అన్వేషించండి

Nindu Manasulu Serial Today March 24th: నిండు మనసులు: ఇందిరతో తన ప్రేమ విషయం చెప్పేసిన సిద్ధూ! కూతుళ్ల కోసం గణకి ఎదురు తిరిగిన రాజశేఖరం!

Nindu Manasulu Serial Today March 24th సిద్ధూ ప్రేరణని ప్రేమిస్తున్నట్లు ఇందిరతో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

 Nindu Manasulu Serial Today Episode రాజశేఖరం ఇందిరకు కాల్ చేయాలని ఫోన్ చేస్తాడు. డైల్ చేయగానే ఈశ్వరి వచ్చి ఫోన్ లాక్కుంటుంది. మీరు ఇలాంటిది చేస్తారు అని నాకు తెలుసు.. అది నా ఇంట్లో పనిమనిషిలా ఉంటూ నా కాళ్లు పట్టుకుంది అలాంటి దాన్ని తీసుకొచ్చి నా పక్కన కూర్చొపెడతాను అంటే ఊరుకుంటానా.. అయినా నా కొడుకు ఎక్కడ ఆ దిక్కుమాలిన వాళ్లు ఎక్కడ అని ఈశ్వరి అనడంతో రాజశేఖరం కోపంగా చూస్తాడు. వాళ్లు మా కాలి గోటికి కూడా సరిపోరు.. అలాంటి వాళ్లకి మీరు కాల్ చేసి క్షమాపణ చెప్పి మళ్లీ వాళ్లని ఇక్కడికి తీసుకొస్తారా.. అయినా ఆ తల్లీకూతుళ్లు కలిసి ఎలాంటి ఘనకార్యాలు వెలగబెడుతున్నారో అని ఈశ్వరి అనగానే రాజశేఖరం కొట్టడానికి చేయి ఎత్తుతాడు.

ఈశ్వరి కోపంతో అయితే మీరు ఇప్పుడు చెప్పండి.. మీ మొదటి భార్య నేనా అదా చెప్పండి అని అడుగుతుంది. మరోవైపు ఇందిర ఆయన ఫోన్ చేయడం కలా నిజమా అని అనుకుంటుంది. ప్రేరణ, ఐశ్వర్యలు వచ్చి ఎందుకు ఆయనకు ఫోన్ చేస్తున్నావ్ అని అడుగుతారు. ఆయన నలుగురిలో మన పరువు తీశారు.. ఇప్పుడు ఎందుకు ఆయనతో మాట్లాడాలి అనుకుంటున్నావ్.. వద్దమ్మా వద్దు మాట్లాడకు అని అంటుంది. ఈశ్వరి రాజశేఖరానికి ప్రశ్నిస్తూ ఉంటే గణ వచ్చి ఏమైందని అడుగుతాడు. ఈయన గారికి వాళ్ల మీద ప్రేమ పొంగుకొచ్చినట్లు ఉందిరా.. ఫోన్ చేయడానికి రెడీ అయ్యారు.. నేను ప్రశ్నించడంతో నా మీద చేయి ఎత్తారు అని చెప్తుంది. గణ కోపంగా ఏంటి వాళ్లకి మాకు తేడా మీకు తెలీడం లేదా.. వాళ్ల గురించి ఆలోచించడానికి ఏం లేదు.. ఇక వాళ్లని మర్చిపో వాళ్లు బజారు మనుషులు అంటాడు. ఎవరిని బజారు మనుషులు అని రాజశేఖరం అంటే ఇంకెవరూ వాళ్లే అని గణ అంటాడు. వాళ్లు అలాంటి వాళ్లు కాదు.. వాళ్లని తక్కువ చేస్తే బాగోదు అని అంటాడు. గణ, ఈశ్వరి ఇద్దరూ మీకు వాళ్లు మేం ఒకలా కనిపిస్తున్నామా.. మీకు మాకంటే వాళ్లే ఎక్కువా అని అడుగుతారు. అవును మీ కంటే వాళ్లే ఎక్కువ అని అంటాడు. గణ, ఈశ్వరి షాక్ అయిపోతారు. 

సిద్ధూ ప్రేరణని ప్రేమిస్తున్నాను అనే విషయం తన తల్లికి ముందు చెప్పి పర్మిషన్ తీసుకొని తర్వాత ప్రేరణకి చెప్పాలి అనుకుంటాడు. సిద్ధూ ఇందిరతో మీతో మాట్లాడాలి అని పక్కకి తీసుకెళ్తాడు. ప్రేరణ, ఐశ్వర్యలు ఏమైందా అని అనుకుంటారు. మంజుల విజయానంద్, సాహితిలకు చెప్తుంది. నా గొంతులో ప్రాణం ఉండగా ఇద్దరినీ పెళ్లి చేసుకోనివ్వను అని మంజుల అంటుంది. సాహితి తల్లితో నువ్వు ముందు అన్నయ్య వాళ్ల నాన్నని పెళ్లి చేసుకున్నావ్ తర్వాత మా నాన్నని చేసుకున్నావ్ ఒక వేళ నాన్న నిన్ను పెళ్లి చేసుకోకపోయి ఉంటే అన్నయ్య ఎవరికి పుట్టాడు అని అనుంటే ఏం చేసేదానివి అని అడుగుతుంది. దాంతో విజయానంద్ సాహితిని కొట్టడానికి చేయి ఎత్తుతాడు. ప్రేరణ వాళ్ల నాన్నే వాళ్లని మోసం చేయొచ్చు కదా.. అబద్ధం చెప్పొచ్చు కదా అని అంటుంది. నీకు అర్థం చేసుకొనే వయసు మనసు రెండూ లేవు వాళ్లకి మనకి పోలిక ఏంటి.. వాళ్ల కోసం నీ నాన్నని నన్ను పోల్చుతావా,, మీ నాన్న నన్నుఎందుకు మోసం చేస్తారు అని ఏడుస్తుంది. 

సిద్ధూ ఇందిరతో ఆంటీ నేను ఎవరినైనా ప్రేమించినా వాళ్ల తల్లిదండ్రులకు ముందు విషయం చెప్పాలి అనుకున్నా ఆంటీ నేను ప్రేరణని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను.. అని అంటాడు. ఇందిర షాక్ అయిపోతుంది. ప్రేరణని నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాను ఆంటీ ఈ విషయం నేను ముందు పెట్టుకున్న రూల్ ప్రకారం మీకు చెప్తున్నాను.. ప్రేరణకు ఈ విషయం చెప్పడానికి నాకు పర్మిషన్ కావాలి అంటాడు. నేను పర్మిషన్ ఇవ్వకపోతే ఏం చేస్తావ్ అని అడుగుతుంది. మీకు ప్రేరణకు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకుంటా అని సిద్ధూఅంటే వద్దు బాబు నీకు ప్రేరణకి మధ్య మా గతం అడ్డుగా ఉంటుంది. ప్రేరణ మీద నీకు ఉన్న ప్రేమ వదులుకో బాబు అని అంటుంది. ప్రేరణ కోసం నేను ఎవర్ని అయినా ఎదుర్కుంటా ఎవరినైనా వదులుకుంటా అని సిద్ధూఅంటే మీ అమ్మని కూడానా బాబు.. తనకి చెప్పావా అని అంటే చెప్పాను అని సిద్ధూ అంటాడు.  మీ అమ్మ కచ్చితంగా వద్దు అంటారు. ఇప్పుడు చెప్పు ప్రేరణ కోసం మీ అమ్మని వదులుకుంటావా అని అడుగుతుంది. మీ భయం మా అమ్మే అయితే తనని నేను ఒప్పిస్తా.. గతం మా అమ్మకి తెలిస్తే ప్రేరణని మా అమ్మ నా కంటే బాగా చూసుకుంటుంది అని అంటాడు. ప్రేరణని కన్న వాడే మీకు మాకు సంబంధం లేదు అని చెప్పాడు. కన్నవాళ్లు అబద్ధం చెప్పినా నేను మిమల్ని ప్రేరణని నమ్ముతున్నా అని సిద్ధూ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
Godavari Serial Today August 20th: 'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
Nindu Manasulu Serial Today August 20th: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 20th:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?
నువ్వులేక నేను లేను:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Embed widget