అన్వేషించండి

Nindu Manasulu Serial Today May 11th: నిండు మనసులు: ప్రేరణకు భర్త్‌డే సర్‌ఫ్రైజ్ ఇచ్చింది ఎవరు? సిద్ధూ దగ్గర ఉన్న పెన్‌డ్రైవ్‌లో ఏముందో ప్రేరణ చూస్తుందా!

Nindu Manasulu Serial Today May 11th సిద్ధూ ప్రేరణ కోసం కేక్ ఆర్డర్ చేయి అర్ధరాత్రి కట్ చేయించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode  ప్రేరణ, సిద్ధూ ఇద్దరూ రాత్రి చదువుకుంటూ ఉంటారు. ప్రేరణ సిద్ధూని చూస్తూ సిద్ధూకి రేపు నా భర్త్డే అని గుర్తుందో లేదో.. ఇప్పుడు నేను ఎలా చెప్పాలి.. అయినా ప్రేమించిన అమ్మాయి పుట్టిన రోజు అంటే అర్ధరాత్రి పడుకోకుండా విష్ చేసేవాళ్లు ఉన్నారు.. ఈయన మాత్రం ఎలా చదువుకుంటున్నాడో అని అనుకొని సిద్ధూ దగ్గరకు వెళ్లి రేపు ఏంటో గుర్తుందా అని అడుగుతుంది. రేపు లేదు ఎల్లుండి లేదు పోయి చదువుకో నన్ను డిస్ట్రబ్ చేయకు అని సిద్ధూ ప్రేరణని పంపేస్తాడు. మరోవైపు ఐశ్వర్య అర్ధరాత్రి ప్రేరణకి మొదటి విష్ చెప్పాలి అని ఇందిర, రంజిత్‌ని పక్కన కూర్చొపెట్టుకొని వెయిట్ చేయిస్తుంది. 

ఐశ్వర్య రాత్రి సరిగ్గా 12 గంటలకు ఫోన్ చేస్తుంది. ప్రేరణ చూస్తుంది కానీ లిఫ్ట్ చేయదు.. ఇప్పుడు తనకు పెళ్లి అయింది కదా పక్కన సిద్ధూ ఉంటాడు వదిలేయ్‌వే అని ఇందిర అంటుంది. ప్రేరణకు మళ్లీ ఐశ్వర్య కాల్ చేస్తే ప్రేరణ లిఫ్ట్ చేసి ఐషూ నువ్వేం చెప్పాలి అనుకుంటున్నావో నాకు తెలుసు.. నేను ఫస్ట్ మా ఆయనతో విష్ చేయించుకోవాలి అనుకుంటున్నా.. ప్లీజ్ అర్థం చేసుకో నువ్వు ఉదయం విష్ చేయ్ అని ఫోన్ పెట్టేస్తుంది. ఇక సిద్ధూతో ఏం గుర్తు లేదా అంటే ఏం లేదు అని సిద్ధూ బెడ్ మీదకు వెళ్లిపోతాడు. ప్రేరణ సోఫా మీదకు వెళ్లి అలిగి పడుకుంటుంది.

సిద్ధూకి సడెన్‌గా ప్రేరణ భర్త్‌డే అని గుర్తొచ్చి వెంటనే కుమార్‌కి కాల్ చేసి రేయ్ ప్రేరణ భర్త్‌డే అని నెల రోజుల ముందు ఓ సర్‌ఫ్రైజ్ ప్లాన్ చేశాం కదా.. రేయ్ కేక్‌తో పాటు ఓ సర్‌ఫ్రైజ్ ప్రపోజల్ వీడియో కూడా యాప్ వాళ్లకి చేయమని చెప్పాం కదా.. అది ఇక్కడికి రాకూడదు.. నువ్వే ఏదో ఒకటి చేయరా అని అంటాడు. కుమార్ సిద్ధూతో కేక్ మీ ఇంటికి రాదులే.. మనం ప్రేరణ వాళ్ల అడ్రస్ ఇచ్చాం ఇక నో ప్రాబ్లమ్ అని అంటాడు.

రంజిత్ ఇంటికి సర్‌ఫ్రైజ్ ఆర్డర్ వెళ్తుంది. ఐశ్వర్య తన అక్క ఇంట్లో లేదని చెప్తుంది. రంజిత్ ఆయనతో డబ్బులు నేను ఇస్తా ఈ కేక్ అవి వేరే అడ్రస్‌కి డెలివరీ చేయమని అడ్రస్ చెప్తాడు. విజయానంద్ వాళ్ల ఇంటికి కేక్ ఆర్డర్ వెళ్తుంది. విజయానంద్ చూసి ఏంటి ఎవరికి అంటే సిద్ధూ అర్డర్ పెట్టారు అని అంటాడు. ఆయన సిద్ధూకి కాల్ చేసి అడ్రస్‌కి కేక్ వచ్చింది అంటే కంగారుగా బయటకు వస్తాడు. ఇంట్లో అందరూ అక్కడికి చేరుకుంటారు. ప్రేరణ పేరు మీద కేక్ వచ్చింది అని అంటే ప్రేరణ వచ్చి నా భర్త్‌డే కోసం నా కోసం ఆర్డర్ పెట్టారా.. అని గిఫ్ట్ కూడా చూస్తుంది. ఇంతలో సిద్ధూ గిఫ్ట్ దాచేస్తాడు. అదేంటి అన్నయ్యా అని సాహితి అంటే అది పర్సనల్ తర్వాత నాకు ఇస్తారులే అని అంటుంది.

కేక్‌ కటింగ్‌కి ఏర్పాట్లు చేయ్ సాహితి అని చెప్తుంది. ఇక ప్రేరణ విజయానంద్‌తో మీరు మందు తాగారు కాదా.. ఇప్పుడు సిద్ధూతో నాకు కేక్ తినిపించేలా చేయకపోతే మీ విషయం అత్తయ్యకి చెప్పేస్తా అని అంటాడు. సిద్ధూ నిద్ర వస్తుంది వెళ్లిపోతా అంటే విజయానంద్ ఆపుతాడు. అంత నిద్ర వస్తే కేక్ ఎందుకు ఆర్డర్ పెట్టించావ్.. ప్రేరణకి పెళ్లి అయిన తర్వాత మొదటి సారి ఇంట్లో చేస్తున్న భర్త్‌డే మనం సెలబ్రేట్ చేయాలి అని విజయానంద్ అంటాడు. మంజు నువ్వు చెప్పు అని విజయానంద్ అంటే కేక్ ఆర్డర్ పెట్టినప్పుడు తెలీదా నిద్రోస్తుందని అని మంజు అంటుంది. 

సిద్ధూ అమ్మ కూడా చెప్పింది ఏం ఆలోచిస్తున్నా రా సెలబ్రేట్ చేయ్ అని విజయానంద్ అంటాడు. విజయానంద్ సాహితికి అగ్గి పెట్టి ఇచ్చి క్యాండిల్ వెలిగించమని అంటే సాహితి  ముఖం తిప్పేస్తుంది. దాంతో విజయానంద్ సాహితి మర్చిపోయావా.. నీ భర్త్‌డేకి అన్నయ్యా,, ప్రేరణనే కేక్ కట్ చేయించారు అని అంటే గుర్తుంది.. నువ్వు కేక్ తోసేశావ్ అంటుంది. ఇలాంటివి గుర్తుంటాయ్ అని విజయానంద్ అంటాడు. ఇక కేక్ కట్ చేయమని ప్రేరణని అంటే నేను కట్ చేయను సిద్ధూ నా కోసం పాట పాడలేదు అని అంటుంది. అమ్మ నిద్రపోవాలి అని చెప్పడంతో సిద్ధూ పాడుతాడు. తర్వాత ప్రేరణకి విజయానంద్ తినిపించాలని వస్తే ప్రేరణ సిద్ధూ తినిపించాలని సైగ చేస్తుంది. సిద్ధూ తినిపిస్తాడు. విజయానంద్‌కి కూడా తినిపిస్తుంది. తర్వాత ప్రేరణ మంజులకు తినిపించాలని చూస్తే మంజు ప్రేరణకి తినిపించి విష్ చేసి వెళ్లిపోతుంది.

ప్రేరణ సిద్ధూకి గిఫ్ట్ ఏంటిఅని అడిగితే సిద్ధూ ఫాస్ట్‌గా గదిలోకి వెళ్లిపోతాడు. కుమార్‌కి కాల్ చేసి కేక్ ఆర్డర్ ఇక్కడికి రాదు అన్నావ్ కదరా.. కానీ వచ్చిందిరా.. అని అంటాడు. ప్రేరణ చాటుగా సిద్ధూ మాటలు వింటుంది. రేయ్ పొరపాటున ప్రేరణ ఆ వీడియో చూసుంటే ఏంట్రా పరిస్థితి ఆ పెన్‌డ్రైవ్ తన చేతికి వెళ్లకుండా నేను తీసుకున్నా.. నా పాకెట్‌లోనే దాచుకున్నా అని అంటాడు. ఎట్టి పరిస్థితిలో ఇందులో ఏం ఉందో ప్రేరణకు తెలీకూడదు అని అనుకుంటాడు. నాకు తెలీకుండా చేయాలని అనుకుంటున్నావా.. అందులో ఏం ఉందో తెలుసుకోకపోతే నాకు నిద్ర పట్టదు.. నువ్వు లేచేలోపు అందులో ఏం ఉందో తెలుసుకుంటా అని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

 

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
Godavari Serial Today August 15th: 'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
Nindu Manasulu Serial Today August 15th: నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!

వీడియోలు

Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Sambarala Yetigattu Release Date : సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget