Nindu Manasulu Serial Today December 22nd: నిండు మనసులు: ప్రేరణ సాయం కోరిన వర్ష! చేసిన తప్పునకు ఏడుస్తున్న విజయానంద్! సాహితి జీవితం నాశనమేనా!
Nindu Manasulu Serial Today Episode December 22nd వర్ష ప్రేరణకు కాల్ చేసి తనని కాపాడమని చెప్పడం సిద్ధూ గణని కావాలనే బావగారు అని పిలవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode సిద్ధూ కేఫ్‌కి వెళ్లి బాధ పడితే ప్రేరణ ఇక్కడే ఉండి బాధ పడేకంటే ఇంటికి వెళ్లి పెళ్లి ఆపడానికి ఏదో ఒక మార్గం చూడు అని చెప్తుంది. ప్రేరణ మాటలకు సిద్ధూ ఇంటికి వెళ్తాడు. మరోవైపు వర్ష రౌడీల నుంచి తప్పించుకొని ప్రేరణకు విషయం చెప్పాలి అని ఓ వ్యక్తికి ఫోన్ అడిగి ప్రేరణకు కాల్ చేస్తుంది.
ప్రేరణకు వర్ష కాల్ చేసి నేను ప్రమాదంలో ఉన్నాను.. గణ నన్ను మోసం చేశాడు. తనకి అడ్డు వస్తా అని నన్ను చంపేయాలని చూస్తున్నాడు. లొకేషన్ పంపిస్తా త్వరగా రా అని చెప్పి ప్రేరణని పిలుస్తుంది. సిద్ధూ ఇంటికి వెళ్తాడు. ప్రేరణ వెంటనే విషయం సిద్ధూకి చెప్తుంది. నేను వస్తా లొకేషన్ పంపించు అని సిద్ధూ అంటాడు. దానికి ప్రేరణ వద్దు నువ్వు వస్తే ఆ గణకి అనుమానం వస్తుంది. నేను వెళ్లి వర్షని తీసుకొస్తా.. నువ్వు గణని గమనిస్తూ ఉండు ఏమైనా అనుమానంగా ఉంటే నాకు చెప్పు అని అంటుంది. సిద్ధూ సరే అంటాడు.
సిద్ధూని చూసిన మంజుల తల్లీ చెల్లి కోసం ఆగకుండా ఆ ప్రేరణ కోసం వెళ్లిపోయావ్.. ఇప్పుడు ఎందుకు వచ్చావ్.. ఆ ప్రేరణ పెళ్లి ఆపమని పంపిందా.. అలా అయితే నువ్వు గుమ్మంలో అడుగుపెట్టొద్దు వెళ్లిపోరా అని మంజు అరుస్తుంది. ఇంతలో సాహితి వచ్చి అన్నయ్య మీద ఎందుకు కోప్పడుతున్నావ్.. నేను పిలిస్తే అన్నయ్య వచ్చాడు.. అన్నయ్య లేకపోతే నేను ఈ పెళ్లి చేసుకోను అని సాహితి తల్లితో చెప్తుంది. నా ప్లాన్ వర్కౌట్ అయిందని విజయానంద్ చాలా సంతోషపడతాడు. గణ సిద్ధూని చూసి షాక్ అయిపోతాడు. సాహితి అన్నని హగ్ చేసుకొని నా కోసం వచ్చినందుకు థ్యాంక్స్ అని అంటుంది. నీ కోసం నేను ఏమైనా చేస్తానమ్మా అని సిద్ధూ అంటాడు.
గణ వెంటనే సిద్ధూ దగ్గరకు వెళ్లి బావగారు మీరు రావడం చాలా సంతోషంగా ఉంది.. థ్యాంక్స్ అంటాడు. మీరు ఇంతలా చెప్పావా బావ.. గారు.. నేను దగ్గరుండి ఈ పెళ్లి ఆపితీరుతా.. అదే హ్యాపీగా జరిపించి తీరుతా.. అని సిద్ధూ అంటాడు. సిద్ధూ ఇచ్చిన షాక్‌కి గణ బిత్తరపోతాడు. మరోవైపు గణకి రౌడీలు కాల్ చేసి వర్ష తప్పించుకుందని అంటారు. గణ ఆవేశంతో ఊగిపోతాడు. మీరేం చేస్తారో నాకు తెలీదు ఆ వర్షని చంపేసి నాకు ఫోన్ చేయండిరా లేదంటే మిమల్ని చంపేస్తా అని అరుస్తాడు. గణ కంగారు చూసి ఈశ్వరి ఏమైందని అడుగుతుంది. లైఫ్ మొదటిసారి పెళ్లి కదమ్మా కాస్త టెన్షన్‌గా ఉందని అంటాడు. జీవితంలో ఎవరైనా ఒక్కసారే పెళ్లి చేసుకుంటారు.. నీ టెన్షన్ చూస్తే అనుమానంగా ఉంది ఏమైందో చెప్పు అంటుంది. ఏం లేదని గణ అంటాడు. ఇప్పుడేం చేయాలి అని తలపట్టుకుంటాడు. సిద్ధూకి ఈ నిజం తెలిసే వచ్చాడా.. అందుకే అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడా అని అనుకుంటాడు.
ప్రేరణ వర్ష పంపిన లొకేషన్‌కి వెళ్తుంది. అక్కడ వర్ష ఉండదు. వర్ష కాస్త దూరంలో ఉండి ప్రేరణని పిలవడానికి సైగ చేస్తుంది. వర్షని ప్రేరణ చూడదు. రౌడీలు అక్కడే ఉండటంతో వర్ష పిలవకుండా సైగలు చేస్తుంది. రౌడీలు ప్రేరణ దగ్గరకు వెళ్లి వర్ష ఫొటో చూపించి తనని చూశారా అని అడుగుతారు. లేదని ప్రేరణ అంటుంది. ప్రేరణ వర్ష కోసం వెతుకుతూ ఉంటుంది. పెళ్లి పనులు మొదలవుతాయి.
సాహితి గౌరీ పూజ చేస్తుంది. సాహితిని చూసి విజయానంద్ కన్నీరు పెట్టుకుంటాడు. సాహితి తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. విజయానంద్ మనసులో గతంలో నేను చేసిన తప్పులకు నీ జీవితం పణంగా పెడుతున్నా క్షమించమ్మా తప్పడం లేదు అని కన్నీరు పెట్టుకుంటాడు. విజయానంద్ కన్నీరు పెట్టుకోవడం సిద్ధూ చూస్తాడు. ఎందుకు ఏడుస్తున్నావ్ డాడీ అని సాహితి అడుగుతుంది. ప్రతీ ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులకు ఈ బాధ తప్పదమ్మా అని మంజుల ఏడుస్తుంది. సాహితి తండ్రిని హగ్ చేసుకొని ఏడుస్తుంది. తర్వాత సాహితి అన్నయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. నీ సంతోషం కోసం అయినా ఈ పెళ్లి ఆపి తీరుతా అని సిద్ధూ మనసులో అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















