Nindu Manasulu Serial Today August 5th: నిండు మనసులు సీరియల్: తల్లి గురించి విస్తుపోయే నిజం తెలుసుకున్న సిద్ధూ.. సుధాకర్ సంతోషం ఆవిరైపోతుందా!
Nindu Manasulu Serial Today Episode August 5th ప్రేరణ ఇంటికి గణ పంపిన రౌడీలు వచ్చి ముగ్గురు కిలాడీ లేడీలని నిందలు మోపి రచ్చ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode సుధాకర్ పడుకొని తనతో తాను ఏం బతుకు అయిపోయిందిరా సుధా నీది.. నడుం వాల్చినా గుండెకు మాత్రం ఝల్లుమంటోంది దేవుడా.. అక్క సర్వేంట్, బావ పేషెంట్.. కోడలు కరెంట్, ఆ ఎస్‌గాడు వైలెంట్ ఎలా దేవుడా.. నన్ను బతనివ్వరా అనుకుంటాడు. ఇంతలో మణిపాల్ సుధాకర్‌కి కాల్ చేసి గణ సస్పెండ్ అయినట్లు చెప్తారు.
సుధాకర్ సంతోషంతో ఎగిరి గంతేసి ఇళ్లు పీకి పందిరేస్తాడు. ఏమైందని ఇంట్లో వాళ్లు అడిగితే ఆ రాక్షసుడు సస్పెండ్ అయ్యాడు.. ఇక వాడి పీడ మనకు లేదు.. ఇక వాడు మనలని ఏం చేయలేదు అక్క నాకు స్వాతంత్ర్యం వచ్చింది అని చెప్తాడు. ప్రేరణ, ఇందిర, ఐశ్వర్యలు చాలా సంతోషపడతారు. సంతోషంలో సుధా స్వీట్ చేయమని అక్కతో చెప్తాడు.
సాహితి తల్లితో ఫ్రెండ్ భర్త్‌డే పార్టీకి వెళ్తా అని అంటుంది. ఇంతలో సిద్ధూ వచ్చి విజయానంద్ విజయానంద్ అని అరుస్తాడు. సిద్ధూ తల్లి మంజుల వచ్చి తండ్రినే పేరు పెట్టి పిలుస్తావా ఎంత ధైర్యంరా నీకు అని తిడుతుంది. విజయానంద్ వచ్చి సిద్ధూ ఏంటి నాన్న ఏమైంది అని అడుగుతాడు. అక్కడ నిర్భాగ్యుల ఆశ్రయం చెడగొట్టి ఇక్కడ నువ్వు బంగ్లాలో హాయిగా ఉంటావా అంటాడు. నేనేం చేశాను అని విజయానంద్ అంటే ఓ చరిత్ర తుడిచేయాలి అనుకున్నావ్.. ఎన్నాళ్లుగా ఉంటున్న వృద్ధుల ఆశ్రమం కూల్చేయాలి అని అనుకున్నావ్ అని తల్లితో ఆశ్రమం మీదకు ఆఫీసర్లను పంపి ముసలి వాళ్లని చెదరగొట్టాలని అనుకున్నాడు నీకు తెలీదు అది అని ఇంత చెప్పినా నీకు నా మాటల్లో నమ్మకం లేకపోతే ఆయన్నే అడుగు అని సిద్ధూ అంటాడు.
మంజులకు విషయం అర్థమవుతుంది. భర్త తప్పు చేసినట్లు గ్రహిస్తుంది. కానీ సిద్ధూ తండ్రిని ప్రశ్నించడంతో నీకు ఎందుకురా ఆయన సమాధానం చెప్పాలిరా అంటుంది. నాకు చెప్పొద్దు కానీ అది నీ పేరు మీద ఉంది.. తాత ఆశయం ఆ ఆశ్రయం దాన్ని ఈ పెద్ద మనిషి నాశనం చేయాలి అనుకున్నాడు అని సిద్ధూ చెప్తే దానికి మంజుల భర్త తనకు చెప్పే అదంతా చేశాడని అంటుంది. సిద్ధూ షాక్ అయిపోతాడు. అంటే నీకు తెలిసే ఇదంతా జరిగిందా అంటాడు. నిజానికి మంజులకు ఈ విషయం తెలీదని ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌లో అర్థమవుతుంది.
విజయానంద్ సిద్ధూతో ఆ ఆశ్రయం తీసి అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలి అనుకుంటున్నా అని చెప్తాడు. మంజులు కూడా షాక్ అవుతుంది. సిద్ధూ తల్లితో ఇదంతా నీకు తెలీకుండా జరిగింది అనుకున్నా అమ్మా కానీ నువ్వు కూడా వాళ్లకి అన్యాయం చేయాలి అనుకున్నావని అనుకున్నా.. వృద్ధులు అమ్మా వాళ్లు చేతకాని వాళ్లు ఇన్నాళ్లు ఉన్న ఆశ్రయం లేకపోతే ఎలా బతుకుతారమ్మా అని బాధ పడతాడు. విజయానంద్ సిద్ధూతో నేను వాళ్లకి వసతి కల్పిస్తా అంటే వసతి కల్పించడం అంటే ముందు వాళ్లకి ఇళ్లు కట్టి ఇచ్చి జాగ్రత్తగా వాళ్లని చేర్చి అప్పుడు ఆశ్రయం కూలగొట్టాలి.. అమ్మా అది తాతయ్య ఆశయం దాన్ని నువ్వే వదిలేసినా ఆయన వారసుడిగా నాకు ఆ బాధ్యత ఉంది.. నీ లాంటి వంద మంది విజయానంద్లు వచ్చినా.. పచ్చనోట్లు ఎన్ని చేసినా ఆశ్రయంలో ఇటుక కూడా కదనివ్వను అని సిద్ధూ ఛాలెంజ్ చేస్తాడు. సిద్ధూ వెళ్లిపోతుంటే సాహితి పిలిచి కోపంగా వస్తావ్ బాధగా వెళ్లిపోతున్నావ్ అన్నయ్య కానీ చెల్లి ఉందని నీకు తెలీదా అంటుంది. నువ్వు నా ప్రాణంరా జాగ్రత్త అని చెప్పి సిద్ధూ వెళ్లిపోతాడు. ఎప్పుడూ ఏదో విధంగా అన్నయ్యని బాధ పెడుతున్నారు ఛా అని సాహితి వెళ్లిపోతుంది. మంజుల భర్తతో నాకు ఒక మాట చెప్పాల్సింది విజయ్ అంటుంది.
ఇందిర, ప్రేరణ, ఐశ్వర్యలు డల్‌గా ఉంటే సుధాకర్ వచ్చి ఏమైందని అడుగుతాడు. రాను రాను సమస్యలు పెరిగిపోతున్నాయని బతుకు తెరువు కోసం ఆలోచిస్తున్నాఅని ప్రేరణ అంటుంది. ఇప్పుడు బాగానే ఉన్నారు కదా సుధాకర్ అంటే నేను ఏదైనా జాబ్ చేస్తా మామయ్య అంటుంది. జాబ్ చేస్తే చదువు ఎలా అంటే పర్లేదు మామయ్య అంటుంది. ఇంతలో ఐశ్వర్య తనకు ఓ జాబ్ చూడమని సంగీతం టీచర్‌గా చేస్తానని అంటుంది. సంగీతంలో రాగాల పేర్లు చెప్పవే అంటే ఐశ్వర్య ఆలోచిస్తూ అవేందుకులే అంటుంది. రాగాలు రావు కానీ మ్యూజిక్ టీచరంటా అని అంటాడు. ప్రేరణ జాబ్ చూడమంటే నేను ఉన్నా కదమ్మా ఇంకెందుకు నీకు జాబు అంటాడు. నువ్వు చదువు మీదే దృష్టి పెట్టమ్మా నాకు చేతనైనంత వరకు చేస్తాను ఇది మా అక్క రుణం అనుకుంటాను నువ్వు ఇంకేం ఆలోచించకు అని అంటాడు. ఇక కూరగాయలకు వెళ్తాను అని సుధాకర్ అంటాడు. సుధాకర్ వెళ్లగానే ఇంటికి రౌడీలు వస్తారు.
గణ రౌడీలకు కాల్ చేసి వాళ్లకి అల్లకల్లోలం కలగాలి బతకడం కంటే చావే బెటర్ అనిపించేలా చేయమని అంటాడు. రౌడీలు ఇంట్లోకి వెళ్తారు. సామన్లు బయట పడేయమంటే ఎవరు మీరు అని ప్రేరణ అడుగుతుంది. దాంతో మీ అమ్మకి అడుగు అంటాడు. నువ్వు ఎవరు అని అంటే నువ్వు పెద్ద కిలాడివే అంటారు. ఇంతలో ఇంటి ఓనర్ వస్తే కిలాడీలకు ఎలా ఇళ్లు ఇస్తావ్‌రా.. వాళ్లతో బిజినెస్ చేస్తున్నావా ఈ కిలాడి తల్లి అందమైన ఇద్దరు కూతుళ్లను మాకు 5 లక్షలకు అమ్మేసింది 2 లక్షలు అడ్వాన్స్ తీసుకుంది అని కూతుళ్లను పంపకుండా రాత్రికి రాత్రి పెట్టా బేడ సర్దుకొని ఇలా వచ్చేశారు అంటారు. ఎవరయ్యా మీరు ఇంతలా మమల్ని వేధిస్తున్నారని ఏడుస్తుంది. డబ్బులు కడతావా నీ కూతుళ్ల లాక్కెళ్లాలా అని అరుస్తారు. ఇందిర ఎవరు మీరు ఇలా చేస్తున్నారు అని బతిమాలుతుంది. దాంతో ఆ రౌడీ రేపటి వరకు గడువు ఇస్తా రేపు డబ్బులు ఇవ్వకపోతే ఇద్దరు కూతుళ్లని ఈడ్చుకెళ్తా అంటాడు. ఈ దెబ్బతో ఓనర్ ప్రేరణ వాళ్లని వెంటనే ఇంటి నుంచి వెళ్లిపోమని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















