అన్వేషించండి
Podharillu Serial Today March 24th: మహా ఇల్లు వదిలి వెళ్లిపోతానంటే ఇంట్లో వాళ్ల రియాక్షన్ ఏంటి..? పెద్ది మహాను ఏమని ఆదేశించాడు...?
Podharillu Serial Today Episode March 24th: మహా ఇల్లు వదిలి వెళ్లిపోతానంటే ఇంట్లో వాళ్ల రియాక్షన్ ఏంటి..? పెద్ది మహాను ఏమని ఆదేశించాడు...?

పొదరిల్లు సీరియల్
Source : Jio Hotstar/ Star Maa
Podharillu Serial Today Episode: అందరూ పడుకునే సమయానికి ఇంటికి చేరన చక్రి....ఒంటరిగా కూర్చుని కన్నీళ్లు పెట్టుకోవడం చూసి మాధవ్ అతన్ని ఓదార్చుతాడు. ఇంతలో కేశవ్, కన్నా కూడా నిద్రలేచి బాధపడొద్దని అంటారు. మహా దృష్టిలో ఇది ఉత్తుత్తి పెళ్లి అయినప్పటికీ తనకు మాత్రం కాదని చక్రి కేశవ్‌తో అంటాడు. తనను తొలిచూపులోనే ఇష్టపడ్డానని తనకు మహా అంటే ప్రాణమని చెబుతాడు. కాకపోతే నిజంగా నేను కావాలనే తనను పెళ్లి చేసుకోలేదని...అన్ని తనకు అలా కలిసొచ్చాయని చెబుతాడు. పోలీసుస్టేషన్‌కు కూడా తాము రక్షణ కోసమే వెళ్లామని...కానీ వాళ్లే మాకు పెళ్లి చేశారని చెబుతాడు.
ఇష్టంలేని పెళ్లి తప్పించుకోవడానికి తను నాతో మెడలో తాళి కట్టించుకున్నా....నేను మాత్రం ఇష్టపడే పెళ్లి చేసుకున్నానని చెబుతాడు. ఇప్పుడు కూడా తనకు విడాకులు ఇవ్వడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని...మహా బలవంతంమీదే లాయర్ దగ్గరకు వెళ్లానని అంటాడు. నా అదృష్టం బాగుండి ఆధార్‌కార్డు లేదని లాయర్ విడాకులు ఇప్పించడానికి ఒప్పుకోలేదని అంటాడు. ఈ సమయంలో తను నన్ను అర్థం చేసుకుని నాకు దగ్గరవుతుందన్న నమ్మకంతో బతుకుతున్నాన్ని చెబుతాడు. అంతే తప్ప నేను ఎవరినీ మోసం చేయలేదని చక్రి చెప్పడంతో మాధవ్ అతన్ని ఓదార్చుతాడు. ఈ విషయం గురించి మహాను ఎవరూ ప్రశ్నించొద్దని...తను ఎన్నిరోజులు ఉండాలనుకుంటే అన్నిరోజులు ఉండి వెళ్లిపోతుందని ఎవరూ బలవంతం చేయవద్దని హెచ్చరిస్తాడు.
రాత్రి ఆలస్యంగా పడుకున్న అన్నదమ్ములు తెల్లవారినా నిద్రలేకపోవడంతో మహా ఇంటి ముందుకు వెళ్లి చీపురుపట్టుకుని ఊడ్చడానికి వెళ్లగా అక్కడే ఉన్న నారాయణ వద్దని వారిస్తాడు. ఇన్నాళ్లు మాకు ఎవరు సాయం చేయకపోయినా బతికామని ఇక ముందు కూడా అలాగే ఉంటామని అంటాడు. రెండురోజులు ఉండి వెళ్లిపోయేదానికి ఇవన్నీ ఎందుకని అంటాడు. అయినాసరే ఆమె ఊడ్వడానికి ప్రయత్నించగా...నారాయణ ఆమె చేతిలో ఉన్న చీపురు లాక్కుని తానే ఊడ్చి నీళ్లు చల్లుతాడు. ఇంతలో మహా ముగ్గు పట్టుకుని రాగా...ముగ్గువేయమని అంటాడు. మహా ఇంటి ముగ్గు వేసి లోపలికి వెళ్లి అందరినీ నిద్రలేపుతుంది. కేశవ్ నిద్రలేచి దుప్పట్లు తీయకుండా పోతుంటే...చక్రి అడుగుతాడు. రేపటి నుంచి ఎవరూ చెప్పేవాళ్లు ఉండరు కదా అంటూ అక్కడి నుంచి కోపంతో వెళ్లిపోతాడు. దీంతో మాధవ్, చక్రి, కన్నా దుప్పట్లు మడతపెట్టి అక్కడి నుంచి లోపలికి వెళ్తారు.
మాధవ్ టీ పెట్టి తీసుకురాగా...అందరూ కలిసి టీ తాగుతుండగా మహా అక్కడికి వస్తుంది. మహాను చూడగానే కేశవ్ పక్కకు వెళ్లిపోతాడు.ఇంతలో మహా మీ అందిరితో ఓమాట చెప్పాలని అనగా...మాధవ్ చెప్పమని అంటాడు. నిజం చెప్పినందుకు మీ అందరికీ ఎలా ఉందో తెలియదు కానీ...నాకు మాత్రం పెద్ద బరువు దింపేసినట్లు ఉందని, చాలా ప్రశాంతంగా ఉందని అంటుంది. మా వదిన వాళ్ల ప్రెండ్ ఇక్కడే ఒంటరిగా ఉంటోందని...నేను ఆమె వద్దకు వెళ్లిపోతానని చెప్పడంతో అందరూ షాక్ తింటారు.మీ ఇంటి కోడలిగా కాకుండా...ఆపదలో ఉన్న అమ్మాయి ఆశ్రయం కోసం వచ్చి నాలుగురోజుు ఉండి వెళ్లిపోయిందని అనుకోమని చెబుతుంది.
ఆమె చెప్పిన దానికి ఇంట్లో ఎవరూ ఏం మాట్లాడకపోయేసరికి....ఎవరూ ఏం చెప్పరేంటని మహా అడుగుతుంది. అయినా నాలుగు రోజులు ఆశ్రయం పొంది వెళ్లే అమ్మాయిని మేం ఎందుకు ఆపుతామని...మాకు ఏం హక్కు ఉందని కేశవ్ అంటాడు.అయినా ఈ పాడుబడిన కొంపలో నాలుగురోజులు ఉండటం కూడా ఎక్కువేనని...మీ ఇష్టం వచ్చినప్పుడు రావొచ్చని, ఇష్టం వచ్చినప్పుడు వెళ్లొచ్చని అంటాడు. దీంతో మహా చాలా బాధపడుతుంది. కన్నా ఏం మాట్లాడకపోయేసరికి...నువ్వు కూడా ఏదో ఒకటి చెప్పరా అంటుంది. దీంతో వాడు ఒక్కసారిగా ఏడ్చి మమ్మల్ని వదిలిపెట్టి వెళ్లొద్దు వదిన అంటాడు.
అయినా నేను మిమ్మల్ని వదినా అని అనొచ్చా అని అడగడంతో మహా కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఎందుకురా అలా మాట్లాడుతున్నావ్ అని అంటే...రేపటి నుంచి నువ్వు ఉండవు కదా అని అంటాడు. మాధవ్ వాడిని వారించి మహాను ఎవరూ బలవంతం చేయవద్దని...తనకు ఏది ఇష్టమైతే అదే చేస్తుందని అంటాడు. చక్రి కూడా తనను ఆపడానికి ప్రయత్నించడు. కానీ మాధవ్ మళ్లీ కల్పించుకుని....మీ పెద్దిలా చెబుతున్నానని నువ్వు ఎక్కడికి వెళ్లి ఇబ్బందిపడొద్దని అంటాడు. నా మాటమీద గౌరవం ఉంటే నువ్వు అనుకున్న లక్ష్యం నెరవేరే వరకు ఇక్కడే ఉండమని ఆదేశిస్తాడు.
Before You Go
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















