అన్వేషించండి

Naga Panchami Serial Today February 17th: 'నాగ పంచమి' సీరియల్: తమ వాటా ఆస్తిని అడిగేయమని వరుణ్, భార్గవ్‌లను రెచ్చగొట్టిన కన్నింగ్ సిస్టర్స్!

Naga Panchami Serial Today Episode మోక్షకి ఎదురు తిరిగి పంచమిని ఇంట్లో గెంటేలా చేయమని తమ భర్తలకు తోడి కోడళ్లు చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మరింది.

Naga Panchami Today Episode మేఘన గుడికి వెళ్తా అని చెప్పి వెళ్తుంది. పంచమిని ఎవరైనా ఏమైనా అంటే రియాక్షన్ ఇలానే ఉంటుంది అని మోక్ష అంటాడు. తర్వాత పంచమిని తీసుకొని తమ రూమ్‌కి వెళ్లిపోతాడు. 

వైదేహి: మీరు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. మీకు సపోర్ట్‌గా నేను ఉన్నాను. పంచమిని మెడ పట్టి బయటకు గెంటేయడానికి ఏ చిన్న అవకాశం ఉన్నా వదిలొద్దు. తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటాను. 
జ్వాల: ఈమె ప్లేట్ తిరగేస్తుంది. మనం మోక్ష దగ్గర బుక్ అయిపోతామంటుంది.  
చిత్ర: అవును అక్క వీళ్లెవరికీ మోక్షని ఎదుర్కొనే ధైర్యం లేదు. ఈరోజు నుంచి మనమే ఈ పాముల సంగతి తేల్చేద్దాం. 
పంచమి: నా వల్ల మీరు రోజుకో అవమానం ఎదుర్కొంటున్నారు. 
మోక్ష: నన్ను ఎన్ని మాటలు అన్నా పడతాను కానీ నిన్ను ఒక్క మాట అన్నా ఎవర్ని వదిలిపెట్టను. 
పంచమి: మీరు ఆవేశపడకుండా ఆలోచించండి మోక్షాబాబు. వాళ్లు నన్ను అన్న మాటల్లో నిజమే ఉంది కాబట్టి అంత గట్టిగా మాట్లాడుతున్నాను.  మన దగ్గర సమాధానం లేదు కాబట్టి గట్టిగా మాట్లాడలేకపోయాం. 
మోక్ష: వాళ్లకేం తెలీదు పంచమి. ఏదో ఒకటి పెట్టి నిందలు వేయాలి అని చూస్తున్నారు. వాళ్ల మాటల్లో అసలు అర్థం పర్థం లేదు. నువ్వు పట్టించుకోవద్దు. 
పంచమి: నిజం గ్రహించండి. నిజాన్ని ఎన్ని రోజులు దాచుకుంటాం. వాస్తవం ఈ ఇంట్లో తెలియడానికి ఎంతో కాలం పట్టదు. ఇందుకు ఒకటే దారి నేను మనిషి కాదు పాముని అని అందరికీ తెలియాలి. అలా చేయాలి అంటే ఎంత పెద్ద పరాభవం జరిగినా భరించగలిగిన శక్తి ఉండాలి. అలా ఒద్దు అనుకుంటే నాకు ఉన్న మరోమార్గం నేను మీ జీవితం నుంచి తప్పుకోవడం. నేను అనేదాన్ని ఇక్కడ లేకపోతే ఎవరికీ ఇబ్బంది ఉండదు. 
మోక్ష: నా జీవితంలో నుంచి నిన్ను పంపించడం జరగని పని. 
పంచమి: అంటే నలుగురి మధ్య నాకు అవమానం జరిగినా మీకు పర్వాలేదా మోక్షాబాబు. ఇలాగే ఉంటే జరగబోయేది అదే మోక్షాబాబు. పదిమంది మధ్యలో నన్ను నిలబెట్టి నన్ను ఎంత హేలనగా చేసినా మీరు ఏం అనకూడదు. రోజు రోజుకూ ఈ అనుమానం పెరుగుతూనే ఉంటుంది.  మన ప్రతివాదన బలం రోజు రోజుకు తగ్గిపోతుంది. మీ భార్య పంచమిని అందరూ  పాము అని వేలు ఎత్తి చూపితే మీకు ఇష్టమేనా. మీది తరగని ప్రేమ మోక్షాబాబు. ఎన్ని జన్మలు ఎత్తినా మీ ప్రేమ తరగనిది. మీరు బాగుండాలి నేను బాగుండాలి అంటే మీరు మరో పెళ్లి చేసుకున్నప్పుడే అది జరుగుతుంది. మీరే ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రండి మోక్షాబాబు. 

జ్వాల వరుణ్ దగ్గరకు వెళ్లి చీర ఇచ్చి ఇది కట్టుకో నువ్వు మగాడివి కాదు అంటుంది. వరుణ్ జ్వాలని తిడతాడు. దీంతో జ్వాల మీ తమ్ముడు నా గొంతు పట్టుకుంటే నువ్వు ఏం చేశావ్ అని అడుగుతుంది. 

జ్వాల: నేను నీ బానిసని కాదు మిస్టర్.. నీ అరుపులు కేకలకు నేను భయపడను. నీ ప్రతాపం మీ వాళ్ల దగ్గర చూపించుకో. ధైర్యం లేని వాడివి పిరికి వాడిలా ఓ మూలన కూర్చో. అంతే కాని పుడింగిలా కాలర్ ఏగరేస్తాను అంటే నా దగ్గర కుదరవు. 
వరుణ్: అసలు ఏంటి జ్వాల నీ ప్రాబ్లమ్. అని నీ నోటి దురద. అసలు నిన్నెవరు మోక్షని వేలెత్తి చూపమన్నారు. 
జ్వాల: నేనేం తప్పు మాట్లాడాను. ఆ పంచమి పాము అనేది నిజం. అందుకే చెప్పాను. మోక్ష పంచమి ఏదో పెద్ద విషయమే దాస్తున్నారు. మొదటి నుంచి పంచమి బిహేవియర్ వింతగానే ఉంది. పాములతో మాట్లాడటం.. తనలోకి ఏదో శక్తిరావడం మనం పంచమిని ఈ ఇంట్లో వదిలేస్తే మన పరిస్థితి ఏంటి.
వరుణ్: నీ భయం నాకు అర్థమైంది ఏం చేద్దాం అంటావ్ జ్వాల.
జ్వాల: నేను ఎవరి దగ్గర ఏం మాట్లాడినా మీరు నాకు సపోర్ట్‌గా మాట్లాడండి చాలు. ఫస్ట్ ఆ పంచమి ఈ ఇంట్లో ఉంటే మనం ఉండమని చెప్పు. అది జరగకపోతే ఆస్తి డివైడ్ చేసి ఇవ్వమని చెప్దాం. 
వరుణ్: ఇది నిజంగానా లేక ఊరికేనా.
జ్వాల: అప్పటి పరిస్థితి బట్టి ఆలోచిద్దాం. దేనికైనా రెడీగా ఉండండి. 

భార్గవ్: ఏమన్నావ్ నాకు ధైర్యం లేదా అయిపోయావే నా చేతిలో ఇవాళ అయిపోయావే. అంటూ చిత్రని కొట్టడానికి వెళ్తే చిత్ర రివర్స్‌లో భర్తని భయపెడుతుంది. ఆ సీన్ కామెడీగా ఉంటుంది. పంచమి విషయంలో తాను ఏం చెప్తే అది వినమని అంటుంది. జ్వాల చెప్పినట్లు సేమ్ చెప్తుంది. దానికి భార్గవ్ ఓకే అంటాడు. 

మరోవైపు మేఘన తన మంత్ర శక్తితో పాత కరాళిలా మారిపోతుంది. పంచమి ఏం చేస్తుందో తన మంత్ర శక్తితో చూస్తుంది. పంచమి కరాళి ఆశ్రమానికి వెళ్లి తనని పిలవడం చూస్తుంది. తన భర్త జోలికి వస్తే చంపేస్తా అని పంచమి వార్నింగ్ ఇవ్వడం చూస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.  

‘పుష్ప 3’ అప్‌డేట్, ‘గామి’ టీజర్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
Bumrah 5 Wicket Haul: బుమ్రా పాంచ్ పటాకా - హెడ్, స్మిత్ సెంచరీలు, మూడో టెస్టులో భారీ స్కోరు దిశగా ఆసీస్
బుమ్రా పాంచ్ పటాకా - హెడ్, స్మిత్ సెంచరీలు, మూడో టెస్టులో భారీ స్కోరు దిశగా ఆసీస్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Bigg Boss 8 Telugu Finale LIVE: బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
Aadhaar Card Updating: ఆధార్‌ ఉన్న వారికి గుడ్ న్యూస్ - ఫ్రీ అప్ డేట్ గడువు మరో 6 నెలలు పెంపు, ఇదీ ప్రాసెస్
ఆధార్‌ ఉన్న వారికి గుడ్ న్యూస్ - ఫ్రీ అప్ డేట్ గడువు మరో 6 నెలలు పెంపు, ఇదీ ప్రాసెస్
Embed widget