Naga Panchami Serial Today March 6th: 'నాగ పంచమి' సీరియల్: నిశ్చితార్థంలో జ్వాల ఇచ్చిన ట్విస్ట్‌కి షాక్‌లో ఫ్యామిలీ.. మోక్షని మేఘన చేతుల్లో పెట్టేసిన పంచమి!
Naga Panchami Serial Today Episode పంచమి ఎదురుగా జ్వాల, వరుణ్‌ల చేతుల మీదగా మోక్ష, మేఘనల నిశ్చితార్థం జరగడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Naga Panchami Today Episode పంచమి మోక్ష, మోహినిలను తీసుకొని వస్తుంది. ఇక మేఘన తరఫున తాంబూళం తీసుకోమని పంతులు చెప్తారు. అయితే జ్వాల, చిత్రల జంటలు తాంబూళం తీసుకోవడానికి ముందుకు రారు. దీంతో పంతులు అమ్మాయి తరఫున ఎవరూ లేరా అని అడుగుతారు. దీంతో పంచమి నేను ఉన్నాను నేను తీసుకుంటానని అంటుంది. దంపతులు అయితే బాగుంటుంది అని పంతులు అంటారు.
వైదేహి: ఒక్క నిమిషం పంతులు గారు.. రేయ్ వరుణ్ జ్వాల మీరు తీసుకోండి. వాళ్లు నిరాకరించడంతో మేఘన మంత్రశక్తితో జ్వాలలోకి తన అన్న ఆత్మని రప్పిస్తుంది.
పంతులు: ఎవరూ లేరా అమ్మా..
జ్వాల: నేనున్నాను పంతులు మేఘన నా చెల్లెలు. తన తరఫున నేను ఉన్నాను.
వరుణ్: జ్వాల ఏమైంది నీకు..
జ్వాల: మీరు రండి.. ఏం మాట్లాడకండి..
చిత్ర: ఏవండీ చూశారా చూశారా వాళ్లందరి కంటే ఈ జ్వాల అక్కే డేంజర్ అని చెప్పానా లేదా..
భార్గవ్: అవును నువ్వే కరెక్ట్ చిత్ర అసలు వదినను నమ్మడానికే వీళ్లేదు.
జ్వాల: నా చెల్లులు.. నా ముద్దుల చెల్లులు.. నేనే దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను.
వరుణ్: మనసులో.. జ్వాల ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది.
ఇక పంతులు మోక్ష, మేఘనల గోత్రాలు అడుగుతారు. వైదేహి తన కొడుకు గోత్రం చెప్పగా.. జ్వాలలోని నంబూద్రీ ఆత్మ మేఘన గోత్రం చెప్తుంది. దీంతో అందరూ షాక్ అయిపోతారు. దీంతో తనకు ఒకసారి మేఘన చెప్పింది అని జ్వాల కవర్ చేస్తుంది.
జ్వాల ప్రవర్తనకు అందరూ షాక్ అవుతారు. ఇక జ్వాల దంపతులు మేఘన తరఫున తాంబూళం అందుకుంటారు. తర్వాత మోక్ష, మేఘనలు దండలు మార్చుకుంటారు. తర్వాత మోక్ష మేఘనకు రింగ్ పెడతాడు. మేఘన కావాలనే మోక్షకి పెట్టాల్సిన రింగ్ పడేస్తుంది. ఆ స్థానంలో తాను మంత్రించిన రింగ్ పెడుతుంది. ఇక పంచమి మోక్ష, మేఘనల చేతుల్ని ఒకరి చేతిలో ఒకరి చేయి పెడుతుంది.
పంచమి: మీకు సగం పెళ్లి అయిపోయింది. త్వరలోనే మా మూడు ముళ్లు పడి మీ ఇద్దరూ సంతోషంగా ఉండాలి. తర్వాత ఏడుస్తూ పంచమి అక్కడి నుంచి దూరంగా వెళ్తుంది. తర్వాత ఓ చోట మోక్ష నిశ్చితార్థం తలచుకొని ఏడుస్తుంది. ఇక అక్కడికి ఫణేంద్ర వస్తాడు.
ఫణేంద్ర: నన్ను క్షమించు పంచమి.
పంచమి: నేను నిన్ను ఆ మాట అడగాలి ఫణేంద్ర.
ఫణేంద్ర: నేను మోక్షని చంపడానికి ప్రయత్నించినట్లు పంచమికి తెలిసినట్లు లేదు.
పంచమి: అవును ఫణేంద్ర నిన్ను కొట్టి అవమానించినందుకు చాలా సిగ్గు పడుతున్నాను. మనస్ఫూర్తిగా అడుగుతున్నాను ఫణేంద్ర నన్ను క్షమించు.
ఫణేంద్ర: పర్వాలేదు పంచమి నేను కూడా నీ పట్ల చాలా అమర్యాదగా ప్రవర్తించాను. ఒక యువరాణిలా నీకు నాగలోకంలోని ఎవరినైనా దండించే అధికారం ఉంది.
పంచమి: మోక్షాబాబు తరపున కూడా క్షమాపణ అడుగుతున్నాను ఫణేంద్ర. తన మీద నువ్వు పెంచుకున్న కోపం పగ వదిలేయ్. నాకిప్పుడు చాలా ఆనందంగా ఉంది. మోక్షాబాబు మేఘనను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మేఘనతో మోక్షాబాబుకి నిశ్చితార్థం కూడా అయిపోయింది.
ఫణేంద్ర: పంచమిని సుబ్రహ్మణ్య స్వామి కాపాడుకుంటారు. మేఘన కరాళి అని పంచమికి చెప్తే నన్ను అపార్థం చేసుకుంటుంది. నన్ను నమ్మకద్రోహి అని నిందించి నాతో రావడానికి ఒప్పుకోదు. పంచమి నాగలోకం రమ్మని నేను నిన్ను బలవంతం చేయను. మోక్ష జోలికి వెళ్లను. అసలు మీ ఇద్దరి ప్రస్తావనకే నేను రాను. నువ్వు నాగలోకం వచ్చే పనిని నీ విజ్ఞతకే వదిలేస్తున్నా పంచమి. నువ్వు బాగా ఆలోచించి న్యాయం అన్యాయం పరిశీలించి నువ్వే ఒక నిర్ణయానికి రా పంచమి.
పంచమి: నీ మాటలు నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి ఫణేంద్ర. ఉన్నట్టుండి నీలో చాలా మార్పు చూస్తున్నాను. నిన్ను నమ్మొచ్చా ఫణేంద్ర.
ఫణేంద్ర: నువ్వు సామాన్యురాలివి కాదు అని అర్థమైంది. పంచమిగా నీ కర్తవ్యానికి నేను అడ్డురాను. అలాగే నాగలోక యువరాణిగా నీ ధర్మాన్ని నిర్వర్తించాలి అని నీ మనసుకు అనిపించినప్పుడు నేను నిన్ను తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంటాను.
పంచమి: ఇంక నిన్ను శ్రమ పెట్టను ఫణేంద్ర. మనం నాగలోకం వెళ్లి పోయే రోజు దగ్గర్లోనే ఉంది. మోక్ష మూడు ముళ్లు వేసిన మరుక్షణమే మనం వెళ్లిపోతాం.
ఫణేంద్ర: నీ ఇష్టం పంచమి.. నువ్వు నాగలోకం వస్తావా రావా అన్న భయం నాకు ఇప్పుడు లేదు. ఒక మహాత్తరమైన దైవసమానులు నాకు కనువిప్పు కలిగించారు. నువ్వు అందరికీ న్యాయం చేయగలవు పంచమి. నీ గొప్పతనం నేను అర్థం చేసుకున్నాను. నీకోసం నేను ఎదురు చూస్తుంటాను పంచమి.
పంచమి: త్వరలోనే వెళ్లిపోదాం ఫణేంద్ర. భూలోకంలో నా కర్తవ్యం పూర్తికావొస్తుంది. మానవ జన్మ రుణం తీరిపోతుంది. నీకు ఇంక ఎక్కువ కాలం ఎదురు చూపులు ఉండవు. ధైర్యంగా ఉండు ఫణేంద్ర.
ఫణేంద్ర: అలాగే పంచమి.
రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర పంచమి పనులు చేస్తుంటే మేఘన వచ్చి పంచమి నీకు ఎందుకు శ్రమ అన్ని పనులు నేను చేసుకుంటాను కదా అంటుంది. పంచమి పర్లేదులే అంటుంది. మీ పెళ్లి వరకు నీకు సాయంగా ఉంటాను అని పంచమి అంటుంది. దీంతో మేఘన నువ్వు పక్కనే ఉంటే నీ దగ్గర నుంచి అన్ని తీసుకుంటున్నట్లు నాకు బాధగా ఉంది అని అంటుంది. అంతే కాకుండా పంచమితో నువ్వు ఇక్కడే మోక్ష కళ్లముందే తిరుగుతూ ఉంటే తన మెడలో మూడు ముళ్లు పడేవరకు తన పెళ్లి అనుమానంగా ఉంటుందని మేఘన అంటుంది. దీంతో పంచమి మీ పెళ్లి అయిపోయిన తర్వాత అన్నీ మారిపోతాయి అని అంటుంది. దీంతో మేఘన నాకు ఓ సాయం చేయు పంచమి అంటుంది. సరే అని పంచమి అనడంతో పెళ్లి తర్వాత మోక్ష అన్ని మర్చిపోతారు అని చెప్తున్నావ్ పంచమి అలా జరిగితే ఓకే.. కానీ నువ్వు మాత్రం తర్వాత మోక్షకు ఎప్పుడూ కనిపించొద్దు అని అంటుంది. దీంతో పంచమి కలలో కూడా మీకు కనిపించనంత దూరం వెళ్లిపోతా అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: నాయక్: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - రీ రిలీజ్ కాబోతున్న 'నాయక్', ఎప్పుడంటే?