Naga Panchami November 20th Today Episode : త్వరలోనే గుడ్‌న్యూస్ చెప్తాం.. శబరికి మాటిచ్చిన పంచమి, మోక్ష!
Naga Panchami Serial Today Episode : త్వరలోనే బిడ్డని కంటామని పంచమితో మోక్ష ప్రమాణం చేయించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది
Naga Panchami Serial November 20th Episode : మోక్ష: (కొబ్బరి బొండంలో రెండు స్ట్రాలు తీసుకొస్తూ) ఏంటి పంచమి ఒకే బొండం తీసుకొచ్చానని చూస్తున్నావా. మనిద్దరం వేరు వేరు కాదు అని చెప్పడానికే ఇలా తెచ్చా. భర్తలో భార్య సగం అంటారు కదా నీ భాగం నువ్వు తాగు నా భాగం నేను తాగుతాను.
పంచమి: నాకు వద్దు అండీ మీరు తాగండి
మోక్ష: ఏంటి పంచమి ఈ అల్పాయుష్కుడి ఎంగిలి అంటే భయమా
పంచమి: మీరు అలా మాట్లాడితే నా ప్రాణం పోయినట్లు ఉంటుంది నేను బతికుండగా మీకు ఏమీ కాదు. మీరే నాకు ప్రాణం మీరు తాగి ఇవ్వండి మీ ఎంగిలి అమృతం అనుకొని తాగుతా
మోక్ష: అంతే కానీ నాతో కలిసి మాత్రం తాగను అంటావు. అర్ధమైంది పంచమి నేను అంటే నీకు ప్రాణం అంటావు కదా ఒకవేళ నీ ఎంగిలి నేను తాగితే నాకు ఏమైనా అవుతుంది అని భయమా. అది విషమైనా పర్వాలేదు. (పంచమి మనసులో నా ఎంగిలి విషం మోక్షాబాబు అది మీకు చెప్పలేను) పాము కాటుతో భయం భయంగా చనిపోవడం కంటే ఇలా హాయిగా చనిపోవడం మేలు. తాగు పంచమి.
పంచమి: మనసులో.. భగవంతుడా నా భర్త అన్నీ తెలిసి మాట్లాడుతున్నారో.. ప్రేమతో మాట్లాడుతున్నారో తెలీడం లేదు
మోక్ష: నువ్వుండగా నాకు ఏ భయం లేదు పంచమి. నేను ఇప్పుడు భ్రమల్లో ఏం బతకడం లేదు. ఏం జరగబోతుంది. ఏం జరుగుతుందో నాకిప్పుడు పూర్తిగా తెలుసు. నా మరణం తథ్యం. నాకు భూమి మీద నూకలు చెల్లిపోయాయి. నేను డిసైడ్ అయిపోయా.. నా మనసు శరీరం సిద్ధమైపోయాయి. ఇక ఏ మాత్రం భయపడేది లేదు. ఆ మృత్యువు ఏ రూపంలో వచ్చినా సంతోషంగా ఆహ్వానిస్తా భయపడకు. కానీ నా ఆశ ఒకటే పంచమి ఆ చావు ఏదో నీ చేతుల్లోనే రాసి పెట్టి నీ ఒడిలోనే కన్నుమూయాలని. నేను ఇంత ప్రాణం పెట్టే నువ్వు నేను సంతోషంగా ఉండాలని ఎందుకు అనుకోవు పంచమి. ఎప్పుడు నీకు నా చావు భయమేతప్ప మనం సంతోషంగా ఉండాలని ఆలోచనే రాదా. అసలు నీకు ఎలాంటి ఆశలు, కోరికలు లేవా పంచమి
పంచమి: ఉన్నాయి మోక్షా బాబు చాలా ఉన్నాయి. అందరి ఆడపిల్లల్లాగే నా మనసులో కూడా కోటి కోరికలు ఉన్నాయి. నేను నా భర్త సుఖంగా ఉండాలి. పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలి. వాళ్లని పెద్దపెద్ద చదువులు చదివించాలి అని కలలు కంటూనే ఉన్నాను కానీ
మోక్ష: ఆ కలల్ని నిజం చేసుకుందాం పంచమి. ఎన్ని రోజులని లెక్కపెట్టుకోవడం మానేసి ఉన్నన్ని రోజులు ఆనందంగా గడిపేద్దాం. ఇక ప్రతి క్షణం నాకు ఒక యుగమే అని గుర్తించుకో పంచమి (పంచమిని హత్తుకొని మనసులో.. నేను లేకపోయినా నువ్వు పిల్లాపాపలతో ఈ లోకంలో సంతోషంగా ఉండాలి పంచమి.. ఉంటావు కూడా)
పంచమికి సుబ్బు సపోర్ట్ చేస్తున్నాడని అందుకు సుబ్బుని ఇంటి నుంచి తరిమేయాలని జ్వాలా, చిత్రలు ప్లాన్ చేస్తారు. ఇందుకు వైదేహి ఆరేసున్న పట్టుచీరలు ముక్కలు చేసి వైదేహికి కోపం వచ్చేలా చేసి ఆ నింద సుబ్బు మీద తోసేయాలని అనుకుంటారు. అందతా సుబ్బు చాటుగా వింటాడు. ఇక వాళ్లు చీరలు కట్ చేసిన ముక్కలు కింద ఉన్న వైదేహికి కనిపించేలా చేస్తాడు సుబ్బు ఇక వైదేహి ఆ ముక్కలు చూసి ఇది నా చీర అనుకుంటూ మేడ మీదకు వచ్చి చూస్తుంది అప్పుడు చిత్రా, జ్వాలలు కత్తెరతో చీర కట్ చేయడం చూసిన వైదేహి కోపంతో ఇద్దర్ని చెంప మీద కొట్టి తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక ఇదంతా చేసింది సుబ్బునే అని అనుకుంటారు.
మోక్ష, పంచమి ఇంట్లో అందరికీ కొత్త బట్టలు తీసుకొని వస్తారు. రేపు తమ పెళ్లి రోజు అని చెప్తాడు మోక్ష. అందుకే ఇంట్లో అందరికీ బట్టలు తెచ్చానని చెప్తాడు.
శబరి: మోక్ష అప్పుడే మీ పెళ్లి అయి సంవత్సరం గడిచిపోయింది. ఇంకా ఎప్పుడు నా చేతిలో ముని మనవడ్ని పెడతారు.
మోక్ష: త్వరలోనే నువ్వు ఎత్తుకొని ఆడిస్తావు నానమ్మ. అబ్బాయి పుడితే నీ తాతయ్య పేరు అమ్మాయి పుడితే నీ పేరు అంతే కదా పంచమి.
శబరి: అమ్మా పంచమి అబ్బాయినే కనాలి. నీ కడుపున వీళ్ల తాతగారు మళ్లీ పుట్టాలి. ఆయన లేనిలోటు ఈ ఇంట్లో బాగా ఉంది. ముందు అర్జెంటుగా బిడ్డని కని ఇవ్వండి. ఏమ్మా వింటున్నావా.. నేను ఉండగానే మీ బిడ్డ నా చేతుల్లో పెరగాలి
మోక్ష: పంచమి అలాగే అని శబరికి మాటివ్వు రా
శబరి: మోక్ష అప్పుడే తల్లి అయినట్లు మురిసిపోతుంది నా మనవరాలు
ఇక పంచమి బాధగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. గదిలో శబరి అన్న మాటలు గుర్తు చేసుకొని బాధ పడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.