kalavari kodalu kanaka mahalakshmi serial today may 9th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ అంబిక కుట్రని అడ్డుకుంటుందా! విహారి చేసిన పనికి చారుకేశవ షాక్!
kalavari kodalu kanaka mahalakshmi today may 9th లక్ష్మీ అంబిక పార్ధసారధిల డీల్‌ని అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

kalavari kodalu kanaka Mahalakshmi serial today episode అంబిక, సుభాష్ ఇద్దరూ పార్థసారధిని రోడ్డు మీద కలుస్తారు. వీ క్రాఫ్ట్ ఇప్పుడే అమ్మేస్తాం కొనేయమని అంటుంది. పార్ధసారధి ఇంత త్వరగా ఎందుకు అని అనడంతో మేం ఇచ్చేయాలి అనుకుంటున్నాం.. మీరు కాదు అంటే మరో ఇన్వెస్టర్ రెడీగా ఉన్నారు అని అంటుంది. దాంతో పార్ధసారధి ఇప్పుడే డీల్ పూర్తి చేస్తానని అంటాడు. అందుకు అంబిక పేపర్లు ఇస్తుంది. లక్ష్మీ వాళ్ల మేనేజర్ మొత్తం చాటుగా చూస్తూ రికార్డ్ చేస్తాడు.
అంబిక వాళ్ల మాటలు లక్ష్మీ వింటూ ఉంటుంది. అంబిక తను చెప్పిన అకౌంట్‌కి డబ్బు పంపమని అంటుంది. అగ్రిమెంట్ మీద అంబిక, పార్ధసారధి సంతకాలు పెట్టేస్తారు. లక్ష్మీని భోజనం చేయమని బామ్మ చెవిలో ఇయర్ ఫోన్స్ తీసేయడంతో డీల్ క్లోజ్ అయినట్లు లక్ష్మీకి తెలీదు.. లక్ష్మీ త్వరగా తినేయడంతో బామ్మ ఫోన్ ఇచ్చేసి ఇక నీ ఇష్టం ఏం మాట్లాడుకుంటావో మాట్లాడుకో అని అంటుంది. అంబిక పార్థసారధితో ఇక నుంచి ఆ కంపెనీ మీదే మీరు ఏం చేయాలో అది చేయొచ్చు అని అంటుంది. పార్ధసారధి అంబికతో రేపే వెళ్లి రైతుల నుంచి పంటలు తీసుకొని మా కంపెనీ ద్వారా అమ్మకాలు చేస్తామని అంటాడు. లక్ష్మీ మనసులో అంబికమ్మ ఇంత త్వరగా అమ్మేస్తుందని అనుకోలేదు.. ఆ పార్థసారధి నేను విహారి గారు ఎంతో కష్టపడి పెంచుకున్న కంపెనీని నాశనం చేస్తాడు ఇలా అయినా రైతులు ఆ పంటలు అమ్మకుండా చేయాలని లక్ష్మీ అనుకుంటుంది. మేనేజర్ మొత్తం రికార్డు చేసి ఈ విషయం వెంటనే విహారికి చెప్పాలని అనుకుంటాడు. ఇంటికి వెళ్లి విహారిని కలవాలని విహారి గదికి వెళ్లే సరికి అక్కడ అంబిక విహారితో మాట్లాడుతూ ఉంటుంది.
విహారితో వీక్రాఫ్ట్‌ని డెవలప్ చేయాలని అనుకుంటున్నా.. అందుకు మరో పెద్ద కంపెనీలతో చేతులు కలపాలి అనుకుంటున్నా.. అందుకు అగ్రిమెంట్ కూడా అయిపోయింది అని అంటుంది. మంచి నిర్ణయం అని విహారి అంటాడు. నువ్వు తీసుకున్న ప్రతీ నిర్ణయం నాకు చెప్పాల్సిన అవసరం లేదు అత్తయ్యా.. అని అంటాడు. మన కంపెనీలు మంచి దారిలో పెట్టాలి అనే ఈ నిర్ణయం తీసుకున్నా అని అంబిక అంటే మీ ఇష్టం అత్తయ్య మీరు అనుకున్నట్లు చేయండి అని విహారి అంటాడు. అంబిక వెనక్కి వెళ్తూ ఉంటే మేనేజర్ మూర్తిని చూసి ఇక్కడ ఏంటి అని అంటుంది. చిన్ని పని మీద ఇటు వచ్చి విహారి గారిని చూడటానికి వచ్చా అని అంటాడు. తర్వాత మూర్తి గారు కిందకి వెళ్లి చారు కేశవని కలిసి ఆఫీస్‌లో జరిగే ఘోరాలు చూడలేకపోతున్నా అని వీక్రాఫ్ట్ డీల్ గురించి చెప్పి అది ఎలా అయినా ఆపండి అని అంటాడు. నేను విహారితో మాట్లాడుతా అని చారుకేశవ అంటాడు.
లక్ష్మీ తనలో తాను ఆలోచిస్తూ రేపటి కల్లా నాకు టైం ఉంది.. ఆ పార్థసారధికి సరుకు అందకుండా ఆపాలి అని అనుకుంటుంది. ఏం చేయాలా అని అనుకుంటూ పక్కింటి అమ్మాయి దగ్గరకు వెళ్లి చిన్న పని ఉంది ఈరోజుకి ల్యాప్‌ట్యాప్ ఇవ్వమని అడుగుతుంది. పల్లవి లక్ష్మీకి ల్యాప్ టాప్ ఇస్తుంది. విహారి తాగుతూ ఉంటే చారుకేశవ వెళ్లి ఎన్ని రోజులు ఇలా తాగుతావురా అని అడుగుతాడు. చచ్చేవరకు తాగుతా మామయ్య అని విహారి అంటాడు. ఓరేయ్ నువ్వేం పట్టించుకోవడం లేదు.. అక్కడ ఏవేవో జరుగుతున్నాయిరా అని అంటాడు. వీ ఆర్గానిక్స్ ఇప్పుడు పార్థసారధి చేతిలోకి వెళ్లిందిరా.. వాడు ఎలాంటి వాడో తెలుసు కదా.. మనం కొన్ని వేల మంది రైతులకు మంచి చేయాలని చేశాం.. ఇప్పుడు వాడు అది తీసుకొని నాశనం చేస్తాడురా అని అంటాడు. అవన్నీ అంబిక అత్తయ్యా చూసుకుంటుంది మామయ్య అని విహారి వదిలేయమని అంటాడు. విహారి తాగుతూ ఉంటే చారుకేశవ విహారితో ఇప్పుడు కానీ లక్ష్మీ ఉండుంటే.. అని అంటాడు. మామయ్య ఆ మనిషి పేరు ఎత్తొద్దు తన గురించి చెప్పొద్దు అని ఫైర్ అయిపోతాడు. లక్ష్మీ ల్యాప్‌టాప్ తీసుకొచ్చి రాత్రంతా పని చేస్తుంది. విహారి గారి బైలాస్‌లో అంబికమ్మని పార్ధసారధిని ఆపే పాయింట్ దొరికింది అని హ్యాపీగా ఫీలవుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు





















