Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today December 20th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: దత్తత క్యాన్సిల్.. విహారి, లక్ష్మీల బంపర్ ఆఫర్! పెళ్లికి అంబిక ఓకే!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode December 20th లక్ష్మీ దత్తత ఆపేయడం, అంబిక పెళ్లికి ఒప్పుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode దత్తత కార్యక్రమం కొనసాగుతుంది. వసుధ, చారుకేశవ చేతుల్లో చేయి పెట్టకుండా లక్ష్మీ లేచి నాకు ఈ దత్తత కార్యక్రమం ఇష్టం లేదు అని చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. ఫ్లాష్ బ్యాక్లో అంబిక లక్ష్మీని పక్కకి తీసుకెళ్లి మా నాన్న బాధ పడుతుంటే నువ్వు ఫీలవుతున్నావ్ కదా.. ఆయన బాధ పడకుండా ఉండాలి అంటే వెంటనే నువ్వు ఈ దత్తత కార్యక్రమం నీకు ఇష్టం లేదు అని చెప్పాలి.. నువ్వు దత్తత ఇష్టం లేదు అని చెప్తే నేను పెళ్లి చేసుకుంటా.. నిన్ను మా అక్క వాళ్లు దత్తత తీసుకుంటే నేను పెళ్లి చేసుకోను అని అంటుంది.
అంబిక ఇచ్చిన మాట ప్రకారం లక్ష్మీ దత్తత ఆపేస్తుంది. లక్ష్మీ భక్తవత్సలం, వసుధ, చారుకేశవలకు క్షమాపణ చెప్తుంది. ఇంతవరకు వచ్చిన తర్వాత ఇలా చేశావు ఏంటి అని యమున అడిగితే నాకు మీ కుటుంబంలో ఏ బంధుత్వం, చుట్టరికం వద్దు మీరు చూపించే ప్రేమ చాలు అని అంటుంది. అంబిక క్లాప్స్ కొడుతూ చూశారా ప్లేట్ తిప్పేసింది.. తనకు ఓప్లాన్ ఉంటుందని నాకు తెలుసు అని అంటుంది. మీరు అభిమానించే లక్ష్మీ ఏం చేసిందో ఇప్పుడు బాగా చూడండి అని అంటుంది. ఇంకెప్పుడూ ఈ ఇంట్లో దత్తత కార్యక్రమం పెట్టకండి.. అలాగే నా పెళ్లి గురించి కూడా ఎప్పుడూ మాట్లాడకండీ అని చెప్పి అంబిక వెళ్లిపోతుంది.
అంబిక మాట విని దత్తత ఆపేశాను.. మరి అంబికమ్మా ఇలా చేసింది ఏంటా అని లక్ష్మీ అనుకుంటుంది. లక్ష్మీ దగ్గరకు విహారి వెళ్తాడు. ఎందుకు ఈ దత్తత ఆపేశావు.. నాకు తెలిసి దీని వెనక అంబిక అత్తయ్య ఉంటుందని అంటాడు. ఎవరూ లేరు మా అమ్మానాన్న బతికే ఉన్నారు కదా అందుకే ఈ దత్తత వద్దు అన్నాను అంటుంది. వసుధ అత్తయ్యా చారుకేశవ మామయ్యా చాలా బాధ పడ్డారు అని అంటాడు. ఇప్పుడు ఇవన్నీ ఆలోచించొద్దు అని విహారిని కిందకి తీసుకెళ్లి తాతయ్య గారి గురించి ఆలోచించండి.. తాతయ్య గారు అంబికమ్మ పెళ్లి గురించి చాలా బాధ పడుతున్నారు. మీరు ఆయన బాధ తీర్చాలని అంటుంది. ఇంతలో భక్తవత్సలానికి ఓ పెళ్లిళ్ల పేరయ్య కాల్ చేసి మీ కూతురికి మంచి సంబంధాలు ఉన్నాయని అంటారు.
భక్తవత్సలం ఆయనతో నా కూతురికి పెళ్లి చేయాలి అని నాకు ఉంది కానీ తను ఇప్పుడు చేసుకోను అంటుంది. తను చేసుకుంటా అంటే మీకు చెప్తా అని అంటారు. పెద్దాయన బాధ పడటం విహారి చూస్తాడు. తాతయ్య గారి సంతోషం గురించి ఆలోచించండి అని అంటుంది. విహారి అంబిక దగ్గరకు వెళ్లి మీ పెళ్లి గురించి మాట్లాడాలి అత్తయ్యా అంటాడు. దాని గురించి మాట్లాడను అని అంబిక అంటుంది. మీరు పెళ్లి చేసుకోవాలి అత్తయ్యా అని అంటాడు. నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు మన కంపెనీలో మంచి స్థానం ఇస్తా.. మీరు కేవలం పెళ్లికి ఒప్పుకుంటే మీకు ఏం పొజీషన్ కావాలి అంటే అది ఇస్తా లేదంటే ఇక మీకు కంపెనీతో ఏం సంబంధం ఉండదు అని అంటాడు.
బెదిరిస్తున్నావా విహారి అని అంబిక అంటే లేదు మీ పెళ్లి మాకు ముఖ్యం మీకు మంచి ఆఫర్ ఇస్తాను అని అంటాడు. అంబిక పెళ్లికి సరే అంటుంది. విహారి సంతోషంగా ఇంట్లో అందరికీ చెప్పడానికి వెళ్తాడు. లక్ష్మీ వచ్చి మీరు పెళ్లికి ఒప్పుకోవడం సంతోషంగా ఉందని అంటుంది. అంబిక లక్ష్మీతో నేను పెళ్లికి ఒప్పుకున్నా అంతే పెళ్లి చేసుకోను అంతే అని అంటుంది. లక్ష్మీ అంబికతో మీరు పెళ్లికి ఒప్పుకొని పెళ్లి చేసుకుంటే నా పేరు మీద ఉన్న 200 ఎకరాలు మీకు ఇచ్చేస్తా అని అంటుంది. 200 ఎకరాలు, ఆఫీస్లో మంచి పొజిషన్ మీకు వస్తాయి అని అంటుంది. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అని అంబిక పెళ్లికి ఒప్పుకుంటుంది.
విహారి ఇంట్లో అందరినీ పిలిచి అంబిక పెళ్లికి ఒప్పుకుందని చెప్తాడు. ఇంట్లో అందరూ చాలా సంతోషపడతారు. అంబికను పిలిచి అడుగుతాడు. అంబిక ఓకే చెప్పడంతో అందరూ చాలా చాలా సంతోషపడతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















