అన్వేషించండి

Meetha Raghunath Wedding: మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టిన ‘గుడ్ నైట్’ బ్యూటీ- నెట్టింట్లో పెళ్లి ఫోటోలు వైరల్

‘గుడ్ నైట్’ హీరోయిన్ మీతా రఘునాథ్ వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. గత ఏడాది నిశ్చితార్థం కాగా, తాజాగా మూడు ముళ్ల బంధంతో సంసార జీవితాన్ని మొదలు పెట్టింది.

Meetha Raghunath Wedding Photos: అన్నం ఉడికిందా? లేదా? అని చెప్పేందుకు ఒక్క మెతుకు పట్టుకుంటే చాలా అంటారు. అలాగే, నటన సామర్థ్యం ఏంటో తెలియాలంటే ఒక్క చిత్రం చేస్తే సరిపోతుంది. అలా, ఒకే ఒక్క చిత్రంతో నటిగా సత్తా చాటుకున్న ముద్దుగుమ్మ మీతా రఘునాథన్. గత ఏడాది తమిళంలో తెరకెక్కిన చిత్రం ‘గుడ్ నైట్’తో బాగా పాపులర్ అయ్యింది. చక్కటి కంటెంట్ తో రూపొందిన ఈ సినిమా హాట్ స్టార్ వేదికగా ఓటీటీలో విడుదల అయ్యింది. చిన్న చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది. యువతతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కు ఈ చిత్రం బాగా నచ్చింది. వసూళ్ల పరంగానూ సత్తా చాటింది.

అమాయకపు అమ్మాయిగా ఆకట్టుకున్న మీతా

గురక సమస్యను బేస్ చేసుకుని వినాయక్ చంద్రశేకర్ ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో మీతా, మణికంఠన్ జంటగా నటించారు. అందం, అమాయకత్వంతో కూడిన అమ్మాయిగా మీతా చక్కటి నటనతో ఆకట్టుకుంది. గురక పెట్టే యువకుడిగా మణికంఠన్ అద్భుతంగా నటించాడు. అతడి భార్య పాత్రలో మీతా ఒదిగిపోయి కనిపించింది. భర్త కోసం తన ఆనందాన్ని కూడా త్యాగం చేసే భార్యగా మెప్పింది. నేచురల్ లుక్  తో అభిమానులను ఆకట్టుకుంది. ఆమె నటనకు యువత ఫిదా అయ్యారు. భార్య అంటే మీతా లాగే ఉండాలని భావించారు.    

మీతా రఘునాథ్ పెళ్లి ఫోటోలు వైరల్

ఇక అందాల తార మీతా రఘునాథ్ కు గత ఏడాది నవంబర్ లో నిశ్చితార్థం అయ్యింది. తాజాగా ఆమె అభిమానులను సర్ ప్రైజ్ చేసింది. మూడు ముళ్ల బంధంతో సంసార జీవితంలోకి అడుగు పెట్టింది. పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అయితే, తన భర్తకు సంబంధించిన ఎలాంటి వివరాలను మీతా బయటకు చెప్పలేదు. ఆయన పేరు ఏంటి? ఏప్రాంతానికి చెందిన వాడు? వాళ్ల ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటి? అనే విషయాలను రహస్యంగా ఉంది. అయితే, వీరి పెళ్లి మాత్రం మీతా సొంతూరు ఊటీలో జరిగినట్టు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా వివాహం జరిగింది. ఇక సోషల్ మీడియా ద్వారా పెళ్లి ఫోటోలను షేర్ చేసిన ఆమె, ‘మై హార్ట్’ అంటూ కామెంట్ పెట్టింది. దానికి లవ్ ఎమోజీ యాడ్ చేసింది. చక్కటి పట్టు చీరలో సంప్రదాయబద్దంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. ఈ ఫోటోలను చూసి నెటిజన్లు శుభాకాంక్షలు చెప్తున్నారు. జంట చూడ ముచ్చటగా ఉందని కామెంట్స్ పెడుతున్నారు.

View this post on Instagram
 
A post shared by Meetha Raghunath (@the.meethling)

Read Also: విషమంగా విజయ్‌ ఆంటోని హీరోయిన్‌ ఆరోగ్య పరిస్థితి - వెంటిలెటర్‌పై చికిత్స, డబ్బుల్లేక ఆర్థిక సాయం కోసం ప్రకటన

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

One Nation One Election Bill : లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- మద్దతు ఇచ్చిన టీడీపీ- వ్యతిరేకించిన కాంగ్రెస్
లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- మద్దతు ఇచ్చిన టీడీపీ- వ్యతిరేకించిన కాంగ్రెస్
KCR And KTR Cases Updates : మొన్న కవిత, నిన్న హరీశ్.. ఇవాళ కేటీఆర్.. రేపటి టార్గెట్ కేసీఆరేనా?
మొన్న కవిత, నిన్న హరీశ్.. ఇవాళ కేటీఆర్.. రేపటి టార్గెట్ కేసీఆరేనా?
Andhra Pradesh News: తెలియక చేసిన పొరపాటు క్షమించండి- టీడీపీ అధి‌ష్ఠానానికి, శ్రేణులకు పార్థసారథి, శిరీష రిక్వస్ట్
తెలియక చేసిన పొరపాటు క్షమించండి- టీడీపీ అధి‌ష్ఠానానికి, శ్రేణులకు పార్థసారథి, శిరీష రిక్వస్ట్
One Nation One Election Bill: లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సంధ్య థియేటర్ ఘటనలో మరో ట్విస్ట్!Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
One Nation One Election Bill : లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- మద్దతు ఇచ్చిన టీడీపీ- వ్యతిరేకించిన కాంగ్రెస్
లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- మద్దతు ఇచ్చిన టీడీపీ- వ్యతిరేకించిన కాంగ్రెస్
KCR And KTR Cases Updates : మొన్న కవిత, నిన్న హరీశ్.. ఇవాళ కేటీఆర్.. రేపటి టార్గెట్ కేసీఆరేనా?
మొన్న కవిత, నిన్న హరీశ్.. ఇవాళ కేటీఆర్.. రేపటి టార్గెట్ కేసీఆరేనా?
Andhra Pradesh News: తెలియక చేసిన పొరపాటు క్షమించండి- టీడీపీ అధి‌ష్ఠానానికి, శ్రేణులకు పార్థసారథి, శిరీష రిక్వస్ట్
తెలియక చేసిన పొరపాటు క్షమించండి- టీడీపీ అధి‌ష్ఠానానికి, శ్రేణులకు పార్థసారథి, శిరీష రిక్వస్ట్
One Nation One Election Bill: లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
Rohit Sharma Retirement: టెస్టుల నుంచి రోహిత్ శర్మ రిటైర్మెంట్‌? డగౌట్ ముందు గ్లౌస్‌లతో సంకేతాలు!
టెస్టుల నుంచి రోహిత్ శర్మ రిటైర్మెంట్‌? డగౌట్ ముందు గ్లౌస్‌లతో సంకేతాలు!
Srikakulam Crime News: టీడీపీ నేత హత్యకు కుట్ర- బిహార్ గ్యాంగ్‌కు సుపారీ- శ్రీకాకుళం జిల్లా పలాసలో సంచలనం 
టీడీపీ నేత హత్యకు కుట్ర- బిహార్ గ్యాంగ్‌కు సుపారీ- శ్రీకాకుళం జిల్లా పలాసలో సంచలనం 
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Elon Musk: ఇక  టెస్లా వాట్సాప్, జీమెయిల్‌ - తేవాలని టెకీ సలహా - సిద్దమన్న ఎలాన్ మస్క్ !
Elon Musk: ఇక టెస్లా వాట్సాప్, జీమెయిల్‌ - తేవాలని టెకీ సలహా - సిద్దమన్న ఎలాన్ మస్క్ !
Embed widget