అన్వేషించండి

Chinni Serial Today December 22nd:చిన్ని సీరియల్: మ్యాడీ కన్నతల్లి చావు వెనక రహస్యం మధు చేధించగలదా! లోహిత ప్లాన్ తిప్పికొట్టిన మధు!

Chinni Serial Today Episode December 22nd మధు నాగవల్లి వాళ్లతో మ్యాడీ తల్లి చావు గురించి ప్రశ్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మధు పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి నయని అనే కానిస్టేబుల్‌ని కలుస్తుంది. ఆమెతో మా అమ్మ నిజంగా నేరం చేసింది అని మీరు నమ్మారా అని అడుగుతుంది. నలినీ చిన్నితో నేనే కాదు పోలీస్ స్టేషన్‌లో ఎవరూ నమ్మలేదు అని కానీ సాక్ష్యాలు బలంగా ఉండేవని చెప్తుంది. 

మధు ఆవిడతో ఆ సాక్ష్యాలు ఏం చూపించాను.. కంప్లైంట్ కాఫీ నాకు ఇచ్చేలా చేయమని అడుగుతుంది. అవన్నీ హైదరాబాద్‌లో ఉంటాయి. అక్కడున్న సూపరిండెంట్ చాలా మంచావిడ ప్రస్తుతం ఆవిడ అమెరికా వెళ్లారు. వచ్చాక ఆవిడతో మాట్లాడుదాం అని అంటుంది. నాగవల్లి ఇంటికి పంతుల్ని పిలిపిస్తుంది. శ్రేయ, మ్యాడీల జాతకాలు ఇచ్చి గురువు గారికి ఇప్పించి మంచి మూహూర్తం పెట్టించమని అంటుంది. శ్రేయ చాలా సంతోషపడుతుంది. మ్యాడీ మాత్రం చాలా బాధ పడతాడు. 

మధు మ్యాడీ వాళ్ల ఇంటికి వస్తుంది. మ్యాడీ మధుని నాగవల్లి దగ్గరకు తీసుకెళ్లి నీతో ఏదో మాట్లాడుతుందని అంటాడు. ఏ విషయం గురించి అని అడిగితే అమ్మ గురించి మాట్లాడటానికి వచ్చిందని అంటాడు. ఈ విషయం గురించి మాట్లాడటానికి వచ్చిందంటే ఏదో ప్లాన్‌తో వచ్చిందని నాగవల్లి అనుకుంటుంది. మధు నాగవల్లితో చిన్ని వాళ్ల అమ్మ పార్వతి ఆంటీ ఎలా ఉండేవాళ్లు.. జరిగిన దారుణం ముందు ఎవరు చూశారు. ఆ టైంలో ఇంట్లో ఎవరెవరు ఉన్నారు అని ప్రశ్నిస్తుంది. దేవాతో పాటు అందరూ బయటకు వస్తారు. ఈ పిల్ల ఏంటి గతాన్ని తవ్వుతుంది అని దేవా అనుకుంటాడు. 

నాగవల్లితో సహా ఎవరూ అప్పుడు లేరు అని తెలియడంతో మీకు ఎవరికీ పార్వతి ఆంటీ ఎలా చనిపోయారో కచ్చితంగా తెలీదన్నమాట అని అంటుంది. ఇంట్లో శుభకార్యం జరగనుంది.. ఇప్పుడు ఆ విషయం అవసరమా.. ఇక దాని గురించి ఎవరూ మాట్లాడొద్దు అని నాగవల్లి అంటుంది. మ్యాడీ శ్రేయల పెళ్లి గురించి నీకు బాగా తెలుసు కదా.. ఇంట్లో శుభకార్యం గురించి మాట్లాడుకున్నాం.. నీ బెస్ట్‌ ఫ్రెండ్ పెళ్లి కార్యానికి సంబంధించి మాట్లాడాం కదా స్వీట్ తయారు చేసి తీసుకురా.. దీంతో నీ బాధ్యత అయిపోయింది అనుకోకు.. వాళ్ల పదహారు రోజుల పండగ వరకు అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి అని అంటుంది. 

మధు సరే అంటుంది. లోహిత తాను కూడా సాయం చేస్తా అని మధుని కిచెన్‌కి తీసుకెళ్తుంది. లోహిత మధుకి ఎక్కడ ఏం ఉన్నాయో చెప్తుంది. మధు స్వీట్ రెడీ చేస్తుంది. లోహిత జీడిపప్పు దాచేస్తుంది. దాంతో మధు లోహితను అడిగితే నాకు తెలీదు అని అనడంతో ప్రమీలను అడగాలని మధు వెళ్తుంది. మధు వెళ్లి వచ్చేలోపు లోహిత స్వీట్‌లో కారం పొడి చల్లేస్తుంది. మధు అందరికీ స్వీట్ తీసుకొచ్చి ఇస్తుంది. మధు అందరికీ స్వీట్ ఇస్తుంది. లోహితకు కూడా ఇస్తుంది. అందరూ స్వీట్ తిని మధు మీద అరుస్తారని తిట్టి పంపేస్తారని అనుకుంటుంది. నాగవల్లి దేవాతో మధుకి నేనే స్వీట్ చేయమని చెప్పానని అంటుంది. అందరూ స్వీట్ తిని చాలా బాగుందని అంటారు. 

లోహిత షాక్ అయిపోతుంది. కారం పొడి కలిపా కదా ఇలా అంటున్నారేంటి అని అనుకుంటుంది. లోహిత నోట్లో పెట్టగానే కారం కారం అని కేకలేసి పరుగులు పెడుతుంది. మధు లోహితతో నువ్వు స్వీట్‌లో కారం కలపడం నేను చూశా అని చెప్తుంది. లోహిత షాక్ అయిపోతుంది. మధుతో రాత్రి తల్లిదండ్రులు మాట్లాడి మ్యాడీ అమెరికా వెళ్లిపోయి ఉంటే వాళ్ల తల్లిదండ్రులు ఎంత బాధ పడేవారో అని అనుకుంటారు. కావేరమ్మ మీద పడిన నింద నువ్వు నిరూపించకపోతే మ్యాడీ మీద నువ్వు పెంచుకున్న ప్రేమ అలాగే ఉండిపోతుందని స్వరూప అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today March 31st: నిండు మనసులు: రంజిత్‌ రాజశేఖరం మేనల్లుడా! ఇందిర, ప్రేరణల్ని నడివీధిలో నిలబెట్టేసిన గణ! చెంచలమ్మ ఎంట్రీ!
నిండు మనసులు: రంజిత్‌ రాజశేఖరం మేనల్లుడా! ఇందిర, ప్రేరణల్ని నడివీధిలో నిలబెట్టేసిన గణ! చెంచలమ్మ ఎంట్రీ!
Nindu Noorella Saavasam Serial Today march 31st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రణవీర్‌ను ఇంటికి తీసుకెళ్లిన అమర్‌ - షాకైన మనోహరి
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రణవీర్‌ను ఇంటికి తీసుకెళ్లిన అమర్‌ - షాకైన మనోహరి
Brahmamudi Serial Today march 31st: ‘బ్రహ్మముడి’ సీరియల్: వెంకీని పూల్‌ను చేసిన నందు – స్మగ్లర్‌ చేతిలో చిక్కిన రాజు  
‘బ్రహ్మముడి’ సీరియల్: వెంకీని పూల్‌ను చేసిన నందు – స్మగ్లర్‌ చేతిలో చిక్కిన రాజు  
chinni serial today march 31st: చిన్ని సీరియల్: మ్యాడీ చిన్నికి దగ్గరవుతున్నాడా! మూడు జంటలకు మంగళస్నానాలు!
చిన్ని సీరియల్: మ్యాడీ చిన్నికి దగ్గరవుతున్నాడా! మూడు జంటలకు మంగళస్నానాలు!

వీడియోలు

Rohit Sharma Fastest Half Century IPL 2026 | ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్ | ABP Desam
Rohit Dance in Front of Injured Rahane | రహానే కింద పడిపోతే.. రోహిత్ డాన్స్ | ABP Desam
Rahane Innings KKR vs MI IPL 2026 | వాంఖడేలో కేకేఆర్ పరుగుల విధ్వంసం | ABP Desam
IPL 2026 Mumbai Indians Vs KKR IPL 2026 | ఐపీఎల్ 2026లో ముంబై రికార్డు ఛేజింగ్ | ABP Desam
Heinrich Klaasen Controversial Out vs RCB | థర్డ్ అంపైర్‌పై సునీల్ గవాస్కర్ ఫైర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Explosion at Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
Explosion at Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
India Census 2027: ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్త జనగణన.. ఏపీ, తెలంగాణలో ప్రక్రియ షెడ్యూల్ ఇదే
ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్త జనగణన.. ఏపీ, తెలంగాణలో ప్రక్రియ షెడ్యూల్ ఇదే
Today LPG, CNG, PNG Costs : LPG, CNG, PNG సిలిండర్ల కొత్త ధరలు.. హైదరాబాద్లోనే గ్యాస్ కాస్ట్ ఎక్కువ
LPG, CNG, PNG సిలిండర్ల కొత్త ధరలు.. హైదరాబాద్లోనే గ్యాస్ కాస్ట్ ఎక్కువ
Hyderabad- Vijayawada Toll Charges: హైదరాబాద్‌- విజయవాడ హైవేపై తగ్గిన టోల్ టాక్స్.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి
హైదరాబాద్‌- విజయవాడ హైవేపై తగ్గిన టోల్ టాక్స్.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి
Harudu Movie Release Date: పవన్ 'ఓజీ'తో మళ్ళీ వెలుగులోకి... 'హరుడు'తో సోలో హీరోగా!
పవన్ 'ఓజీ'తో మళ్ళీ వెలుగులోకి... 'హరుడు'తో సోలో హీరోగా!
Paadi Kaushik Reddy Controversy: కౌశిక్ రెడ్డికి వివాదాలు అలవాటుగా మారాయా? బీఆర్‌ఎస్‌కు నష్టమా? లాభమా?
కౌశిక్ రెడ్డికి వివాదాలు అలవాటుగా మారాయా? బీఆర్‌ఎస్‌కు నష్టమా? లాభమా?
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక విమర్శలు- లక్షల కోట్ల ప్రజాధనం వృథా, ప్లానింగ్ లోపాలే కారణమని వెల్లడి!
కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక విమర్శలు- లక్షల కోట్ల ప్రజాధనం వృథా, ప్లానింగ్ లోపాలే కారణమని వెల్లడి!
Vaibhav Sooryavanshi: IPL 2026లో వైభవ్ సూర్యవంశి ఎదుర్కునే 10 సవాళ్లు.. ఎన్ని రికార్డులను బద్దలు కొట్టగలడు?
IPL 2026లో వైభవ్ సూర్యవంశి ఎదుర్కునే 10 సవాళ్లు.. ఎన్ని రికార్డులను బద్దలు కొట్టగలడు?
Embed widget