అన్వేషించండి

Nindu Manasulu Serial Today July 29th: నిండు మనసులు సీరియల్: సెల్యూట్ కొట్టడానికి రెడీగా ఉండు: గణతో ప్రేరణ.. ఫ్రీ IAS కోచింగ్ వెనక అసలు రహస్యాలు!

Nindu Manasulu Serial Today Episode July 29th ప్రేరణ ఐఏఎస్‌ కోచింగ్ తీసుకుంటుందని గణకి తెలిసి షాక్ అయిపోవడం అన్నాచెల్లెళ్లు ఛాలెంజ్‌లు చేసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode సిద్ధూ, ప్రేరణలు కారులో వెళ్తున్న పాపని కాపాడుతారు. పాప తండ్రిని సిద్ధూ చాలా కోప్పడతాడు. పాపని వదిలేసి మీరు గొడవ పడుతున్నారా.. ముచ్చట్లు పెడుతున్నారా.. మీరు పాప పట్ట బాధ్యతతో ఉంటే పాప మీ ఒడిలో ఉండాలి.. ఇలా వెనక కాదు.. ఒక్క క్షణం నేను చూడటం ఆలస్యం అయింటే అని సిద్ధూ అంటే ఆ పాప తండ్రి మాకు బాధ్యత లేనట్లు మాట్లాడకండి నేను పాప తండ్రిని అంటాడు.

తండ్రిగా బాధ్యత ఉండాలి కదా.. 

తండ్రి అని చెప్పుకుంటే సరిపోదు బాధ్యత ఉండాలి.. పిల్లల్ని కళ్లలో పెట్టుకొని చూసుకోవాలి అని సిద్ధూ తిడతాడు. పాప భయపడితే ప్రేరణ గొడవ ఆపడానికి నువ్వు తండ్రి కోసం స్టేట్‌మెంట్లు పాస్ చేయొద్దు.. తండ్రికి పిల్లల్ని కళ్లలో పెట్టుకొని కాపాడుకోవడం తెలుసు అని అంటుంది. పాపకి ప్రమాదం తప్పింది కదా అనుకోకుండా జరిగిన ప్రమాదానికి వాళ్లని ఎందుకు పోస్ట్‌మార్టం చేస్తావని అడుగుతుంది. పాప తల్లి సిద్ధూకి థ్యాంక్స్ చెప్తుంది. పాప తండ్రి కూడా సారీ చెప్తాడు. 

ఏ ఆడపిల్లకైనా తండ్రే మొదటి హీరో..

సిద్ధూ ప్రేరణతో అంతా చూసి కూడా నన్ను తప్పు పడుతున్నారేంటి అని అడుగుతాడు. దానికి ప్రేరణ మీరే ఆలోచించండి.. ఆ పాప ముందు తన తండ్రిని అన్నేసి మాటలు అంటే ఆ పాప తట్టుకుంటుందా.. ఏ ఆడిపిల్లకి అయినా తండ్రే మొదటి హీరో అని చెప్తుంది. దానికి సిద్ధూ అవునండీ నేనే కాస్త తొందరపడ్డా నేను అలా మాట్లాడుండకూడదు కానీ సరే టైం అవుతుంది పదండి.. ఓ గురుడులో ఈ యాంగిల్ కూడా ఉందా..  

ఇలాంటి వాళ్లకి సెల్యూట్ కొట్టే కంటే అడుక్కు తినడం బెటర్..

జీఆర్ ఇన్‌స్టిట్యూట్‌కి అందరూ స్టూడెంట్స్ చేరుకుంటారు. మినిస్టర్ జయరాం, ఆయనతో పాటు సిద్ధూ తండ్రి విజయానంద్ వస్తాడు. గణ అక్కడ బందోబస్తు చేస్తుంటాడు. మినిస్టర్ జయరాం విజయానంద్‌తో ఏర్పాట్లు భలే చేశారండీ.. ఎంత డబ్బు సంపాదించినా రాని సంతోషం అందరూ ఇలా జేజేలు కొడుతుంటే భలే కిక్ ఇస్తుంది అని అంటుంది. ఫ్రీ కోచింగ్ ఇస్తున్నందుకు పిల్లల తల్లిదండ్రలు కృతజ్ఞతలు చెప్తారు. ఇక నుంచి నిన్ను అందరూ దేవుణ్ని చేస్తారు చూడు అని విజయానంద్ అంటాడు. గణ మినిస్టర్‌కి సెల్యూట్ చేస్తాడు. మినిస్టర్ పట్టించుకోకపోవడంతో చెత్తానా.. ఇలాంటి వాడికి సెల్యూట్ కొట్టే కంటే అడుక్కొని తినడం నయం అనుకుంటాడు. 

ఇలా చేస్తే మనకు పేరు వస్తుంది.. 

విజయానంద్‌, మినిస్టర్ స్పెషల్ రూంలో కూర్చొంటారు. నా ఇన్‌స్టిట్యూట్‌లోనే నేను ఫ్రీ ఇవ్వను నువ్వు ఇంత చేస్తున్నావేంటి అంటే ఇదే నా పెట్టుబడి అని విజయానంద్ అంటాడు. ఫ్రీ సీట్ ఇస్తున్న అందరూ ప్రిలిమ్స్ బయట ఎక్కడో చదివిన వారు కానీ వాళ్లందరితో ప్రిలిమ్స్ కూడా జయరాం ఇన్‌స్టిట్యూట్‌లోనే కోచింగ్ తీసుకొని పాస్ అయ్యారని చెప్పిస్తే మనకు ఇంకా పేరు వస్తుందని విజయానంద్ అంటాడు. అలానే ప్లాన్ చేశా అని చెప్తాడు. నా పేరు దేశం మొత్తం మోగిపోవాలని జయరాం అంటాడు. 

మేడం కాబోయే IAS అన్నమాట.. 

సిద్ధూ ప్రేరణని తీసుకొని ఇన్‌స్టిట్యూట్‌కి వస్తాడు. మీరు ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నారా.. ఇక్కడ సివిల్ కోచింగ్ ఇస్తారు కదా మరి మీరు అని అంటే నేను సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్నాలే అని అంటుంది. ఐఏఎస్‌నా అని సిద్ధూ అంటే అవును.. అయినా మీ లాంటి వాళ్లకి ఎలా తెలుస్తుందిలే చదువు సంధ్య లేకుండా అమ్మానాన్నలకు విలువ లేదు అనుకుంటూ మాట్లాడితే ఇదిగో ఇలా బైక్‌లు నడుపుతూ లైఫ్ ఇలాగే ఉంటుంది అని అంటుంది. మేడం గారు కాబోయే ఐఏఎస్ అన్నమాట అనుకుంటూ సిద్ధూ వెళ్లిపోతాడు. 

పోవే నీకు ఇక్కడేం పని లేదు.. 

గణ బయట ఉంటే ప్రేరణ లోపలికి వెళ్తుంది. గణ ప్రేరణని ఆపుతాడు. పోలీసుల్ని దాటుకిని పేరంటానికి వెళ్లినట్లు వెళ్లిపోతున్నావ్ ఇక్కడ నీకు ఏంటి అని అంటాడు. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని ప్రేరణ అంటే.. చెప్పాలి అని గణ అంటాడు. నేను స్టూడెంట్‌ని అని ప్రేరణ అంటే స్టూడెంట్‌వే కలెక్టర్‌వి కాదు కదా అంటాడు. ప్రేరణని గణ వెళ్లిపోమని అంటే ఇన్‌స్టిట్యూట్ అతను వచ్చి ఈ అమ్మాయి సివిల్స్‌కి ప్రిపేర్ అవుతుందని చెప్తాడు. దాంతో గణ మైండ్ బ్లాక్ అయిపోతుంది. 

సెల్యూట్‌లో రెస్పెక్ట్ లేదు ప్రాక్టీస్ చేయ్..

నువ్వు సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్నావా అని గణ అంటే ప్రిలిమ్స్ పూర్తయింది. మెయిన్స్‌కి కోచింగ్‌కి వచ్చా.. అంటుంది. ఏంటి కలెక్టర్ అయిపోదామనే అని గణ అంటే డౌట్ ఏం పెట్టుకోకు. అవునా భయం వేస్తుంది మేడం గారు అని గణ సెల్యూట్ కొడతాడు. ప్రేరణ అన్నతో థ్యాంక్యూ కానీ సెల్యూట్‌లో రెస్పెక్ట్ లేదు పర్లేదు ప్రాక్టీస్ చేయ్ అంటుంది. గణ కోపంగా ఏంటే ప్రాక్టీస్ చేసేది.. పుట్టికే సక్రమంగా లేని నీకు కలెక్టర్‌ ఏంటే హైదరాబాద్‌లోనే నీ నీడ పడకూడదు అనుకున్న దాన్ని నిన్ను ఎలా కలెక్టర్ కానిస్తానని అంటాడు. అయి తీరుతాను అని ప్రేరణ వెళ్లిపోతుంది.

ప్రిలిమ్స్ కూడా ఇక్కడే చదివా అని చెప్పు..

సిద్ధూ లోపలికి వస్తూ గణని చూసి వీడేంటి ఇక్కడున్నాడు. జిడ్టులా పట్టుకుంటాడు వీడి కంట పడకూడదు అని వేరే వైపు నుంచి వెళ్లిపోతాడు. ప్రేరణని ఇన్‌స్టిట్యూట్ వాళ్లు మీకు ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాం కదా..మీరు ప్రిలిమ్స్ కూడా ఇక్కడే కోచింగ్ తీసుకున్నట్లు మీడియా ముందు చెప్పాలని అంటారు. అలా ఎలా కుదురుతుంది సార్ అలా చెప్తే మోసం కదా అని  నేను చెప్పలేను అని ప్రేరణ అంటే మెరిట్ ఎందుకు పనికిరాదమ్మా ఇక్కడ ప్రతీది వ్యాపారమే.. నువ్వు చెప్తావే మాకు తెలుసు బాగా ప్రిపేర్ అవ్వు అని అంటారు. ప్రేరణ ఏం మాట్లాడదు. సిద్ధూ విని ఎక్కడా ఇదే బాధ. స్టూడెంట్స్ భవిష్యత్‌తో ఆడుకుంటున్నారు అనుకుంటాడు. సిద్ధూ తన తండ్రి పీఏని చూసి నువ్వు ఇక్కడేంటి అని అడిగితే తన తండ్రే ఈ ఫ్రీ సీట్‌లు ఇస్తున్నారని ఇదంతా తనే ఖర్చు పెడుతున్నారని మీరు వస్తున్నారని కూడా మీనాన్నగారికి తెలీదు సార్.. మినిస్టర్‌తో కలిసి వచ్చారని పీఏ చెప్తాడు. సిద్ధూ షాక్ అయిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today August 19th: కార్తీకదీపం 2 సీరియల్: అందరి ముందు సూరజ్‌కి ప్రపోజ్ చేసిన జ్యోత్స్న! ఓకే చెప్పేసిన సూరజ్! క్లైమాక్స్ లెక్కుంది ఎపిసోడ్!
కార్తీకదీపం 2 సీరియల్: అందరి ముందు సూరజ్‌కి ప్రపోజ్ చేసిన జ్యోత్స్న! ఓకే చెప్పేసిన సూరజ్! క్లైమాక్స్ లెక్కుంది ఎపిసోడ్!
Jagadhatri Serial Today August 18th:సుధాకర్‌కు కాళ్లురప్పించడం కోసం ఇంట్లోవాళ్లు ఏం చేశారు..? ఆదిలక్ష్మీ ఎలా కుట్రపన్నింది..?
జగద్ధాత్రి సీరియల్:సుధాకర్‌కు కాళ్లురప్పించడం కోసం ఇంట్లోవాళ్లు ఏం చేశారు..? ఆదిలక్ష్మీ ఎలా కుట్రపన్నింది..?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
Godavari Serial Today August 18th: 'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Embed widget