chinni serial today march 24th: చిన్ని సీరియల్: చిన్నికి నిజంగానే ప్రాణగండం ఉందా! నాగవల్లి, దేవాతో స్వామీజీ ఏం చెప్పారు?
chinni serial today episode march 24th చిన్నిని చంపేయమని నాగవల్లి దేవాతో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode చిన్ని నాగవల్లితో థ్యాంక్స్ అత్త నాకు మ్యాడీకి పెళ్లి చేసినందుకు అని అంటుంది. ఈ విషయం నీకు ఎలా తెలిసింది అని నాగవల్లి చిన్నిని అడిగితే మీరు మామయ్యకి చెప్పినప్పుడు మొత్తం విన్నాను అత్తయ్యా అని చెప్తుంది. నాగవల్లి షాక్ అయిపోతుంది. ఇలా కూడా పెళ్లి చేస్తారు.. ఇలా కూడా ప్లాన్ చేస్తారా అని మీ వల్లే తెలిసింది. మీరేం ప్లాన్ చేసినా సరే నేను ప్రేమించిన మ్యాడీతో నాకు పెళ్లి చేసినందుకు థ్యాంక్స్ అంటుంది. నేను చచ్చేంత వరకు మ్యాడీ భార్యగానే చస్తాను.. చావులోను కూడా నాకు తృప్తి ఉంటుంది. నా చావు గురించి నాకు తెలిసింది కాబట్టి నేను చేయాల్సిన పనులు చకచకా చేసేస్తా అని చిన్ని అంటుంది.
నాగవల్లి కోపంగా ఏంటే త్వరలోనే చస్తావని తెలిసి కూడా భయం లేదా అంటే లేదు అత్తయ్యా నేను ఎన్ని రోజులు బతుకుతానో నాకు తెలీదు కానీ చనిపోయేలోపు మా అమ్మ నిర్దోషి అని తేల్చుతా.. మా అమ్మ ఏ తప్పు చేయలేదు అని మీ అందరితో అనిపిస్తా చూస్తూ ఉండండి అని అంటుంది. నాగవల్లి తనతో తాను తల్లి మీద ప్రేమతో ఇలా మాట్లాడుతుంది కానీ అక్కని చంపిన కావేరిని నిర్దోషిగా నిరూపించడం ఈ చిన్ని వల్ల కాదు అనుకుంటుంది. దేవా ఆలోచిస్తూ ఉంటే నాగవల్లి ఏం ఆలోచిస్తున్నావ్ అని అడుగుతుంది. మ్యాడీ జాతకంలో కూడా నా జాతకంలా మొదటి భార్య చనిపోతుందని చెప్పావు కదా.. మ్యాడీ చావు అంచుల వరకు ఎందుకు వెళ్లాడు.. చావాల్సిన చిన్నిని ఎందుకు కాపాడాడు.. అంటే ఆ చిన్ని మహాజ్తాతకురాలా.. మన మ్యాడీ జాతకంలోనే పొరపాటు ఉందా.. గురువుగారు పొరపాటు పడ్డారా లేదంటే నువ్వే పొరపాటున విన్నావా అని అడుగుతాడు. నాగవల్లి కంగారు పడుతూ లేదు బావ.. ఇదంతా నేను అసలు ఆలోచించలేదు.. బావ నువ్వు నేను ఆలోచించడంలో ఏం లేదు.. రేపు వాళ్లిద్దరి జాతకాలు గురువుగారి దగ్గరకు తీసుకెళ్లి చూపిద్దాం అని అంటుంది.
నాగవల్లి, దేవా ఇద్దరూ గురువు గారి దగ్గరకు వెళ్లి.. విషయం చెప్పి మ్యాడీ, చిన్నిల జాతకం గురించి అడుగుతుంది. మీ అబ్బాయి జాతకం ప్రకారం మొదటి భార్య చనిపోతుంది. కానీ అమ్మాయి జాతకం.. మీ అబ్బాయి జాతకాల వల్ల మార్పులు జరిగి ఆ అమ్మాయి ప్రాణగండం నుంచి తప్పించుకుంది.. మీ అబ్బాయికి రక్తతర్పణం జరిగింది అని అంటారు. వాళ్లిద్దరూ నిండు నూరేళ్లు భార్యాభర్తలుగా జీవిస్తారు. ఇక వాళ్లని విడదీయడం ఎవరి వల్ల కాదు.. రానున్న చంద్రగ్రహణం తర్వాత వీళ్ల జీవితాల్లో పెను మార్పులు జరుగుతాయి. ఆ మార్పు వల్ల వాళ్ల జీవితాలు ఊహించని మలుపు తిరుగుతాయి గ్రహణం తర్వాత వచ్చి కలవడం అవి ఏంటో చెప్తాను అని అంటారు. మ్యాడీకి ఎక్కిళ్లు వస్తాయి. నీరు అందుకోలేక తిప్పలు పడతాడు. ఇంతలో మధు ఇచ్చి నీరు ఇస్తే మ్యాడీ తీసుకోడు. మధు సెటైర్లు వేసి నీళ్లు తాగిస్తుంది.
దేవా, నాగవల్లి డల్‌గా ఇంటి ముఖం పడతారు. దేవా నాగవల్లితో చాలా తప్పు చేశావ్ నాగవల్లి.. మ్యాడీ జాతకం నా జాతకం సేమ్ అని తెలిసినప్పుడే నాకు చెప్పుంటే బాగుండేది. నేను మా చిన్నిని చంపాలి అన్న ప్రతీ సారి నువ్వే అడ్డుకుంటున్నావ్.. అన్ని గండాలు ఉన్న అది నా చేతిలో ఎప్పుడో చచ్చుండేది కానీ నువ్వే ఆపావ్ అని అంటాడు. అవును బావ ఎలాగూ అది చస్తుంది కదా ఇక మన చేతికి మట్టి అంటడం ఎందుకు అని నిన్ను ఆపేవాడిని ఇక మరి నిన్ను ఆపను బావ ఆ చిన్నిని ఏం చేయాలి అనుకున్నావో అది చేసేయ్ అని అంటుంది.
ఆ చిన్నికి ప్రాణ గండాలు ఉన్నాయి అని చెప్పారు వాటిని నేనే దానికి రప్పిస్తా దాని ప్రాణాలు తీస్తా అని అంటాడు. మరోవైపు చిన్ని తల్లి ఫోటో చూస్తూ నీతో కొన్ని రోజులు ఉన్నాను అమ్మా.. కొన్ని రోజులు నాన్నతో ఉన్నాను.. కానీ ఎప్పటికీ ఇద్దరితో కలిసి లేను.. మ్యాడీ జాతకం ప్రకారం ఇప్పుడు నేను నాన్నకి శాశ్వతంగా దూరం అయి నీకు దగ్గర అవ్వబోతున్నాను. మ్యాడీ వాళ్ల అమ్మని నువ్వు చంపలేదు అని నిరూపించడానికి కావాల్సిన సాక్ష్యాలు అన్నీ సేకరించి అప్పటి వరకు అయినా నేను బతికేలా ఆశీర్వదించు అమ్మా అని దండం పెడుతుంది. కావేరి ఫోటో నుంచి గులాబి కిందకి పడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
























