అన్వేషించండి

Nindu Manasulu Serial Today March 30th: నిండు మనసులు: విజయానంద్ కుట్ర! సిద్ధూని దూరం పెట్టిన ప్రేరణ! రంజిత్ ఐశ్వర్యని లవ్ చేస్తున్నాడా!

Nindu Manasulu Serial today episode march 30th ప్రేరణ సిద్ధూని సిద్ధూ గారు అంటూ ఇక మీద కలిసి పని చేయను అని చెప్పేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial today episode విజయానంద్ రాజశేఖరంతో మళ్లీ ఎందుకు వచ్చావ్‌రా.. నా గతం మొత్తం తెలిసి కూడా భయం లేకుండా నా దగ్గరకు వచ్చావంటే గట్టోడివే అని అంటాడు. మంజుల గారు వస్తే మాట్లాడుదాం అని అనుకుంటున్నా అని రాజశేఖరం అంటే.. నీ కొడుకు వస్తాడు.. వెళ్లిపో నా ఇంటి దగ్గర నువ్వు ఉండొద్దు అని విజయానంద్ అంటాడు. ఏంటి నీ ఇల్లా నువ్వేమైనా కష్టపడి సంపాదించి కట్టావా.. ఎన్నో మోసాలు హత్యలు చేసి,, నా అన్న వాళ్లకి వెన్నుపోటు పొడిచావ్.. మాయమాటలు చెప్పి మంజుల గారిని మోసం చేశావ్.. నిజం తెలిసిన రోజు నీ పరిస్థితి ఏంటో తెలుసుకో అని అంటాడు.

విజయానంద్ రాజశేఖర్‌తో నా ఇంటికి వచ్చి నా గతం మాట్లాడుతావా.. నీ వాలకం చూస్తుంటే నువ్వు ఎక్కువ రోజులు బతకవు అనిపిస్తుంది. నిన్ను కూడా నీ బాస్ శరత్ దగ్గరకు పంపిస్తా.. ప్రాణాల మీద ఆశ ఉంటే వెళ్లిపో అని అంటాడు. నాకు ప్రాణాల మీద ఆశ లేదు.. నిన్ను మాత్రం నేను వదలను.. నన్ను చంపేసినా నీ మీదకే వస్తుంది. నేను కలిసింది నీతోనే అని అంటాడు. విజయానంద్ ఇలా కాదు అని సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అని అంటాడు. ఉన్నాయి కానీ నీకు కాదు నీ కొడుకుకి కాదు కాదు శరత్ గారి వారసుడికి ఇస్తాను అని అంటాడు. అప్పుడు శరత్ గారికి నువ్వు చంపావన్న సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి.. అవి అందరికీ ఇస్తా ఇప్పుడు నువ్వు పారిపోయినట్లు చేస్తా అని విజయానంద్ అంటాడు. ఇంతలో గణ రావడంతో ఈ విషయం ఇక్కడితో మర్చిపో నీ కొడుకుకి చెప్తే నీ ఫ్యామిలీ గురించి నేను ఆలోచించాల్సి వస్తుందని అంటాడు.

గణ తండ్రితో ఈ ఇంటికి ఎందుకు వచ్చావ్ నాన్న.. మీకు ముందే పరిచయం ఉందా అని అడుగుతాడు. మీ నాన్నకి నేను బాగా తెలుసు. నేను ఈ రోజు ఇలా ఉండటానికి మీ నాన్నే ఒక విధంగా కారణం.. సరే మీ నాన్నని త్వరగా తీసుకెళ్లు.. మళ్లీ మా సిద్ధూ చూస్తే గొడవలు అవుతాయ్ అని అంటాడు. గణ తండ్రిని తీసుకెళ్లిపోతాడు. ఐశ్వర్య రంజిత్‌కి వడ్డిస్తూ అన్నీ నేనే చేశా.. తృప్తిగా తినండి అని అంటుంది. అయితే తిన్నట్లే అని రంజిత్ అంటే ఐశ్వర్య బుంగ మూతి పెడుతుంది. ఇంతలో ప్రేరణ అక్కడికి వస్తుంది. సిద్ధూ కూడా వస్తాడు. సిద్ధూని చూసి ప్రేరణ ఏం మాట్లాడదు.. రంజిత్  చూసి రా సిద్ధూ భోజనం చేద్దువు.. ఐశ్వర్య వంట చేసింది.. అని అంటాడు. ఇక సిద్ధూ డబ్బులు టేబుల్ మీద పెట్టి ఈ నెల కేఫ్ లాభంలో షేర్ అని అంటాడు. దానికి ప్రేరణ కోపంగా ప్రతీ నెల షేర్ జాయింట్ అకౌంట్‌లో వేస్తే ఇద్దరం తీసుకుంటాం కదా.. ఇంటికి  ఎవరు తీసుకురమ్మన్నారు.,. అసలు నీకు ఇక్కడికి ఎవరు రమ్మన్నారు అని అడుగుతుంది. నేనే సిద్ధూని పిలిచాను అని రంజిత్ అంటాడు. 

ఇందిర రంజిత్‌తో మీరు రమ్మన్నారా,, ఎందుకు బాబు అని అడుగుతుంది. కేఫ్ గురించి ఈ విషయం అందరి ముందు మాట్లాడాలి అని అంటాడు. మీ ఇద్దరినీ చూస్తే ఇక ముందు కేఫ్‌లో కలిసి పని చేస్తారు అని అనిపించడం లేదు అనిపిస్తుందని అంటాడు. నేను చూసుకోలేను ఇక ముందులా నేను కేఫ్ పనులు చూసుకోలేను.. చూసుకుంటే ఇన్ని రోజులు నాతో పాటు సమానంగా చూసుకున్న సిద్ధూ గారే చూసుకుంటారు అని అంటుంది. సిద్ధూ షాక్ అయి ఏంటి సిద్ధూ గారా.. సడెన్‌గా ఈ పిలుపు ఏంటి.. నా మీద అభిమానంతోనా.. ఇక నుంచి కేఫ్‌ని నేనే చూసుకోవాలి అనా అని అడుగుతాడు. ఏకవచనంతో పిలుచుకునే అంత చనువు మన మధ్య ఎందుకు అనిపించింది అందుకే అలా పిలిచాను అంటుంది. అలాగే సరే ప్రేరణగారు.. మీరు ఎలా చెప్తే అలాగే ప్రేరణగారు.. సార్ నా మనసులో మాట చెప్పేస్తా.. ఇన్నాళ్లు నాతో కలిసి పని చేసిన ప్రేరణ గారు చేయను అంటే నేను ఒక్కడినే కేఫ్ నడిపించలేను అని అంటాడు. ఎవరూ నడిపించకపోతే కేఫ్ పోతుంది కదా అని రంజిత్ అంటే వారం గడువు ఇవ్వండి సార్ ఏంతైనా నాకు కేఫ్ ఎన్నో తీపి జ్ఞాపకాలు ఇచ్చింది అని అంటాడు. దాంతో రంజిత్ అప్పటి వరకు కేఫ్ వదిలేస్తే  మూతపడుతుందని అందరూ అనుకుంటారు కాబట్టి మీ ఇద్దరూ వారం నడపండి.. తర్వాత ఏం చేయాలో చూద్దాం అని అంటాడు. ఐశ్వర్య శ్రీరామనవమి గురించి మాట్లాడుతుంది. అన్నీ ఏర్పాట్లు చేసేశా..  తాళి కూడా తీసుకొచ్చా.. అందర్ని పిలవండి.. అంగరంగ వైభవంగా చేద్దాం.. సిద్ధూ కుదిరితే నువ్వు రా అని రంజిత్ అంటే కచ్చితంగా వస్తా అని సిద్ధూ అంటాడు. 

విజయానంద్, గణని పిలిచి ఆ ప్రేరణ వాళ్లు నీకు ఏమవుతారు అంటే నాకు ఏం కారు మా నాన్నకి అవుతారు అని గణ అంటాడు. మీ నాన్న ప్రవర్తన చూస్తే నువ్వు చిక్కుల్లో పడతావ్ అని అంటాడు. నేను గట్టిగా మాట్లాడితే ఉలుకు పలుకు లేకుండా ఉంటాడు మానాన్న.. అంత వరకు వస్తే ఏం చేయాలో నాకు తెలుసు అని గణ అంటాడు. మీ నాన్న వాళ్లకి అండగా నిలిస్తే.. వాళ్లే నా పిల్లలు అని అంటే.. అందుకే చెప్తున్నా మీనాన్నని ఎవరితోనూ కలవనివ్వకు.. కనిపెడుతూ ఉండూ అని చెప్తాడు. అలాంటి పరిస్థితి వస్తే నేను అన్నీ కోల్పోయినవాడిని అవుతా అని గణ అంటాడు.  గణ తండ్రి చాటుగా ఇద్దరి మాటలు విని ఈ రాక్షసుడు (విజయానంద్) నా పతనానికి దారి వేస్తున్నాడు.. ఇప్పటికే నా ఇందిరకు పిల్లలకు చాలా అన్యాయం చేశాను.. ఇంకా భయపడితే వీళ్లు ఏమైనా చేయొచ్చు.. అలా జరగడానికి వీల్లేదు.. వాళ్ల సంతోషమే నాకు ముఖ్యం. ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటాడు రాజశేఖరం. గణ తండ్రిని చూసి అయ్యో నాన్న నాకు తెలీదు అనుకున్నావా నువ్వు నన్ను ఫాలో అవ్వడం చూస్తా రేపు ఏం చేస్తావో అని అనుకుంటాడు. 

శ్రీరామనవమి వేడుకలకు అన్నీ ఏర్పాట్లు జరుగుతాయి. రంజిత్‌ అటుగా వెళ్తూ ఐశ్వర్య లంగావోణిలో రెడీ అయి సెల్ఫీలు తీసుకుంటూ ఉంటే చూస్తూ ఉండిపోతాడు. ఐశ్వర్య ఫోన్‌లో రంజిత్‌ని చూసి ఆగిపోతుంది. రంజిత్ దగ్గరకు వచ్చి చూస్తుంటే ఏంటి ఓనర్‌ గారు అలా చూస్తున్నారు.. ఈ రోజు శ్రీరామనవమి అని అందంగా రెడీ అయ్యాను.. అందుకే  ఫోటోలు తీసుకుంటున్నాను అని అంటుంది. నువ్వే ఫొటోలు తీసుకుంటావా నన్ను పిలవవా అని రంజిత్ అంటాడు. ఇద్దరూ కలిసి సెల్ఫీలు తీసుకుంటారు. ఐశ్వర్యని చూసి రంజిత్ అలా నవ్వుతూ ఉండిపోతాడు. చివరకు రంజిత్ సరే శ్రీరామనవమి కదా త్వరగా రెడీ అవ్వు అంటాడు. ఐశ్వర్య రంజిత్ కళ్లద్దాలు తీసి తుడిచి పెట్టి మీకు నిజంగా సైట్ ఉందా నేను ఇంత అందంగా రెడీ అయితే మీకు రెడీ అయినట్లు లేదా అని అంటుంది. సరే ఈ ఒక్క సారికి నిజం చెప్తా ఈ డ్రస్‌లో చాలా బాగున్నావ్ అని అంటాడు. ఐశ్వర్య అలా ఉండిపోతుంది. నేను వేసుకున్న తర్వాతే ఈ డ్రస్‌కి అందం వచ్చింది.. అందరూ నాలా రెడీ అవ్వలేరు అని అంటుంది. మీ పంచె కట్టు కూడా బాగుంది అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today August 18th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: కల్యాణ్‌ పేరు ధీరజ్‌నే రాశాడని గోల చేసిన ప్రేమ! గుడ్‌ బై చెప్పేసిన ధీరజ్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: కల్యాణ్‌ పేరు ధీరజ్‌నే రాశాడని గోల చేసిన ప్రేమ! గుడ్‌ బై చెప్పేసిన ధీరజ్!
Jagadhatri Serial Today August 17th:కోర్టులో వివేక్ మిశ్రాకు చుక్కలు చూపించిన జేడీ...కేసు ఓడిపోతే ఉద్యోగం వదిలేస్తానని ఛాలెంజ్‌
జగద్ధాత్రి సీరియల్: కోర్టులో వివేక్ మిశ్రాకు చుక్కలు చూపించిన జేడీ...కేసు ఓడిపోతే ఉద్యోగం వదిలేస్తానని ఛాలెంజ్‌
Karthika Deepam 2 Serial Today August 18th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న సూరజ్‌కి మనసులో మాట చెప్పేస్తుందా! సూరజ్ భర్త్‌డేకి మాలిని సందడేంటి?
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న సూరజ్‌కి మనసులో మాట చెప్పేస్తుందా! సూరజ్ భర్త్‌డేకి మాలిని సందడేంటి?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని చూసిన లక్ష్మీకి తెలిసిన నిజం! కేడీ, సంధ్యలకు షాక్‌ ఇచ్చిన సిరి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని చూసిన లక్ష్మీకి తెలిసిన నిజం! కేడీ, సంధ్యలకు షాక్‌ ఇచ్చిన సిరి!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Embed widget