Nindu Manasulu Serial Today April 6th: నిండు మనసులు సీరియల్: ప్రేరణ వర్సెస్ మంజుల! సిద్ధూ తండ్రిని చంపింది విజయానందే అని బయట పెట్టేసిన ప్రేరణ!
Nindu Manasulu Serial Today April 6th ప్రేరణ ఇంటికి మంజుల, విజయానంద్ వచ్చి పెళ్లి గురించి గొడవ పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode ప్రేరణ సిద్ధూని కొట్టి తిట్టి వెళ్లిపోతుంటే ఇందిర ఎదురుగా వస్తుంది. ఏంటే ఎందుకు అలా బాధ పడిపోతున్నావ్.. అసలు నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావ్.. తాళి వద్దని పెళ్లి వద్దని.. ఇంకెప్పుడూ అలా మాట్లాడొద్దు చెప్తున్నా.. జరిగింది ఏదీ బొమ్మల పెళ్లి కాదు.. వద్దు అనుకోవడానికి అని ఇందిర అంటుంది. దానికి ప్రేరణ కానీ నేను బొమ్మలా నిల్చుండిపోయాను కదా.. సిద్ధూ తాళి కడుతున్నప్పుడు.. నన్ను ఒక బొమ్మని చేసి పెళ్లి చేసుకున్నాడు.. ఒక ప్రాణం లేని బొమ్మకి తాళి కట్టినట్లు నాకు తాళి కట్టాడు అని అంటుంది.
ఇందిర ప్రేరణతో ఎక్కువ ఆలోచించకే మనసు పాడై పోతుంది అని అంటుంది. బాబు మీరు దాని మాటలు మనసులో పెట్టుకోవద్దు.. మీరు సంతోషంగా ఉండండి అని ప్రేరణ చేతులు సిద్ధూ చేతులు కలుపుతుంది. ఈ చేతుల్ని జీవితంలో వదలొద్దు బాబు.. మీరు ఎప్పుడూ కలిసే ఉండాలి.. అని అంటుంది. ప్రేరణ ఏడుస్తూ చేతులు తీసుకొని వెళ్లిపోతుంది. ప్రేరణ జరిగిందే తలచుకొని బాధగా ఉంటే ఐశ్వర్య వెళ్లి అక్కని నార్మల్ చేయాలి అనుకొని హాల్‌లోకి రమ్మని పిలుస్తుంది.
నేను రాను అని ప్రేరణ అంటే అంతేనే మా అందరి ముందు సిద్ధూ బావతో మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నావా అంటుంది. ప్రేరణ అరుస్తుంది.. అయినా సరే ఐశ్వర్య ప్రేరణని బయటకు తీసుకెళ్తుంది. ఇందిర పాయసం చేసి సిద్ధూకి ఇస్తుంది. వద్దు అని సిద్ధూ అంటే తీసుకో సిద్ధూ మొహమాట పడతావేంటి అని విజయానంద్ అంటూ విజయానంద్, మంజుల ఎంట్రీ ఇస్తారు. అందరూ షాకింగ్‌గా చూస్తారు. కొత్తగా పెళ్లి అయిన వాళ్లకి తీపి తినిపిస్తే ఆ కాపురం పచ్చగా హాయిగా ఉంటుంది.. చూశావా మంజు మన సిద్ధూ కొత్తగా పెళ్లి చేసుకొని ఇక్కడికి ఇళ్లరికం వచ్చేశాడు అని అంటాడు.
సిద్ధూ తల్లి దగ్గరకు వెళ్లి నేను ప్రేరణ అనగానే మంజుల లాగి పెట్టి కొడుతుంది. అమ్మ అని సిద్ధూ అంటే అలా పిలవకు ఆ పిలుపునకు ప్రాణం లేకుండా చేసేశావ్.. సిద్ధూ కాలర్ పట్టుకొని అసలు నేను నీకు ఏం తక్కువ చేశానురా.. ఇలాంటి పని ఎందుకు చేశావ్.. ఈ అమ్మ ఉందని అనుకున్నావా.. అనుకోవడం ఏంటిలే.. ఆల్రెడీ చంపేశావ్ అని అంటుంది. ప్రేరణ నిన్ను ఎంతగా మాయ చేసిందో అర్థమైందని విజయానంద్ అంటాడు. నీకు పెళ్లి చేసుకోవాలని ఉందని నాకు చెప్పుంటే గొప్పింటి సంబంధాలు తీసుకొచ్చేదాన్ని.. కాని ఇప్పుడు అందరూ మంజుల కొడుకు ఇలాంటి సంబంధం చేసుకున్నాడేంటి అని అనుకుంటారని అంటుంది. అమ్మ నేను మీ మీద గెలవడానికి ఈ పెళ్లి చేసుకోలేదు.. పది మందిలో ఓ ఆడపిల్ల పరువు కాపాడటానికి చేసుకున్నా..అందులోనూ ప్రేరణ నా మనిషి.. తను కష్టాల్లో ఉంటే నేను చూస్తూ ఉంటే నా జీవితానికే అర్థం లేదు అని సిద్ధూ అంటాడు. జన్మనిచ్చిన తల్లి కంటే ఈ అడ్రస్‌లేని వాళ్లు ఎక్కువ అయిపోయారా.. వీళ్లని చేసుకొని నువ్వేం సాధిస్తావ్ అని విజయానంద్ అడుగుతాడు.
సిద్ధూ కోపంగా నా జీవితం గురించి అడిగే హక్కు నీకు లేదు అని సిద్ధూ అంటే.. ఉంది నా భర్తగా నీ తండ్రిగా ఆయనకు అడిగే హక్కు ఉందని మంజుల అంటుంది. రంజిత్ కలుగ జేసుకొని ఆవేశపడొద్దు.. మీ స్థాయికి తగ్గట్టు పెళ్లి గొప్పగా జరగలేదు కానీ రిసెప్షన్ గ్రాండ్‌గా పెట్టుకోవచ్చు కాస్త పెద్ద మనషుతో ఆలోచించండి అని రంజిత్ చెప్తాడు. ఇది మా సిద్ధూ జీవితం మీరు ఇందులో కలుగజేసుకోవద్దు అని విజయానంద్ అంటాడు. ఇందిర రంజిత్‌తో బాబు మీరు మా వల్ల మాటలు పడొద్దు.. అని అంటుంది. మంజుల వాళ్లతో జరిగింది ఏదో జరిగిపోయింది.. ఇద్దరికీ పెళ్లి అయిపోయింది.. మీరు పెద్ద మనసుతో ఆశీర్వదిస్తే వాళ్లకి ఒక కొత్త జీవితం ఇచ్చిన వాళ్లం అవుతాం.. దయచేసి పరిస్థితి అర్థం చేసుకోండి.. నా కూతుర్ని మీ ఇంటి కోడలిగా అంగీకరించండి.. అని అంటుంది.
మంజుల కోపంగా ఏంటి ఆశీర్వదించాలా.. మీ లాంటి వాళ్లని చూస్తూనే నాకు కంపరంగా ఉంటుంది.. అలాంటిది ఆశీర్వదించమని అంటావా.. అసలు మీరు మనుషులేనా.. పెద్దవాళ్ల అనుమతి లేకుండా పెళ్లి జరుగుతుంటే ఆపకుండా చూస్తారా అని మంజుల అరుస్తుంది. ఏరా తాళి కట్టే ముందు ఒక్క సారి కూడా ఈ తల్లి నీకు గుర్తు రాలేదా.. అని మంజుల అడిగితే ఎలా గుర్తొస్తుంది మంజు వీళ్లందరి మాయలో పడిపోయాడు.. తాళి కట్టించుకున్న వాళ్లకి సిగ్గు లేకపోతే ఎవరు ఏం చేస్తారు.. ఇలా ఎవరు కట్టినా కట్టించుకుంటారేమో అని విజయానంద్ అంటాడు. మా అక్క గురించి ఇలా అంటే ఊరుకోను.. మీరు ఇంతలా అనడానికి మేం మీకు ఏం అన్యాయం చేశామని ఐశ్వర్య అంటుంది. మీ అక్కని అంటే నీకు ఇంత కోపం వస్తే నా కొడుకుని నాకు దూరం చేస్తే నేను ఊరుకుంటానా అని మంజుల అంటుంది.
విజయానంద్ ఐశ్వర్యతో మీరు అన్యాయం అయిన కుటుంబంలో పుట్టారు కదా.. అదే మీరు చేసుకున్న పాపం.. మీకు ఇళ్లు లేదు..ఊరు లేదు.. పేరు లేదు.. ఒక మగ దిక్కు లేని జీవితం మీది.. అసలు మీ అమ్మ మిమల్ని నిజంగా కనేపెంచిందా అని విజయానంద్ అడిగితే ప్రేరణ కోపంగా విజయానంద్ ఇంకొక్క మాట మా అమ్మ గురించి మాట్లాడితే నేను ఊరుకోను.. నీ కంటికి ఆడవాళ్లు మనుషులుగా కనిపించరా.. పశువులుగా కనిపిస్తున్నామా.. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావ్.. మర్యాదగా మా అమ్మకి క్షమాపణ చెప్పు.. లేదంటే నేను ఏం చేస్తానో నాకు తెలీదు.. అని అంటుంది. నా ముందే నా భర్త పేరు పెట్టి పిలవడమే కాకుండా నా భర్త క్షమాపణ చెప్పాలి అంటావా అని మంజుల అంటుంది. పెళ్లి చేసుకోమని మీ అబ్బాయికి మేం ఏమైనా అడిగామా.. లేదంటే మమల్ని కాపాడమని మేం వేడుకున్నామా,, మీ అబ్బాయే వచ్చి తనంతట తాను నాకు తాళి కట్టాడు.. ఇందాక నుంచి ఏదో మాయ చేశారు అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు.. మాయ చేయడానికి మీ అబ్బాయి ఏమైనా చిన్న పిల్లాడా., అని ప్రేరణ అడుగుతుంది. అలా జరుగుతుందని మేం ఊహించలేదని ఇందిర అంటే.. అన్నీ ముందే ప్లాన్ చేశారు కదా అని విజయానంద్ అంటాడు.
నిజంగా నా కొడుకు తాళి కడుతుంటే ఇంత మంది ఉన్నారు కదా ఒక్కరు కూడా ఆపలేకపోయారా.. నువ్వు ఏం చేశావ్.. చేతులు పడిపోయావా.. దొరికిందే ఛాన్స్ అని తాళి కట్టించుకున్నావ్., అయినా ఆ రోజు మాటిచ్చావ్ కదా.. మరి దానికి ఏం సమాధానం చెప్తావ్ అని మంజుల అడుగుతుంది. అసలు ఈ తల్లీకూతుళ్లకి పద్ధతి పాడు ఉంటే కదా.. గణ గాడి తండ్రిని వీళ్ల తండ్రి అంటారు.. ఈవిడేమో పక్కవాళ్ల మొగుడిని నా మొగుడు అంటుంది. ఆ రాజశేఖరం ఏమో ఈమె నా భార్య కాదు అంటుంది. అంటే వీళ్లిద్దరి మధ్య సంబంధం ఏంటి.. నిజంగా మీ అమ్మకి భర్త వాడేనా.. లేక ఇంకెవరైనా ఉన్నారా అని విజయానంద్ అంటే ప్రేరణ కోపంగా మాటలు మర్యాదగా రాకపోతే నాలుక చీరేస్తా అని అరుస్తుంది. మీతో మాకు అనవసరం మా దృష్టిలో ఈ ఇది పెళ్లే కాదు.. మాతో రా సిద్ధూ.. ఇక్కడ అంటించుకున్న బురద ఇక్కడే వదిలేసి వచ్చేయ్.. మీ అమ్మతో ప్రేమ ఉంటే మాతో వచ్చేయ్ అని అంటాడు.
నువ్వు రమ్మంటే రావడానికి నేను బొమ్మల పెళ్లి చేసుకోలేదు.. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు.. నువ్వు నా కన్న తండ్రివి కాదు.. అసలు నువ్వు మనిషివేనా.. ఆడవాళ్ల గురించి వాళ్ల వ్యక్తిగత జీవితం గురించి ఇంత నీఛంగా మాట్లాడుతున్నావ్ నీకు సిగ్గుగా లేదా అని అడుగుతాడు. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావ్ సిద్ధూ.. ఈయన నా భర్త.. నీ భవిష్యత్ కోసం ఒక తండ్రిగా ఆలోచిస్తున్నారు.. మాతో పాటు వచ్చేయ్.. లేదంటే మమల్ని మర్చిపో అని మంజుల అంటే అమ్మా ఏంటమ్మా ఆ మాటలు.. నేను నిన్ను మర్చిపోలేను అని సిద్ధూ అంటాడు. అయితే మాతో రా అని మంజుల అంటే నేను ప్రేరణ చేయి కూడా వదల్లేను.. మేం ఎక్కడున్నా కలిసే ఉంటాం అని సిద్ధూ అంటాడు.
నేను ఒప్పుకోను.. ఇలాంటి నీతి తప్పిన ఆడదానికి పుట్టిన దాన్ని చేసుకుంటే తండ్రిగా నేను ఒప్పుకోను అని విజయానంద్ అంటాడు. దానికి ప్రేరణ కోపంగా హేయ్ ఛీ నువ్వు తండ్రివి ఏంట్రా సిద్ధూ తండ్రిని చంపిన హంతకుడివి నువ్వు అని అంటుంది. అందరూ షాక్ అయిపోతారు. ఏంటన్నావ్ అని మంజుల అంటుంది. ప్రేరణ కూడా ఇలా అనేశానేంటా అని షాక్ అయిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Before You Go
Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
ట్రెండింగ్ వార్తలు






















