Naga Panchami Serial Today March 18th: 'నాగ పంచమి' సీరియల్: పంచమిని ఘోరంగా అవమానించిన రఘురాం.. అదిరిపోయే వార్త చెప్పిన నాగసాధువు!
Naga Panchami Serial Today Episode మోక్షను కావాలనే పంచమి చంపేసింది అని రఘురాం, వైదేహిలు పంచమిని నిందించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Naga Panchami Today Episode ఈరోజు నాగ పంచమి సీరియల్ ప్రారంభంలో పంచమి మహరాణికి శివాలయంలో పుట్టుడం, పుట్టగానే తల్లి చనిపోవడం, ఆ తర్వాత మోక్ష ఏ పరిస్థితిలో పంచమిని పెళ్లి చేసుకున్నాడో.. దాంతో పాటు పంచమికి తాను నాగ కన్య అని తెలియడం మోక్షను దూరం పెట్టడం, తల్లి పగను తీర్చుకోవడానికి నంబూద్రీని కాటేసి చంపడం చివరకు రెండు రోజుల క్రితం మోక్ష, పంచమి శారీరకంగా కలవడం దాని వల్ల మోక్షప్రాణాల మీదకు తెచ్చుకోవడం.. ఇక పంచమి తన భర్తను కాపాడుకుంటానని తాను పుట్టిన శివాలయం దగ్గరకు తీసుకురావడం షార్ట్ కట్‌లో చూపిస్తారు.
గౌరి: నా పంచమి మాట ఆ శివయ్య వింటాడు అన్నయ్య గారు. మోక్ష ప్రాణాలకు ఏం కాకుండా పంచమి కాపాడుకుంటుంది. ఆ శివయ్య తన భర్త ప్రాణాలు కాపాడుతాడు.
మీనాక్షి: పంచమి ఒక్కసారి మా మాట విను మోక్షను ఇక్కడ ఉంచడం కంటే మంచి హాస్పిటల్‌లో చేర్చడం మంచిది.
పంచమి: ఇప్పటి వరకు చూశారు ఈ ఒక్కసారి మన్నించడండి. నా భర్త మోక్ష బతకుతారు అని నమ్మకం నాకు ఉంది. ఈ ఒక్కసారికి నా మాట వినండి.
శబరి: ఓరేయ్ రఘు పంచమి మాట విందాంరా. పంచమి ఎప్పుడు అబద్ధం చెప్పదు. మోక్ష బతుకుతాడు.
రఘురాం: ఏంటమ్మా ఇంకా నమ్మకం నమ్మకం అంటావ్.. మంత్రాలకు చింతకాయలు రాలవమ్మా. ఇప్పుడు నాకు అర్థమైంది నేను ఎంతో ప్రేమగా పెంచుకున్న నా బిడ్డ ఇక నాకు లేడని అర్థమైంది. నాకు అర్థమవుతుంది.
పంచమి: మామయ్య మీకు దండం పెడతాను. నమ్మకం కోల్పొవద్దు. శివయ్య మీద నమ్మకం ఉంచండి ఈ ఒక్క రోజు నా మీద నమ్మకం ఉంచండి. నా మోక్షాబాబు బతుకుతారు. దయచేసి ఈ ఒక్కరోజు ఉండండి. నేను మళ్లీ చెప్తున్నాను నా భర్త బతుకుతాడు. ఒకవేళ మోక్షాబాబు చనిపోతే తను చనిపోయిన మరుక్షణం నేను ఈ భూమ్మీద ఉండను. ఇదే నాకు చివరి అవకాశం. అందరూ ఈ ఒక్కసారి నన్ను నమ్మండి.
కరాళి: నా దౌర్భాగ్యం చూశావా అన్నయ్య ఆ మహాంకాళి కూడా నన్నే నిందిస్తుంది. నాకు శక్తులు తిరిగి ఇవ్వదట.
నంబూద్రీ: అంతా నీ మంచికే అనుకో చెల్లమ్మ. అప్పుడే దుఃఖ భారం కొంచెం అయినా తగ్గుతుంది.
కరాళి: ఒక చెల్లెలిగా నేను నిన్ను బతికించుకోవడానికి చేసిన పని తప్పా అన్నయ్య. పెద్ద మంత్రగత్తిని అవ్వడానికి చిన్నప్పటి నుంచి దాన్నే వృత్తిగా ఎంచుకున్న దాన్ని. నాగమణిని సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకున్నాను అన్నయ్య దాని మీద ఆశ వదులు కోవడానికి నా మనసు అంగీకరించడం లేదు. అలాంటి ఓటమిని పొందడం కన్నా ఇప్పుడే వెళ్లి ఆ పంచమిని కసి తీరా చంపి కొంచెం అయినా ఆత్మ సంతృప్తిని పొందుతాను.
నంబూద్రీ: ఆవేశం ఆలోచనలను చంపేస్తుంది కరాళి. తప్పుడు నిర్ణయాలు నిన్ను ముందుకు నడిపించలేవు. వాస్తవాన్ని గ్రహించి జీర్ణించుకోగలగాలి అప్పుడే కచ్చితమైన అంచనాలతో భవిష్యత్‌ను రచించుకుంటారు. దీన్ని నువ్వు ఇప్పుడు ఒక గుణపాఠంలా భావించి ఏం చేయాలో నిర్ణయించుకో అప్పుడే విజయం వైపు నడుస్తావ్..
కరాళి: ఇప్పుడు ఆ పంచమి తన భర్తను బతికించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అన్నయ్య. నాకు ఉపయోగపడని మోక్ష పంచమికి కూడా దక్కకూడదు.
నంబూద్రీ: దాని వలన నీకు ఏదైనా ప్రయోజనం కలుగుతుంది అనుకుంటే ఏంచేయాలో ఆలోచించు.
కరాళి: మోక్ష లేకపోతే పంచమి ఒంటరి అయిపోతుంది. ఇక నాగలోకం కూడా వెళ్లలేదు. అప్పుడు దాన్ని నా బానిసగా చేసుకొని నా కసిని తీర్చుకుంటాను. దాన్ని అడ్డం పెట్టుకొని నాగమణిని కూడా సంపాదిస్తాను అన్నయ్య. ఇక కరాళి తన మంత్ర శక్తితో నాగులా వరంలో ఏం జరుగుతుందో చూస్తుంది. మోక్ష బతకకూడదు. ఏదో ఒక శక్తిని పంపించి.
మరోవైపు నాగలోకంలో నాగదేవత దిగ్విజయంగా పరమశివుడి పూజ పూర్తి చేస్తారు.
ఫణేంద్ర: మాతా పూజ పూర్తి అయింది కాబట్టి నేను వెళ్లి యువరాణిని తీసుకొచ్చేస్తాను. ఈ శుభసమయానే పట్టాభిషేకం జరిగిపోవాలి. నాతో పాటు కొంతమంది నాగకన్యల్ని కూడా తీసుకెళ్తాను.
వైదేహి: ఉదయం.. పంచమి నీ మాటలు నమ్మి కోటి ఆశలతో ఇక్కడికి వచ్చాం కానీ నా బిడ్డ కళ్లు తెరవలేదు. నువ్వే మా మోక్షని ఏదో చేసి తప్పించుకోవాలి అని నాటకాలు ఆడుతున్నావ్.
పంచమి: లేదు అత్తయ్య. మోక్షాబాబు బతికే ఉన్నారు అని ఆ శివయ్యే నాకు నమ్మకం కలిగించారు.
రఘురాం: మమల్ని ఇంకా పిచ్చివాళ్లని చేయకు పంచమి. నీ మాటలు నమ్మి నీతో రావడం మాదే తప్పు.
శబరి: అమ్మా పంచమి నిజం చెప్పు అమ్మా నా మనవడు కళ్లు తెరుస్తాడా..
రఘురాం: అమ్మా నువ్వు చెప్పావు అని మేం ఏదో ఆశపడి వచ్చాం. పంచమి చెప్పింది అంతా అబద్ధం.
మీనాక్షి: మోక్ష బతుకుతాడు అని ఏ నమ్మకంతో చెప్పావు పంచమి. అసలు మా మోక్ష ఉన్నట్టుండి ఎందుకు ఇలా అయిపోయాడు.
వైదేహి: ఇదే ఏదో ఒకటి చేసి ఉంటుంది. దీన్ని వదిలిపెట్టకూడదు. నా బిడ్డను నన్ను దూరం చేసినందుకు నిన్ను జీవితాంతం జైలులో ఉండేలా చేస్తాను.
రఘురాం: వైదేహి ఇక్కడేదైనా గొడవ చేస్తే మన పరువే పోతుంది. ఈమె మాటలు నమ్మి ఇలా వచ్చాం అని బయట తెలిస్తే మనల్ని చూసి నవ్వుతారు.
పంచమి: నా శివయ్య నన్ను మోసం చేయడు. నేను నా మోక్షాబాబుని రక్షించుకుంటాను. లేదంటే నేను ఇక్కడే చనిపోతాను.
రఘురాం: ఇంకా ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు వైదేహి మనం త్వరగా వెళ్లిపోదాం. మోక్షని ఇక్కడి నుంచి తీసుకెళ్దాం ఎవరైనా చూస్తే బాగోదు.
ఇంతలో నాగసాధువులు అక్కడికి వస్తారు. నాగ సాధువు మోక్షని తన దివ్య దృష్టితో పరిక్షిస్తారు. ఇక నాగసాధువు చూడండమ్మా ఈ అమ్మాయి చెప్పింది నిజం. ఈ అబ్బాయి మరణించలేదు. జీవించే ఉన్నాడు అని చెప్తారు. దీంతో అందరూ నాగసాధువుకి చేతులెత్తి మొక్కుతారు.
నాగసాధువు: చనిపోయి ఉంటే శరీరం రంగు మారిపోయి ఉబ్బిపోయి ఉండేది. తనలో ఎక్కడో ఇంకా జీవం ఉంది.
రఘురాం: మీరు చెప్పింది నిజమే అయితే మోక్షని ఇప్పుడు పెద్ద హాస్పిటల్‌లో జాయిన్ చేస్తాం.
నాగసాధువు: మోక్షని బతికించడం మానవుల వల్ల సాధ్యం కాదు. పంచమి శివయ్య వరప్రసాదం. పంచమి మాంగల్యాన్ని కాపాడేది ఆ పరమాత్మ ఒక్కడే.
పంచమి: ఏం చేయమంటారో చెప్పండి స్వామి నా భర్త కోసం నా ప్రాణాలు అర్పిస్తాను.
నాగసాధువు: నీ ప్రేమే నీ భర్తను కాపాడుతుంది. నీ భర్త కోసం నువ్వు చేసే త్యాగమే నీ మాంగల్యాన్ని కాపాడుతుంది. అధైర్యపడకు. ఒక యాగం చేద్దాం. ఆ యాగం పూర్తి అయ్యేలోపు మోక్ష కళ్లు తెరవాలి. లేదంటే ఆ శివయ్య కటాక్షం నీ మీద లేనట్టే. యాగం పూర్తయ్యే వరకు ఎవరూ కదలకుండా పరమేశ్వరున్ని తలచుకొని ఉండండి. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: మీతా రఘునాథ్: మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టిన ‘గుడ్ నైట్’ బ్యూటీ- నెట్టింట్లో పెళ్లి ఫోటోలు వైరల్