Naga Panchami Serial Today May 18th: 'నాగ పంచమి' సీరియల్: పంచమి పిల్లల్ని ఇంట్లోకి రానివ్వకుండా జ్వాల కుట్ర.. తన కొడుకుకు ప్రత్యేకంగా బారసాల చేయాలని హడావుడి!
Naga Panchami Serial Today Episode పంచమి పిల్లలతో కలిపి తన కొడుకుకు బారసాల ఏర్పాట్లు జరిపించడంతో జ్వాల అందరితో గొడవ పెట్టుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Naga Panchami Today Episode పంచమికి డెలివరీ అయిందా లేదా అని ఇంకా ఏ సమాచారం తెలీలేదని ఇంట్లో అందరూ కంగారు పడుతూ ఉంటారు. ఇంతలో దేవర అనే ఓ వ్యక్తి వచ్చి ఢంకా కొడుతూ ఇంటికి అయిన వాళ్లు రారు కాని వాళ్లు వస్తారని అంటాడు. దుష్టశక్తులు రాబోతున్నాయి. మీ కుటుంబాన్ని కబలించబోతున్నాయని అంటాడు.
శబరి: ఏంటి అలాంటి అపశకునం మాటలు మాట్లాడుతున్నారు. మంచి మాటలు చెప్పండి.
దేవర: మీ మంచి కోరే చెప్తున్నా తల్లి. ఇప్పుడు ఆ దుష్ట శక్తులు మీ ఇంటికి వస్తే పుట్టగతులు లేకుండా పోతారు. పసిపిల్లల రూపంలోనూ, పాముల రూపంలోనూ ఆ దుష్ట శక్తులు మీ ఇంటిలోకి రాబోతున్నాయి. ఆ శక్తులు లోపలికి వచ్చాయి అంటే నాశనం తప్పదు. నేను ఓ రక్షణ రేఖ గీసి వెళ్తాను. మీకు బాగా కావల్సిన వారు కానీ, రక్త సంబంధీకులు కానీ ఎవరైనా సరే ఆ గీత దాటి రానివ్వకండి. అంటూ గీత గీస్తారు. నా మాట నమ్మండి ప్రేమలకు లొంగకండి. ఆ దుష్ట శక్తుల వల్ల మొత్తం మీ వంశమే నాశనం అవుతుంది. అయితే ఇదంతా జ్వాల ప్లాన్. దేవర అనే వ్యక్తి జ్వాలకు చూసి సైగ చేస్తాడు. జ్వాల కూడా సైగ చేస్తుంది. ఇది ఇంట్లో ఎవరికీ తెలీదు.
రఘురాం: ఇంట్లో ఏంటి ఈ అపశృతులు ఒకదాని మీద ఒకటి వచ్చి పడి ఇలా ఇబ్బంది పెడుతున్నాయి.
చిత్ర: అతను డబ్బు కోసమే వచ్చి ఉంటే ఏ తాయెత్తు ఇచ్చి వెళ్లిపోయేవాడు.
జ్వాల: ఎప్పుడైతే ఆ పంచమి ఇంట్లో అడుగు పెట్టిందో అప్పుడే ఇలాంటివి జరుగుతున్నాయి.
మీనాక్షి: ఇప్పుడు పంచమికి ఎందుకు ఇందులోకి లాగడం.
జ్వాల: హమ్మయ్య నా ప్లాన్ సక్సెస్. అత్తయ్య నమ్మిందంటే చాలు ఇక ఆ పంచమిని ఇంట్లో అడుగు పెట్ట నివ్వదు.
ఇంతలో మోక్ష పంచమి ఇద్దరు చంటి వాళ్లను తీసుకొని ఇంటికి వస్తారు. ఇద్దరూ కారు దిగి ఇంటిలోకి వస్తుంటారు. దేవర గీసిన గీత దాటే టైంలో వైదేహి ఆగండి అని అరుస్తుంది. పంచమి, మోక్ష పిల్లలతో ఆగిపోతారు.
చిత్ర: ఇదిగో ఈ గీత చూడండి. మీరు ఈ గీత దాటి ఇంట్లోకి రాకూడదు. వెంటనే వచ్చిన దారినే వెళ్లిపోండి.
జ్వాల: మీకే చెప్పేది వెంటనే వెళ్లిపోండి. మీరు ఈ ఇంటికి రాకూడదు. త్వరగా ఎక్కడికైనా వెళ్లిపోండి.
మోక్ష: శబరి ఏంటి ఇది. మాకు పుట్టిన కవల పిల్లల్ని చూడగానే ప్రేమగా ఆహ్వానిస్తారు అంటే ఏంటి ఇది.
వైదేహి: అంత మా దురదృష్టం మోక్ష. పిల్లల్ని చూసి గుండెలకు హత్తుకోవాల్సింది పోయి చీదరించుకునే దుస్థితి మాకు వచ్చింది.
పంచమి: ఈ పసి పిల్లలు ఏ తప్పు చేశారని అత్తయ్య గారు అలా మాట్లాడుతున్నారు. మాకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని చిన్న చూపా. అయినా మాకు ఆడపిల్లలు పుట్టారని మీకు ఎలా తెలుసు.
జ్వాల: ఏంటి అత్తయ్య ఇప్పుడు జాలి పడి వాళ్లని ఇంట్లోకి రానిచ్చేస్తారా. ఆ దేవర గారు చెప్పిన మాటలు మర్చిపోయారా. పిల్లల రూపంలో భయంకరమైన దుష్టశక్తులు వస్తాయని.
శబరి, చిత్రలు దేవర చెప్పిన మాటలు పంచమి, మోక్షలకు చెప్తారు. దీంతో మోక్ష మా పిల్లలు దుష్ట శక్తులా అని అడుగుతాడు. దాంతో జ్వాల అవును అని అంటుంది. మీకు పుట్టింది పిల్లలో లేక ఆ రూపంలో ఉన్న పాములో మాకు తెలీదని అంటుంది. పిల్లలను తీసుకొని ఇంట్లోకి రావడానికి వీల్లేదు అని జ్వాల అంటుంది.
మోక్ష: నాన్న ఏంటి ఈ న్యూసెన్స్. మీరు ఇవంతా నమ్ముతారు.
రఘురాం: మాకు అయితే వీటి మీద నమ్మకం లేదు కానీ వీళ్లంతా భయపడిపోతున్నారు.
మోక్ష: మాకన్నా ఎవరో దేవర చెప్పిన మాటలు మీకు ఎక్కువ అయ్యాయా.
వరుణ్: అవును మోక్ష.
భార్గవ్: పంచమి పంచమికి పుట్టిన పిల్లలు అలాంటి రూపం మార్చుకునే పాములని ఎందుకు నమ్మకూడదు. కచ్చితంగా మీ చేతుల్లో ఉన్నది అలాంటి పాము పిల్లలే అయిండొచ్చుకదా.
మోక్ష: ఎవరైనా నా పిల్లల గురించి అలా మాట్లాడితే ఊరుకోను.
వైదేహి: అలా కాదు మోక్ష ఆ దేవర వచ్చి ఈ గీత దాటి ఎవరినీ రానియొద్దని చెప్పాడు.
మోక్ష: నా ఇంటి లోకి నన్ను రానివ్వొద్దని చెప్పడానికి అతడు ఎవరు. వీళ్లు మా పిల్లలు. నాలాగే ఈ ఇంటికి వారసులు. ఈ ఇంట్లో మీకు ఎంత హక్కు ఉందో వీళ్లకి అంతే ఉంది.
పంచమి: ఆ శివయ్య ఆశీర్వాదంతో పుట్టిన పిల్లల్ని మీరంతా అవమానించడం అన్యాయం అత్తయ్య గారు.
జ్వాల: ఏంటి అన్యాయం నీకు నిజంగా ఆ దేవుడి ఆశీస్సులు ఉంటే ఇద్దరు ఆడ పిల్లలు ఎందుకు పుడతారు. నాకు ఏ దేవుడి ఆశీర్వాదం ఉందని మగ పిల్లాడు పుట్టాడు. అదృష్టం అంటే నాది. మొత్తం ఈ వంశానికి వారసుడు నా కడుపున పుట్టాడు.
మోక్ష: బాధ పడకు పంచమి. మన పిల్లలు ఆ శివుడి వర ప్రసాదాలు. ఈ ఇంట్లో అందరి లానే మన పిల్లలకు సంపూర్ణ స్వాతంత్ర్యం ఉంది. మనల్ని ఆపే శక్తి ఎవరికీ లేదు రా లోపలికి వెళ్దాం.
వైదేహి: అయ్యో ఆగు మోక్ష నా భయం అంతా నీకు ఏమైనా జరుగుతుంది అని. ఆ పిల్లలతో నువ్వు లోపలికి రావొద్దు.
మోక్ష: మీరు అనుకున్నట్లు మా పిల్లలు దుష్ట శక్తులు కాదు. అదృష్ట దేవతలు. మాకేం కాదు. ఇలాంటి గీతలు మేం వంద దాటి వస్తాం. రా పంచమి.
మోక్ష, పంచమి గీత దాటి లోపలికి వస్తారు. మీనాక్షి, శబరి పిల్లల్ని తీసుకొని ముద్దాడుతారు. వైదేహి, రఘురాం కూడా పిల్లల్ని తీసుకొని ముద్దాడుతారు. ఇంటికి ఒకే సారి ఇద్దరు లక్ష్మీ దేవతలు వచ్చారని వైదేహి అంటుంది. చిత్ర, జ్వాలలు రగిలిపోతారు. పిల్లల బారసాల ఘనంగా చేయాలని వైదేహి అంటుంది. జ్వాల అడ్డుకొని తన కొడుకుకి విడిగా బారసాల చేయమని అంటుంది. అలా తప్పు అని శబరి నచ్చచెప్పుతుంది.
పిల్లల్ని తీసుకొని లోపలకు వెళ్తారు. ఇక బారసాల ఏర్పాట్లు ఘనంగా చేస్తారు. మోక్ష ఉయ్యాల సర్దుతూ ఉంటే జ్వాల వచ్చి ఏంటి మోక్ష ఇంత హడావుడి అని అడుగుతుంది. దీంతో మోక్ష ఈరోజు ముగ్గురు పిల్లలకు బారసాల వదినా నీకు తెలీదా. నీకు తెలీకుండా ఇంత పెద్ద ఫంక్షన్ జరుగుతుందా అని ప్రశ్నిస్తాడు. జ్వాల షాక్ అయిపోతుంది. అంతా మోసం, దగ అని ముగ్గురికి కలిపి బారసాల చేయడం ఏంటి నేను ఒప్పుకోను అని ఇంట్లో వాళ్లని నిలదీస్తుంది. తన కొడుకుకు ప్రత్యేకంగా బారసాల చేయాలని పంచమి పిల్లలతో కలిపి చేయడానికి ఒప్పుకోను అని అంటుంది. అందరూ ఒప్పించడానికి ప్రయత్నించినా ఒప్పుకోదు. దీంతో పంచమి అక్క దీనికి ఎందుకు గొడవ ముందు మీ బాబుకే జరిపించు తర్వాత నా పిల్లలకు జరిపిద్దామని అంటుంది. ఎవరూ ఒప్పుకోరు దీంతో ఇవాళ్లి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: ఆత్మహత్యపై ముందే హింట్ ఇచ్చిన చంద్రకాంత్? - సూసైడ్‌కి ముందు సంచలన పోస్ట్