Naga Panchami November 17th Today Episode: పంచమి పాముగా మారకుండా చేస్తున్న మోక్ష- మరో షాకింగ్ విషయం చెప్పిన నాగసాధువు
Naga Panchami Serial Today Episode పౌర్ణమి రోజున పంచమి పాములా మారకుండా చేయడానికి మోక్ష నాగ సాధువుని కలవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది
Naga Panchami Serial November 17th Episode: తంత్రీ, కంత్రీలు బీరువాలో డబ్బు, నగలను చిందర వందరగా పడేస్తారు. అది చూసిన చైత్ర, జ్వాలలు ఆ నింద పంచమి మీద వేసేయాలి అని అనుకుంటారు. ఇక ఇద్దరూ పంచమిని ఆ రూమ్‌లోకి తీసుకొని వస్తారు
జ్వాలా: రా చూడు పంచమి.. నిన్ను నమ్మి తాళాలు ఇస్తే.. ఇదా నీ నిర్వాకం
చిత్ర: ఊరు నుంచి నీ మనుషలను పిలిపించి మొత్తం దోచుకెళ్లమని నువ్వే చెప్పుంటావ్. వాళ్లు మోయలేక ఈ కొంచెం ఇక్కడ పడేసి వెళ్లిపోయుంటారు.
పంచమి: నాకేం తెలీదు. నేను అసలు ఈ గదిలోకి రాలేదు. నిజంగా నాకేం తెలీదు. నా మాట నమ్మండి
చిత్ర: నమ్మాల్సింది మేము కాదు నీకు పెత్తనం అంటకట్టిన పెద్దమనిషి ఉంది కదా వైదేహి. ఆవిడ నమ్మాలి
జ్వాలా: ఆమెకు నగలన్నా, డబ్బులు అన్నా ఎక్కడ లేని పిచ్చి వీటిని ఇలా చూసిందంటే ఇక నీ చాప్టర్ క్లోజ్
చిత్ర: ఎందుకైనా మంచిది ఇక్కడ నుంచి చల్లగా జారుగా పంచమి. మేం ఎవరికీ చెప్పము. వెళ్లి నీ బట్టలు సర్దుకొని మీ ఊరికి వెళ్లిపో.
పంచమి: నేను ఏ తప్పు చేయనప్పుడు నేను ఎందుకు పారిపోవాలి
చిత్ర: ఏంటి నోరు లేస్తుంది. ఏంటి పెత్తనం నీ చేతికి వచ్చిందనా.. నా సంగతి ఇంకా నీకు తెలీదు చేతులు అడ్డంగా నరికేస్తా. నాతో నువ్వు పెట్టుకోకు.
పంచమి: మీరు ఎంత బెదిరించినా నేను బయపడను. నేను తప్పు చేస్తే ఎవరూ చెప్పక ముందే నేను వెళ్లిపోతాను
చిత్ర: అక్క ఇక లాభం లేదు దీనికి బాగా నోరు ఎక్కువ అయింది
జ్వాలా: చూడు పంచమి నువ్వు చదువు రాని మొద్దువి ఈ ఇంట్లో ఏ పొరపాటు జరిగినా నీ మీద దొంగ అని ముద్ర వేసి జైలుకి పంపిస్తారు. నీ మొగుడు మోక్ష అల్ప ఆయుష్కుడు. ఎప్పుడు చస్తాడో తెలీదు.
పంచమి: ఆపండి ఇంకొక్క సారి మోక్ష బాబు గురించి అలా మాట్లాడారంటే చంపేస్తా జాగ్రత్త. నాకై నేను వెళ్తే తప్ప ఈ ఇంట్లో నుంచి నన్ను ఎవ్వరూ వెళ్లగొట్టలేరు.
చిత్ర: అక్కా దీని ధైర్యం అంతా ఆ సుబ్బు గాడు. వాడికి ఏవో మంత్రాలు మాయలు తెలుసు ఆ ధైర్యంతోనే ఇది ఇలా మనల్ని ఎదురించి మాట్లాడుతుంది
జ్వాలా: ఈ రోజు వాడి సంగతి దీని సంగతి తేలుద్దాం. పద ఇంట్లో వాళ్లని పిలిచి చూపిద్దాం. అప్పుడు తేలుతుంది దీని ధైర్యం ఏంటో
ఇక జ్వాలా చిత్ర ఇంట్లో వాళ్లని పిలుస్తారు. మరోవైపు పంచమి బాధగా కూర్చొంటుంది. ఏమైందని సుబ్బు అడిగితే పైన రూమ్ వైపు చూపిస్తుంది. సుబ్బు అక్కడికి వెళ్తాడు. అక్కడ తంత్రీ, కంత్రీలు డబ్బుతో ఆడుకుంటుంటారు. అది చూసిన సుబ్బు వాళ్ల చేతులు మంట పుట్టేలా చేస్తారు. వారిద్దరూ మంట మంట అంటూ అరుస్తుంటారు. ఇక సుబ్బు తన శక్తితో బంగారం, డబ్బు ఎక్కడివి అక్కడ సర్దేస్తాడు. ఇక వైదేహి పంచమిని అడుగుతుంది. వీళ్లు చెప్తుంటే నా గుండె ఆగిపోతుంది నిజమా అని అడుగుతుంది. ఇక అందరూ గది చూద్దాం పద అని అంటారు. రూమ్‌కి వెళ్లి చూసే సరికి గది అంతా శుభ్రంగా ఉంటుంది. జ్వాలా బీరువా తెరవాలని చూస్తే రాదు. ఇక పంచమి తాళం ఇస్తే వైదేహి చూసే సరికి ఎక్కడివి అక్కడ శుభ్రంగా ఉంటాయి. జ్వాలా, చిత్ర షాక్ అవుతారు. వాళ్లను వైదేహి తిడుతుంది. ఇంతలో సుబ్బు అక్కడికి వస్తాడు.
పంచమి: అంతా అయోమయంగా ఉంది సుబ్బు. నేను చూసినప్పుడు కూడా డబ్బు, నగలు గది అంతా చిందరవందరగా పడి ఉంది.
సుబ్బు: అప్పుడప్పుడు దేవుడు పరీక్షలు పెట్టడానికి అలా చేస్తాడు పంచమి ఇప్పుడు ఏం జరగలేదు కదా అది నీకు సంతోషమే కదా ఇక దాని గురించి మర్చిపో పంచమి. నువ్వు మంచిదానివి. నీ మనసు మంచిది ఆ మంచి తనమే దేవుడు అనుకో. అలాంటప్పుడు దేవుడే నిన్ను కాపాడినట్లు.
మరోవైపు మోక్ష నాగసాధువును కలవడానికి వస్తాడు. తన భార్య పాముగా మారడం తానే స్వయంగా చూశానని. ఇప్పటికీ అది నమ్మలేకపోతున్నానని చెప్తాడు. పంచమి లేకుండా తాను బతకలేనని చెప్తాడు.
నాగసాధువు: మీ భార్య పాము అంశమని తెలియగానే భయపడి దూరం చేసుకుంటావ్ అనుకున్నాను. ఏ భర్త ఆ విషయాన్ని జీర్ణించుకొని సహజీవనం చేయలేడు. సగటు మనిషి ఎవరు అయినా అలాంటి వృత్తాంతాన్ని కథగా వినగలరు గానీ వారి జీవితంలో ఇలాంటి సంఘటనను ఊహించుకోవడానికి ఇష్టపడరు. కోట్ల మంది జనంతో పోల్చినా నీలా ఎవ్వరూ ఉండరు మోక్ష. నీది గొప్ప మనస్తత్వం. పంచమి మీద నీ ప్రేమ చెక్కు చెదర లేదు. నీ మనసులో భార్య స్థానం ఇంకా పంచమిదే అంటున్నావు అంటే నీ వ్యక్తిత్వం అమోఘం.
మోక్ష: నేను అందరిలాంటి సగటు మనిషినే స్వామి. కానీ పంచమిని నేను భార్యగా చూడలేదు స్వామి నా జీవితంలోకి వచ్చిన ఓ వెలుగు అనుకున్నాను. పాములంటే నాకు కోపం కసి అన్నమాట నిజం. పంచమి పాము అని తెలియగానే నేను భయపడిన మాట కూడా వాస్తవమే. కానీ పంచమి జన్మ రహస్యం తెలిసిన తర్వాత నాలోని కోపం, భయం, కంపరం అన్నీ పోయాయి. వాటి స్థానంలో పంచమి మీద జాలి, ప్రేమ కలగడం మొదలైంది.
నాగ సాధువు: పంచమి మీద అంత ప్రేమ ఉంది కాబట్టే తన గురించి తెలుసుకోవాలని అనుకున్నావు. మరొకరు ఎవరైనా సరే తనని ఎలా వదిలించుకోవాలా అని ఆలోచించేవారు. అందుకే అందరిలో నువ్వు ఒకడివి కాలేదు
మోక్ష: పౌర్ణమికి పంచమి పాములా మారి నన్ను కాటేస్తుందని మా ఇద్దరికీ తెలుసు స్వామి. కానీ ఆ విషయం నాకు తెలుసు అని పంచమికి తెలీదు. నన్ను కాటేయకూడదు అని ఎలా అయినా నన్ను కాపాడుకోవాలని పంచమి చాలా ప్రయత్నిస్తుంది స్వామి.
నాగ సాధువు: ముఖ్యమైన విషయం మోక్ష.. నిన్ను తను కాటేయకుండా కాపాడుకుంటుంది అన్న విషయం ఇష్టరూప నాగజాతి పసిగట్టింది అంటే ఆ నాగులు పంచమిని నిన్ను ఇద్దరినీ వదిలిపెట్టవు. మీకు అదొక ప్రమాదం పొంచి ఉంది
మోక్ష: ఎన్ని చేసినా నాకు చావు తప్పదు అన్నప్పుడు నేను చేయగలిగింది ఏమీ లేదు స్వామి నా ప్రాణాల మీద నేను ఆశలు వదిలేసుకొని అన్నింటికీ సిద్ధపడ్డాను. నా కోరిక ఒకటి ఉంది స్వామి. అది సంభవమో అసంభవమో నాకు తెలీదు. నేను ఇప్పుడు మీ దగ్గరకు రావడానికి కారణం అదే. నా మరణం నా చేతుల్లో లేదు అని నాకు తెలుసు. కానీ నేను ప్రాణాలతో ఉన్నప్పుడే పంచమి పాములా మారకుండా ఉండడానికి ఏమైనా అవకాశం ఉంటే అది చేయాలని నిర్ణయించుకున్నాను. నన్ను కాటేసి పంచమి నాగ లోకం వెళ్లిపోవచ్చు. తన కన్నతల్లికి లోకానికి న్యాయం చేయొచ్చు. తన నాగ జీవితం హాయిగా గడిపేయొచ్చు అయినా ఆ అవకాశాలన్నీ వదులు కొని నా ప్రాణాల కోసం తపన పడుతుంది అంటే పంచమి ఓ భార్యగా గెలిచినట్టే స్వామి. ఓ భర్తగా నా తపన అంతా నా భార్యకోసం ఎదో ఒకటి చేయాలి. పౌర్ణమి రోజు తను పాములా మారకుండా ఉండడానికి ఏదైనా మార్గం చెప్పండి స్వామి
నాగ సాధువు: ఈ సృష్టిలో ప్రతీ దానికి పరిష్కారం ఉంటుంది. దీనికీ ఉంది కానీ అందులో ఓ మెలిక ఉంది. అని స్వామీజీ చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.