Nindu Manasulu Serial Today August 14th: నిండు మనసులు సీరియల్: సివిల్స్ కల కోసం సిద్ధూ పోరాటం: విశ్వనాథం కోచింగ్ సెంటర్లో అసలేం జరిగింది?
Nindu Manasulu Serial Today Episode August 14th సిద్ధూని బయటకు పంపేయడం ప్రేరణ విశ్వనాథంతో మాట్లాడి ఆయన మనసు మెప్పించి సిద్ధూ పరీక్ష రాసేలా చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode ప్రేరణ, సిద్ధూ ఇద్దరూ విశ్వనాథం గారి దగ్గర కోచింగ్ సెలక్షన్ టెస్ట్ కోసం వెళ్తారు. విశ్వనాథం గారు ఆనంద్, వర్ధిని, సిద్ధార్థ్‌లను బయటకు వెళ్లిపోమని అంటారు. నన్ను ఎందుకు వెళ్లిపోమంటున్నారో చెప్పండి అని సిద్ధార్థ్ అడుగుతాడు. నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని విశ్వనాథం అంటారు.
సిద్ధూ: సార్ అలా కాదు నన్ను ఎందుకు వద్దన్నారో నాకు తెలియాలి అని అడుగుతున్నాను. సార్ ప్లీజ్ సార్.
విశ్వనాథం: ఈ వ్యవస్థలో కులం, మతం, జాతి, డబ్బు ఎంత పెద్ద రుగ్మతలో రికమండేషన్ అలాంటి రుగ్మత. నువ్వు అలాంటి రుగ్మతతో వచ్చావ్. రికమండేషన్‌తో నా కాంపౌండ్‌లో అడుగు పెట్టావ్. మీరు ఎవరితోనో రికమండేషన్ చేయించారు. నాకు అది నచ్చలేదు. మీరు ఇక వెళ్లొచ్చు.
సిద్ధూ: సార్ నేను రికమండేషన్లకు వ్యతిరేకిని సార్ నాకు అలాంటివి నచ్చవు. మీరు కోచింగ్ ఇస్తారు అని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను సార్. ఎంతో ఆశలు పెట్టుకొని వచ్చాను సార్. సివిల్స్ నా కల సార్.
సిద్ధూ ఎంత చెప్పినా విశ్వనాథం వినరు. సిద్ధూని వెళ్లిపోమని అంటారు. మరోవైపు సాహితి దగ్గరకు మంజుల వచ్చి సిద్ధూ గురించి మాట్లాడుతూ సిద్ధూ నువ్వేం చెప్పినా వింటాడు. వాడిని మన ఇంటికి వచ్చేయమని చెప్పు. మహారాజు లాంటి జీవితం వదిలేసి వెళ్లిపోయాడు. ఒంటరిగా ఉంటూ మా పరువు తీస్తున్నాడు. డెలివరీ బాయ్లా పని చేస్తున్నాడని చెప్తుంది. ఇక సిద్ధూ బాధ పడుతూ బయటకు వచ్చేస్తాడు. నాకే ఎందుకు ఇలా జరుగుతుందని నేనేం తప్పు చేశాను.. ఎందుకు ఆ నీచుడు నన్ను ఇలా వెంటాడు తున్నాడని సిద్ధూ చాలా బాధ పడతాడు. విశ్వాసం సిద్ధూని చూసి విజయానంద్‌కి మొత్తం చేరవేస్తాడు. వాడి ఆశల్ని చంపేయాలి వాడిని కనిపెడుతూనే ఉండు అని విజయానంద్ విశ్వానికి చెప్తాడు.
ప్రేరణ మనసులో సిద్ధూ గురించి ఆలోచిస్తూ ఈ మనిషి ఎలాంటి వాడు అయినా కావొచ్చు కానీ సివిల్స్ లక్ష్యంగా ఇక్కడి వరకు వచ్చాడు అంటే ఎంత కష్టపడి ఉంటాడో పాపం అని అనుకొని సిద్ధూ తరఫున విశ్వనాథంతో మాట్లాడుతుంది. రికమండేషన్ చేయించారు అనే వాళ్లని పంపేస్తే నువ్వు వాళ్లని రికమండ్ చేస్తున్నావా అని అడుగుతారు. సార్ అలా కాదు సార్ సారీ సార్ అని ప్రేరణ మాట్లాడుతుంది. సివిల్స్ చేసే విద్యార్థుల కష్టాలు మీకు తెలుసు కదా సార్. ఎంతో ఆశతో ఇదొక అవకాశం అని వచ్చారు కదా సార్. అవకాశం అనేది మన నీడ కాదు కదా సార్ ఎప్పుడూ మన వెంట ఉండటానికి అది ఒక అదృష్టం ఒకసారే తలుపు తడుతుంది. మా అందరికీ మీ రూపంలో ఆ అదృష్టం వచ్చింది. కానీ మాలో ఎవరికి ఆ అదృష్టం వరిస్తుందో తెలీదు. వెళ్లిపోయిన వాళ్లలో కూడా ఉండొచ్చు కదా సార్.. ఇక్కడికి వచ్చి పరీక్ష రాసి ఫెయిల్ అయితే సారే కానీ లేదంటే జీవితాంతం వాళ్లని వాళ్లు క్షమించుకోలేరు కదా సార్. మా నాన్న చెప్పారు. ఒకరి ఆకలి తీర్చకపోయినా పర్లేదు కానీ నోటి దగ్గర ముద్ద లాగేయకూడదు కదా సార్ అని అంటుంది.
ప్రేరణ మాటలకు విశ్వనాథం సిద్ధూ వాళ్లని పిలవమని చెప్తారు. సిద్ధూని పిలుస్తారు. సిద్ధూ చాలా సంతోషంతో వస్తాడు. మిగతా ఇద్దరూ వెళ్లిపోయింటారు. ఇక విశ్వనాథం అందరికీ రూల్స్ చెప్తారు. తానే క్వశ్చిన్ పేపర్ సిద్ధం చేశానని చాలా కష్టంగా పేపర్ ఉంటుందని అరగంటలో పరీక్ష రాయాలని సెలక్ట్ అయిన ఒక్కరికి కోచింగ్ ఇస్తానని చెప్తారు. అందరూ పరీక్షకి సిద్ధమవుతారు. మరోవైపు పనిమనిషి రాజశేఖర్‌ని దారుణంగా చూస్తుంటుంది. సూప్ తాగిస్తానంటూ అటూ ఇటూ తిప్పేసి పోసేస్తుంది. నీలాంటి వాళ్లు బతకడం ఎందుకు చస్తే బెటర్ కదా అంటుంది. పని మనిషి ప్రవర్తన భర్త దుస్థితి చూసి ఇందిర చాలా ఏడుస్తుంది. దీని పని తర్వాత చెప్తా అనుకుంటుంది. సిద్ధూ, ప్రేరణతో పాటు మిగతా అందరూ పరీక్ష రాస్తారు. రిజల్ట్ కోసం వెయిట్ చేయమని చెప్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















