అన్వేషించండి

Naga Panchami Serial Today May 7th: 'నాగ పంచమి' సీరియల్: పంచమి బిడ్డ నాగలోకం వెళ్లదని అభయం ఇచ్చిన శివయ్య.. నాగలోకానికి ఇక రాణి లేనట్లేనా!

Naga Panchami Serial Today Episode పంచమిని ఇంటికి తీసుకెళ్లడానికి మోక్ష నాగులావరం రావడం పంచమి రాను అని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Naga Panchami Today Episode పంచమి తన ఊరు చేరుకొని శివయ్య దగ్గరకు వెళ్తుంది. చిన్నతనం నుంచి సేవలు చేసినా తన మీద కనికరం లేకుండా ఇంకా పరీక్షిస్తున్నావా స్వామి అని ఏడుస్తుంది. ఈ కష్టాల నుంచి తనకు విముక్తి లేదా అని శివుడి పాదాల దగ్గర కూలబడిపోతుంది. మరోవైపు మోక్ష కూడా పంచమిని వెతుక్కుంటూ వస్తుంటాడు. 

పంచమి: స్వామి అన్నీ ఇచ్చినట్లే ఇస్తున్నారు. నోటికి అందే లోపు లాగేసుకుంటున్నారు. అదేదో నన్నే మీ దగ్గరకు తీసుకొని వెళ్లిపోతే నాకు ఈ బాధలు ఉండవు కదా స్వామి. త్వరగా ఈ పని చేయండి స్వామి. కన్న తల్లిని ఎలాగూ చూసుకోలేదు. కనీసం నా బిడ్డను అయినా చూసుకొనే అదృష్టం నాకు లేదా స్వామి. మా అమ్మ నా కడుపున పుట్టబోతుందని ఎంతో సంతోషించాను. కానీ నా బిడ్డను నాగలోకానికి ఇచ్చేయాలి అంట. ఇదెక్కడి న్యాయం స్వామి. ఏ కన్న తల్లి అయినా ఈ ఘోరాన్ని తట్టుకోగలదా చెప్పండి స్వామి. మీరు మాట్లాడరు స్వామి. నేను బతికుండగా నా బిడ్డను దూరం చేసుకోలేను. ఇప్పటికే బాగా అలిసిపోయి ఉన్నాను. నన్ను మీ దగ్గరకి తీసుకెళ్లిపోండి స్వామి. కనీసం ఈ కోరిక అయినా తీర్చండి స్వామి. అని పంచమి తల బాదుకుంటుంది.

పంచమి స్ఫృహ కోల్పోతుంది. దీంతో శివుడి మూడో కన్ను నుంచి ఏ వెలుగు వస్తుంది. దీంతో పంచమి కళ్లు తెరుస్తుంది. ఆ వెలుగు చూసి పంచమి ఆశ్చర్యపోతుంది. తన జన్మధన్యమైందని సంతోషపడుతుంది. తన కన్నబిడ్డను తనని మీ అక్కున చేర్చుకోండి అని అంటుంది. దీంతో శివుడి నుంచి మాటలు వినిపిస్తాయి.

దేవుడు: పంచమి నీ బిడ్డ నీ దగ్గరే ఉంటుంది. శివాంశతో పుట్టబోయే నీ బిడ్డ నీ దగ్గరే క్షేమంగా ఉంటుంది. ఈ మాటలు వినిపించిన తర్వాత పంచమి మళ్లీ స్ఫృహ కోల్పోతుంది. ఇక సుబ్బు అక్కడికి వస్తాడు. పంచమి నుదిటిపై గాయాన్ని పొగొడతాడు. పంచమి నవ్వుకుంటూ మెలకువలోకి వస్తుంది. సుబ్బుతో తనకు శివయ్య కనిపించారని చెప్తుంది. 

పంచమి: సుబ్బు నా బిడ్డ నా దగ్గరే ఉంటుందని శివయ్య చెప్పారు.
సుబ్బు: నాన్న గారు చెప్పారంటే జరిగి తీరుతుంది. 
పంచమి: నాన్న గారా.. నేనే ఆ స్వామి గురించి చెప్తున్నా సుబ్బు.
సుబ్బు: లోకానికే ఆయన తండ్రి నాకు కూడా ఆయనే తండ్రి పంచమి. 
పంచమి: నిన్ను చూస్తే నాకు సొంత తమ్ముడిలా అనిపిస్తావు సుబ్బు. నీతో చెప్పుకుంటే నాకు కష్టం తీరిపోతుంది. ఇంతలో మోక్ష అక్కడికి వస్తాడు. ఇక సుబ్బు స్వామిని వేడుకొని వెళ్తే అంతా మంచే జరుగుతుందని చెప్తాడు. దీంతో పంచమి, మోక్ష ఇంటికి బయల్దేరుతారు.

మరోవైపు వరుణ్, జ్వాలలు అత్తామామల ఆశీర్వాదం తీసుకుంటారు. జ్వాలా ప్రెగ్నెంట్ అని చెప్తారు. అందరికీ స్వీట్స్ పంచుతారు. ఇక జ్వాల, వరుణ్‌లు మోక్ష పంచమిని తీసుకొని వచ్చినా పంచమిని ఈ ఇంట్లో ఉంచొద్దని చెప్తారు. తను ఇంటి పెద్ద కోడలని కొత్తగా వచ్చిన పంచమి కోసం తాను ఇంటి నుంచి వెళ్లడం జరగదని అంటుంది. ఇక శబరి ఇప్పటికే పంచమి విషయంలో చాలా తప్పులు చేశామని ఇకపై ఆలోచించి నిర్ణయం తీసుకోమని అంటుంది. 

పంచమి తన బిడ్డను నాగేశ్వరి నాగలోకం తీసుకెళ్లిపోతా అని చెప్పిందని మోక్షకు చెప్పకూడదని అనుకుంటుంది. ఇక మోక్ష తనతో చెప్పకుండా ఎందుకు వచ్చావని అడుగుతాడు. దీంతో పంచమి తాను తన బిడ్డ మోక్షకు ఓ సమస్య కాకూడదని అంటుంది. తన కోసం మోక్ష ఇంత వరకు అనుభవించిన నరకం చాలని అంటుంది. దీంతో మోక్ష చాలా బాధపడతాడు. ఇద్దరం ఒకటే అని చెప్తాడు. తన పోరాటమంతా పంచమి, బిడ్డ క్షేమంగా ఉండాలని అంటాడు. బిడ్డ కోసం ఎన్ని సమస్యలు అయినా కలిసే భరిద్దామని మోక్ష అంటాడు. పంచమిని ఇంటికి రమ్మని అంటే పంచమి రాను అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: నేను, నాగార్జున ఇంజనీరింగ్‌లో క్లాస్‌మేట్స్, అప్పట్లో నాగ్ ఎలా ఉండేవాడంటే.. - కృష్ణమాచారి శ్రీకాంత్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Nizamabad Crime News:నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
Ind vs Ban 5 Major controversies: భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ జట్ల మధ్య 5 పెద్ద వివాదాలు.. ఓసారి ఏకంగా కొట్టుకునే వరకు వెళ్లిన ఆటగాళ్లు
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య 5 పెద్ద వివాదాలు.. ఓసారి ఏకంగా కొట్టుకునే వరకు వెళ్లిన ఆటగాళ్లు
Embed widget