Naga Panchami Serial Today March 1st: 'నాగ పంచమి' సీరియల్: పంచమిని చంపేస్తానని మెడ పట్టుకున్న జ్వాల.. ఫణేంద్రను హెచ్చిరించిన సుబ్బు!
Naga Panchami Serial Today Episode పంచమిని చంపేస్తాను అని జ్వాలలో నంబూద్రీ ఆత్మ చేరి పంచమి మెడ పట్టుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Naga Panchami Today Episode జ్వాలలోకి నంబూద్రీ ఆత్మ వస్తుంది. జ్వాలని చూసిన వరుణ్ జ్వాల నీకు ఏదో అయింది. మళ్లీ నువ్వు మారిపోయావు. ఇలా అయినప్పుడు వీడియో తీయమన్నావు కదా అంటూ ఫోన్ తీస్తే జ్వాల వరుణ్ దగ్గరకు వెళ్లి హగ్ చేసుకుంటుంది. వరుణ్ భయంతో వణికిపోతాడు. తర్వాత జ్వాల తన కళ్లతో వరుణ్‌ని మాయచేసి పడుకునేలా చేస్తుంది.
నంబూద్రీఆత్మ: నా చెల్లెలి కోసం కొంత కాలం నీకు ఈ కష్టం తప్పదు. ఆ పంచమి చావు మోక్ష బలితో ఈ ఇంటికి మాకు పని ఉండదు. అంతవరకు ఇలాంటివి భరించాల్సిందే..
ఫణేంద్ర: పంచమి కొట్టిన సంఘటన గుర్తు చేసుకుంటూ.. ఇంత జరిగిన తర్వాత పంచమి నాతో నాగలోకం వస్తుంది అని ఆశపడటం నా మూర్ఖత్వమే అవుతుంది. మోక్ష లేకపోతేనే పంచమి నాతో వస్తుంది. క్షమించు మోక్ష నీ మీద నాకు ఎలాంటి పగ ప్రతీకారం లేదు. కానీ నేను మా యువరాణిని నాగలోకం తీసుకెళ్లడం నా బాధ్యత. అందుకోసం నేను కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. విధి లేని పరిస్థితుల్లో నిన్ను చంపకతప్పడం లేదు ఇక నేను ఆలస్యం చేయలేను.
ఫణేంద్ర పాములా మారి మోక్ష గదికి వెళ్తాడు. మోక్ష పడుకొని ఉంటే కాటేయడానికి వెళ్తాడు. ఇంతలో తంత్రీ, కంత్రీలు పంచమి గది తలుపులు కొడతారు. దీంతో ఫణేంద్ర పాము వెనక్కి వెళ్లిపోతుంది. శబ్ధం రావడంతో పంచమి వచ్చి చూసి తలుపులు తీస్తుంది. అయితే అక్కడ నుంచి తంత్రీ, కంత్రీలు వెళ్లిపోతారు. ఇక పంచమి వెతుకుతూ కిందకి దిగుతుంది. ఇంతలో జ్వాలలో ఉన్న నంబూద్రీ ఆత్మ అక్కడికి వస్తుంది. జ్వాలని చూసి పంచమి షాక్ అవుతుంది.
పంచమి: జ్వాలమ్మ గారు ఏమైంది అలా చూస్తున్నారు. ఏమైందండి.. పైన ఎవరో తలుపు కొట్టారు అందుకే వచ్చాను. మాట్లాడండి.. నాకు భయంగా ఉంది. ఏంటి అలా మీదకు వస్తున్నారు.
జ్వాల: నిన్ను చంపేస్తున్నాను.. మరోవైపు మేఘన, తంత్రీ, కంత్రీలు చూస్తుంటారు.
పంచమి: ఏంటి మీరు అనేది.
జ్వాల: నువ్వు తప్పించుకోలేవు. నాకు నీ ప్రాణం కావాలి.
పంచమి: మీకు ఏదో అయింది. మోక్షాబాబుని పిలుస్తాను.. మోక్షాబాబు.. అంటే జ్వాలలోని నంబూద్రీ ఆత్మ పంచమి మెడ పట్టుకొని నొక్కుతుంది. మరోవైపు ఫణేంద్ర పాము మోక్షని కాటేయడానికి బెడ్ మీదకు వెళ్లి కాటేయడానికి ప్రయత్నిస్తే అక్కడ ఉన్న నెమలిపింఛం.. సుబ్రహ్మణ్య స్వామి త్రిశూలంగా మారి మోక్షని కాటేయకుండా అడ్డుకుంటుంది. త్రిశూలం పాముకు ఎదురు వెళ్లడంతో ఫణేంద్ర పాము వెనుదిరుగుతుంది. ఇక ఫణేంద్రని త్రిశూలం వెంబడిస్తుంది. భయటకు పారిపోతాడు ఫణేంద్ర. భయంతో వణికిపోతాడు.
ఫణేంద్ర: సుబ్బు ప్రత్యక్షం అవడంతో.. నన్ను క్షమించండి స్వామి.
సుబ్బు: పవిత్రమైన ఇష్టరూపనాగజాతి యువరాజువని మర్చిపోయావా ఫణేంద్ర.
ఫణేంద్ర: మా యువరాణిని నాతో తీసుకెళ్లడానికి నాకు మరోమార్గం కనిపించలేదు స్వామి.
సుబ్బు: అందుకని ఇంత పెద్ద అపరాధానికి పాల్పడతావా. ఈ ఘోరం జరిగిపోయి ఉంటే అకారణంగా నువ్వు మోక్షని కాటేసి చంపినందుకు నాగలోకం ప్రతిష్ట మట్టికలిసిపోయేది. ఈ నాగజాతి నన్ను ఆరాధిస్తుంది కాబట్టి నాగలోకం కోసం నువ్వు తప్పు చేయకుండా ఆపాను.
ఫణేంద్ర: పంచమిని తప్పకుండా నాగలోకం తీసుకెళ్లాల్సిన పరిస్థితి స్వామి. నాకు అన్ని దారులు మూసుకుపోయాయి. నా భార్యని తీసుకెళ్తావా అని మోక్ష నన్ను బెదిరించాడు. అలాగే మా యువరాణి కూడా నామీద చేయి చేసుకుంది.
సుబ్బు: అందుకని ఆ కోపంతో మోక్షని కాటేసి చంపాలని నిర్ణయించుకున్నావు. పంచమి నాకు పరమభక్తురాలు.. విశిష్ట నాగకన్య. పతి కోసం ప్రాణాలు అర్పించే సతీమణి. అలాంటిది నువ్వు అంత పెద్ద సాహసం చేసి ప్రాణాలతో ఉన్నావు అంటే భూలోకానికి నాగలోక దూతగా వచ్చావు కాబట్టి. దూతగా వచ్చిన వాళ్లని శిక్షించడం పాపం కాబట్టి నీకు ప్రాణాలు దక్కాయి ఫణేంద్ర.
ఫణేంద్ర: నేను చేసింది పెద్ద తప్పిదమే కానీ నేను మా యువరాణిని తీసుకెళ్లడానికి ఏదైనా మార్గం చూపించడం స్వామి.
సుబ్బు: పంచమి మానవ రూపంలో ఉన్నంత వరకు మీ యువరాణి కాదు ఫణేంద్ర. మోక్షకి భార్య. పంచమి పాముగా మారినప్పుడు తన పూర్తి అంగీకారంతో మీ లోకం తీసుకెళ్లడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. అలాంటి సందర్భం కోసం నువ్వు ఎదురు చూడాల్సిందే. అలాంటి సందర్భం వస్తే నువ్వు పంచమిని నిరభ్యంతరంగా తీసుకెళ్లు ఫణేంద్ర. మరోవైపు జ్వాల పంచమి మెడ నొక్కి చంపేయాలి ప్రయత్నిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: శశివదనే: ఏమిటో ఏమిటో... ఈ మెలోడీ ఇంత బావుందేమిటో, మళ్లీ మళ్లీ వినేలా!





















