Nindu Manasulu Serial Today August 11th: నిండు మనసులు సీరియల్: గణకు ట్రాఫిక్ ఎస్ఐ పోస్టింగ్.. ప్రేరణ, ఐశ్వర్యలకు కొత్త సమస్యలు! సిద్ధూపై తండ్రి కుట్రలు!
Nindu Manasulu Serial Today Episode August 11th గణకి ట్రాఫిక్ ఎస్‌ఐగా పోస్టింగ్ ఇవ్వడం, ప్రేరణతో ఐశ్వర్య తండ్రి గురించి తప్పుగా మాట్లాడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode గణకి పై అధికారి కాల్ చేసి ట్రాఫిక్ ఎస్‌ఐగా పోస్టింగ్ ఇచ్చినట్లు చెప్తాడు. గణ షాక్ అయిపోతాడు. నేనేంటి నాకు ట్రాఫిక్ ఎస్‌ఐగా పోస్టింగ్ ఇవ్వడం ఏంటి? నాతో ఆటలు ఆడుతున్నారా? నా తప్పు లేకుండా సస్పెండ్ చేశారు పోనిలీ అని కాళ్లు పడితే నాకు సంబంధం లేని పోస్టింగ్ ఇచ్చారు అని కేకలేస్తాడు.
గణ ఆవేశం చూసిన పై అధికారం నువ్వు అనవసరంగా మినిస్టర్, ఆ విజయానంద్‌తో పెట్టుకున్నావ్. ఈ పోస్ట్ నీకు ఇష్టం లేదు అంటే వెళ్లి వాళ్లతో మాట్లాడు అని అంటాడు. అది నా వల్ల కాదు సార్ అని గణ అంటాడు. గణ తల్లికి వెళ్లి నీ జాబ్ కోసం ఎవరినైనా కలవాలి అని అంటుంది. దాంతో గణ ఆ విజయానంద్ మంచోడు కాదమ్మా.. పైకి కనిపించినంత బుద్ధి మంతుడు కాదు. బాగా కన్నింగ్ ఫెలో. వాడు పాము కంటే డేంజర్ మనిషి అమ్మా అని చెప్తాడు. వాడు ఎంత డేంజర్ అయినా పర్లేదు.. బతిమాలు అవసరం అయితే కాళ్లు పట్టుకో పర్లేదు.. ఇప్పుడు నువ్వు వాడు కాళ్లు పట్టుకుంటేనే ఆ కాళ్లు పట్టుకొని కిందకి లాగేయొచ్చు. ఆ ప్రేరణ అంతు చూడాలి అంటే నీకు పవర్ ఉండాలి అని చెప్తుంది.
ప్రేరణ వాళ్లు ఫుడ్ రెడీ చేసుకొని డైనింగ్ టేబుల్ మీద పెడుతుంటే అక్కడ రంజిత్ వచ్చి కూర్చొంటాడు. మీరేంటి కూర్చొన్నారు అని అడిగితే రూల్స్ చదవలేదా అని అడుగుతాడు. చదివామని ప్రేరణ అంటే మీరు చదవలేదు అండీ రెండో పేజీలో రూల్స్ మీరు చదవలేదు అని అంటారు. దాంతో ప్రేరణ అగ్రిమెంట్ తీసుకొస్తుంది. అందులో రెండో పేపర్‌లో చదవమని అంటాడు. అందులో రంజిత్‌ని ఇబ్బంది పెట్టకూడదని టైం ప్రకారం టీ టిఫెన్, భోజనం పెట్టాలని అది కూడా ఓనర్‌కి నచ్చినట్లు వండాలని.. రాత్రి ఓనర్ లేటుగా వచ్చినా వెయిట్ చేయాలని సంగీత కచేరీలు వద్దని రాసుంటుంది. సంగీతం లేకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది అని ఐశ్వర్య అంటే కొన్నాళ్లు తప్పదు అని అనుకుంటారు. ఐశ్వర్యని ఒప్పిస్తారు. ముగ్గురూ భయపడి వడ్డిస్తారు.
ఐశ్వర్య రాత్రి మీకు ఈ సిటీ మొత్తంలో ఎక్కడా ఇళ్లు దొరకదు అని చెప్పిన మాట గుర్తు చేసుకొని ఆలోచిస్తుంటుంది. ఇంతలో ప్రేరణ అక్కడికి వస్తుంది. ఎందుకు అక్క మన మీద వాళ్లకి అంత కోపం అని అంటుంది. మనం వాళ్ల జీవితంలోకి వచ్చాం కదా వాళ్లకి అంత కోపం అని అంటుంది. నువ్వు వాళ్ల ఇంటికి వెళ్లి నాన్నని కలిశావ్ కదా అక్క అని ఐశ్వర్య నిలదీస్తుంది. నాన్న పరిస్థితి తెలిసి వెళ్లానని అంటుంది. ఇప్పటికే మనకు ఉన్న సమస్యలు చాలు అక్కా ఇంకా వద్దు అని ఐశ్వర్య అంటుంది. ఇవన్నీ మనకు సమస్యలు కాదు ఐసూ నాన్నతో మనం వాళ్ల పిల్లలం అని చెప్పించుకోవడమే ముఖ్యమైన సమస్య అంటుంది. దాంతో ఐశ్వర్య నాన్న మనల్ని మోసం చేశాడని అంటుంది. ప్రేరణ చెల్లితో నాన్న గురించి తక్కువగా మాట్లాడొద్దు అని చెప్తుంది.
కుమార్ సిద్ధూని నిద్రలేపి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ విశ్వనాథం గారు ఏడాదికి ఒకరికి కోచింగ్ ఇస్తారని పర్సనల్గా టెస్ట్ పెట్టి గెలించిన వారికే కోచింగ్ ఇస్తారని అంటాడు. రికమండేషన్‌లు ఆయన దగ్గర చెల్లవని చెప్తాడు. సిద్ధూ చాలా సంతోషపడతాడు. ఇప్పుడు ధైర్యమొచ్చిందని అనుకుంటాడు. ప్రేరణ కూడా ఇదే విషయాన్ని తల్లి, చెల్లితో చెప్తుంది. అందరూ సంతోషపడతారు. ఇంతలో సుధాకర్ వస్తాడు. మరోవైపు విజయానంద్ సిద్ధూ గురించి ఆలోచించి ఎంత టార్చర్ చేసినా అంతే ఎత్తుకు ఎదుగుతున్నాడు. ఏదో ఒక రోజు ఐఏఎస్ అయి నా ముందు కాళ్ల మీద కాలు వేసుకొని కూర్చొంటాడు. అది నేను ఊహించుకోలేను ఎలా అయినా వాడి అంతు చూడాలని అనుకొని కోచింగ్ ఇచ్చే విశ్వనాథానికి కాల్ చేస్తాడు. సిద్ధూ అనే వాడు కోచింగ్‌కి వస్తాడు. వాడిని సెలెక్ట్ చేస్తే డబ్బు ఇస్తా అని విశ్వనాథానికి రెచ్చగొడతాడు. ఇంతలో సాహితి వచ్చి అన్నయ్యకి రికమండేషన్ అంటే నచ్చదు కదా ఎందుకు అందరికీ చెప్తారు అని అడుగుతుంది. ఇదంతా సిద్ధూ మీద ప్రేమతోనే అని విజయానంద్ కవర్ చేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















