Nuvvunte Naa Jathaga Serial Today December 20th:నువ్వుంటే నా జతగా: దేవాతో ఎమోషనల్‌గా మాట్లాడిన మిథున! దేవా మిథున గదిలో ఉన్నాడని కనిపెట్టేసిన త్రిపుర!
Nuvvunte Naa Jathaga Serial Today Episode December 20th మిథున దేవాతో వాళ్ల బంధం గురించి ఎమోషనల్‌గా మాట్లాడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode రిషి మిథునకు ఫస్ట్‌ఎయిడ్ చేసి గదిలోకి తీసుకెళ్తా అంటాడు. మిథున పర్లేదు అన్నా రిషి వినకుండా మిథునని తీసుకెళ్తాడు. గదిలో దేవా ఉండటంతో మిథున రిషిని గది బయటే ఆపేస్తుంది. ఇక నేను వెళ్తా అంటుంది. వస్తా పర్లేదు అని రిషి అంటే వద్దు నాకేం కాలేదు అంత టెన్షన్ అవసరం లేదు అంటుంది. నీకు ఏమైనా నేను తట్టుకోలేను అని రిషి చాలా బాధ పడతాడు.
రిషి, మిథున మాటలు విని రిషి కంట పడకూడదు అని దేవా డోర్ వెనకాలే దాక్కుంటాడు. దేవా మిథున చేతికి ఉన్న ప్లాస్టర్లు చూసి చూడు మిథున ఎంత పెద్ద దెబ్బ తగిలిందో చూసుకోవాలి కదా.. జాగ్రత్తగా ఉండాలి కదా.. అంత అజాగ్రత్త ఎందుకు అని అడుగుతాడు. అజాగ్రత్త కాదు కావాలనే డోర్‌లో చేయి పెట్టా అంటుంది. ఎందుకు అని దేవా అడిగితే నీ కోసం అని మిథున అంటుంది. నిన్ను పోలీసులు చూడకుండా ఉండాలని వాళ్ల దృష్టి మళ్లించడానికి ఇలా చేశానని చెప్తుంది.
మిథున నీకు పిచ్చా నా కోసం ఇంత దెబ్బ తగిలించుకుంటావా.. నా కోసం నువ్వు ఇలా చేసుకోవడం నచ్చలేదు.. నా కోసం చాలా బాధ పడుతున్నావని అంటాడు. నువ్వు చేసిన గాయం కంటే ఇదేం పెద్దది కాదు అని మిథున అంటుంది. ఆ గాయం భరిస్తున్నదాన్ని ఇదొక లెక్కా.. ఈ గాయానికి మందు రాసుకున్నా కానీ ఆ గాయానికి ఏం మందు రాసుకోవాలో అర్థం కావడం లేదు.. ఈ నొప్పి నాలుగైదు రోజుల్లో తగ్గిపోతుంది.. కానీ ఆ నొప్పి మాత్రం ప్రాణం పోయే అంత వరకు అలాగే ఉండిపోతుంది అని కన్నీరు పెట్టుకుంటుంది. దేవా బాధగా చూస్తూ ఉంటాడు.
దేవా ఒక మనిషి తప్పు చేస్తే శిక్ష వేస్తారు కానీ నేను ఏం తప్పు చేశానని ఇంత పెద్ద శిక్ష వేశావు. కోలుకోలేని బాధ అనుభవిస్తున్నాను దేవా.. నువ్వు నా మెడలో కట్టిన తాళి సంతోషంగా ఉన్న నా జీవితాన్ని నాశనం చేసేసింది.. నా జీవితాన్ని సమాధానం లేని ప్రశ్నలా మార్చేసింది అని బాధ పడుతుంది. ఎవరైనా తప్పు చేస్తే తప్పు అని తెలిసి సరిదిద్దుకుంటారు. కానీ నువ్వు మాత్రం నా విషయంలో తప్పు మీద తప్పు చేస్తున్నావ్.. నేను నీకు శిక్ష వేయాలి అనుకోలేదు నీతో బతకాలి అనుకున్నా.. నీ కోసం కన్నవాళ్లని వదిలేసి వాళ్ల దృష్టిలో శత్రువుని అయిపోయాను.. నువ్వు కట్టిన తాళి వల్ల ఒక ఆడపిల్ల ఒంటరి అయిపోయిందని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా.. నీ కారణంగా తను నరకం అనుభవిస్తుందని ఒక్కసారి అయినా బాధ అనిపించిందా.. అలాంటి తనని ఇంటి నుంచి గెంటేస్తే ఏమైపోతుందో అని ఒక్క సారి అయినా ఆలోచించావా అని అడుగుతుంది.
మిథున మాటలకు దేవా చాలా బాధ పడతాడు. తర్వాత మిథున మందులు ఇస్తే వద్దు నేను వెళ్లిపోతా అంటాడు. ప్రస్తుతం నువ్వు పూర్తిగా నడవలేని పరిస్థితిలో ఉన్నావు. రేపు వెళ్లిపోదువు అని అంటుంది. నీకు ఏమైనా అయితే ఈ లోకంలో అందరి కంటే ఎక్కువ బాధ పడేది.. నిన్ను నా జీవితం నుంచి శాశ్వతంగా గెంటేశాను.. నీ గురించి బాధపడే అవసరం నాకు ఏంటి అని నువ్వు అడగొచ్చు కానీ నువ్వు ప్రమాదంలో ఉన్నప్పుడు నీకు నేను ముందు గుర్తొచ్చా అప్పుడు నీ ప్రశ్నకి ఎలా సమాధానం లేదో ఇప్పుడు నాకు అలాగే సమాధానం లేదు.. నీకు ఏదైనా ప్రమాదం వస్తే నీ కంటే ముందు ప్రాణాలు ఇవ్వడానికి నేను ముందు ఉంటా. అలాంటిది నాకు ఈ ఇబ్బందులు పెద్ద కష్టమేమీ కాదు అని మిథున చెప్తుంది.
మిథున ప్రవర్తన త్రిపురలో బాగా అనుమానాన్ని పెంచుతుంది. మిథున గురించే ఆలోచిస్తూ ఉంటుంది. మిథున గది వైపే చూస్తుంది. రాహుల్ వచ్చి మిథున మీద అంత అనుమానం ఎందుకు అంటే మిథున గదిలో దేవా ఉన్నాడని అనిపిస్తుందని అంటుంది. రాహుల్ షాక్ అవుతాడు. ఎప్పుడూ లేనిది టిఫెన్ ఎక్కువ తీసుకెళ్లింది. తనకి నచ్చని జ్యూస్ గదిలోకి తీసుకెళ్లింది. అన్నింటికంటే ముందు దేవా పోలీసులకు దొరకకూడదు అనే వేళ్లు డోర్లో పెట్టుకుందని అంటుంది. మిథునకు దేవా మీద కోపం ఉంది అలా చేయదు అని అంటాడు. మిథున దేవాని ఎప్పుడో మర్చిపోయింది ఇంక ఆ టాపిక్ వదిలేయ్ అని రాహుల్ అంటాడు.
త్రిపుర మాత్రం ఏదో జరుగుతుందని అనుకుంటుంది. హరివర్థన్ మిథునకు దగ్గరుండి సపర్యలు చేస్తాడు. ఆ చెత్త వెధవ కోసం పోలీసులు రావడం వల్లే నా కూతురికి ఇలా అయిందని జడ్జి తిడతాడు. అలంకృత మిథునతో నువ్వు పెళ్లి అయి వెళ్లిపోతే నాన్న ప్రేమ మొత్తం నాకే సొంతం అని అంటుంది. ఇంతలో రిషి వచ్చి కొన్ని రోజులు ఆగితే నువ్వు పెళ్లి చేసుకొని వెళ్లిపోతావ్ అంటాడు. నేను ఇల్లరికం అల్లుడిని చేసుకుంటా బావ.. మా అక్కకి ఆ ఛాన్స్ లేదు అంటుంది. మీ అక్కని అడగమని చెప్పు అన్నీ ఆపేసి నేను ఇక్కడే ఉండిపోతా అని రిషి అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















