ కళ్యాణ ఘడియలు దగ్గర పడే కొద్దీ నా మనసులో ఏదో భయం, ఆందోళన ఉన్నాయి ఘోరా.. గంట ముందు వరకు అంతా కరెక్ట్ గానే ఉందనిపించినా మనసు మాత్రం ఎందుకో కీడు శంకిస్తోంది.
ఘోరా : ఎన్నాళ్ళ నుంచో కన్న కల కదా. కళ్ళ ముందుకు వస్తుంటే అది ఎప్పుడు కలగానే మిగిలిపోతుందేమోనని మనసు భయం అంతే. నీకు ఏ భయం అవసరం లేదు.నీవు నిశ్చింతగా వెళ్లి పెళ్లి పీటల మీద కూర్చో. నీ పెళ్లి జరగకుండా ఎవరు ఆపలేరు.
అరుంధతి : నేను ఆపుతా, ఆపాలి గుప్తా గారు.. ఆపాలి. ఆయనతో మనోహరి పెళ్లి ని ఎలా అయినా ఆపాలి. ఆపి తీరుతా.
గుప్త : ఈ రేఖను నువ్వు దాటి వెళితే ఆపగలవు కానీ ఆ రేఖను దాటే శక్తి మాత్రం మీకు లేదు.
అరుంధతి : గుప్తా గారు మీరు ఏదైనా చేసి ఈ రేఖను చెరిపేయగలరా
గుప్త : ఈ రేఖ ఇక్కడ ఉండటం దైవ నిర్ణయం ఆ దైవ నిర్ణయాన్ని మీరు ధిక్కరించగలరా
గుప్త : నీ మటుకు నువ్వు ఆ బాలిక శరీరంలో ప్రవేశించి , ఆ పిల్ల పిచ్చుకల దగ్గరకు వెళ్లి పెళ్లిని ఆపుతానని గొప్పగా చెప్పితివి. మీ వల్ల ఇప్పుడు ఆ బాలిక ఇరకాటంలో పడింది.
మిస్సమ్మకి తెలివి వస్తుంది. తాను ఎక్కడున్నానో అర్థం కాదు . అప్పటికే కళ్యాణమండపంలోకి వెళ్ళిన పిల్లలు బయటకి వచ్చి మిస్సమ్మని ఆశ్చర్యంగా చూస్తారు.