Naga Panchami Serial Today February 16th: 'నాగ పంచమి' సీరియల్: జ్వాల గొంతు పట్టుకొన్న మోక్ష.. ఫణేంద్రతో పంచమికి ఎఫైర్ పెట్టిన తోటికోడళ్లు!
Naga Panchami Serial Today Episode పంచమి ఎవరో అబ్బాయితో ఎఫైర్ పెట్టుకుంది అని చిత్ర, జ్వాలలు నిందలు వేయడంతో మోక్ష సీరియస్ అవుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Naga Panchami Today Episode మోక్షకి మెలకువ వస్తుంది. లేచి పంచమి దగ్గరకు వస్తాడు. మీరందరూ ఎందుకు వచ్చారు ఏమైంది అని అడుగుతాడు. దీంతో మీనాక్షి ఏదో సౌండ్ వస్తే వచ్చాం మీరు వెళ్లి పడుకోండి అని అంటుంది. దీంతో అందరూ వెళ్లిపోతారు. ఫణేంద్ర పాము బయటకు వెళ్లిపోతుంది. ఇక తనని ఫణేంద్ర కాపాడాడు అని చెప్తుంది పంచమి.
పంచమి: నాతో జీవితం ఎంత ప్రాణాపాయమో తెలిసిందా మోక్షాబాబు.. ఒక ముద్దు ముచ్చటకి కూడా పనికి రాని భార్యని నేను. నేను వెళ్లి ఫణేంద్ర కాళ్లు వేళ్లు పట్టుకొని బ్రతిమిలాడి తీసుకొచ్చి మీ ప్రాణాలు కాపాడుకున్నాను.
మోక్ష: ఇక జాగ్రత్తగా ఉంటాను పంచమి.
పంచమి: ఒక రోజో ఒక సంవత్సరమో కాదు జీవితాంతం జాగ్రత్తలు పాటిస్తూ మీ ప్రాణాలు కాపాడుకోవడం కత్తిమీద సాము లాంటిది.
మోక్షా: అయితే ఇప్పుడు ఏం చేద్దాం పంచమి.
పంచమి: జరగబోయే ప్రమాదం గురించి చెప్తున్నాను. నేను వెళ్లి ఫణేంద్రని తీసుకురావడం చూసిన చిత్ర అందర్ని తీసుకొచ్చి నా మీద లేనిపోని నిందలు వేసింది.
మోక్షా: ఏంటి నిన్ను మరొకరు వేలెత్తి చూపించడమా..
పంచమి: లేదు మోక్షాబాబు ఇలాంటి వాటికి నేను భయపడను. కానీ నీ ప్రాణాలతో చలగాటం ఆడటం సరైనది కాదు. త్వరగా మీరు ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రావాలి.
మోక్షా: బాగా ఆలోచించాను పంచమి మనమిద్దరం ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని.
పంచమి: మనసులో.. ఏం చేస్తే నన్ను మర్చిపోతారో అర్థం కావడం లేదు.
మేఘన: అన్నయ్య మహాకాళి నన్ను మోసం చేసింది. తన ఇచ్చిన గడువు ముగిసిపోయింది అంట. నాకు శక్తులు ఇవ్వలేదు అంట. ఇక తన ప్రత్యక్షాన్ని కూడా ఆశించొద్దు అని చెప్పేసింది.
నంబూద్రీ: ఎంత ఘోరం జరిగిపోయింది కరాళి. నీ శక్తులు నీకు వస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. ఇలా అవ్వడం చాలా బాధగా ఉంది.. మరి ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నావ్ చెల్లమ్మ. మోక్షని పెళ్లి చేసుకొని సాధారణ జీవితం గడుపుతావా..
మేఘన: అది ఎప్పటికీ జరగని పని అన్నయ్య. మహాకాళి నన్ను వదిలిపెట్టినా నేను తనని వదిలిపెట్టను. నేను ఎలా అయినా నా శక్తులను పొందుతాను. అంతవరకు నేను నిద్రపోను. మహాకాళహని నిద్రపోనివ్వను. నాగమణిని సొంతం చేసుకోవడం నా ధ్యేయం. అంతుకోసం ఎంతకైనా తెగిస్తా. మరోవైపు మేఘన గది నుంచి మాటలు పంచమి వింటుంది. అనుమానంతో తలుపు దగ్గరకు వెళ్లి వింటుంది. మేఘన ఎవరితో మాట్లాడుతుంటుంది అని అనుకుంటుంది పంచమి. కరాళి వచ్చి ఇబ్బంది పెడుతుంది ఏమో అని అనుకుంటుంది. పంచమి మేఘనని పిలుస్తుంది.
మేఘన: ఏమైంది పంచమి నాతో ఏమైనా పని పడిందా..
పంచమి: మేఘన గదిలో నుంచి నీ మాటలో వినిపించాయి.
మేఘన: నేను నిద్ర పోతున్నా పంచమి నా మాటలు నీకు వినిపించడం ఆశ్చర్యంగా ఉంది. ఒక వేళ నిద్రలో నేను ఏమైనా మాట్లాడానేమో.. ఏమని మాట్లాడానో నీకు వినిపించిందా పంచమి.
పంచమి: నువ్వు ఎవరితోనో మాట్లాడినట్లు నాకు అనిపించింది.
మేఘన: ఈ ఇంట్లో ఏమైనా దుష్ట శక్తులు లాంటివి ఉంటే నాకు చెప్పు పంచమి నేను వెళ్లిపోతాను.
ఉదయం మేఘన పూజ చేస్తుంటుంది. పంచమి చిత్ర, జ్వాలలకు కాఫీ ఇస్తుంది. జ్వాల కాఫీ ట్రే మొత్తం నేల పడేస్తుంది. పంచమి ఆ ముక్కలను ఏరుతుంది.
జ్వాల: ఏయ్ నిన్ను ఎవరే ఈ వస్తువులు అన్నీ ముట్టుకోమన్నారు. ఇంకో సారి కిచెన్‌లో వస్తువులు ముట్టుకున్నావ్ అనుకో.. చెంప పగల కొడుతా జాగ్రత్త.
చిత్ర: నువ్వొక పామువి నిన్ను చూడటానికే నాకు కంపరంగా ఉంది. అలాంటిది నువ్వు ముట్టుకున్నవాటిని మేం ఎలా ముట్టుకోవాలి. మోక్ష పంచమిని పట్టుకుంటాడు. ఫణేంద్ర పాము అంతా చూస్తుంటాడు.
జ్వాల: నువ్వు ఏదో ఒక మూలన పడుండు. నువ్వు తిరిగిన చోటు మేం తిరగలేం.
శబరి: మీకు అంత ఇబ్బందిగా ఉంటే ఏదైనా ఇళ్లు తీసుకొని వెళ్లిపోండి. పంచమి అన్ని ముట్టుకుంటుంది. ఇళ్లంతా తిరుగుతుంది. అడిగే అధికారం మీ ఎవరికీ లేదు.
చిత్ర: ఎందుకు లేదు అదొక పాము.
మోక్ష: నువ్వు చూశావా పాముగా మారడం.
జ్వాల: నేను చూశాను. తన స్నేహితుడు పాము అయినప్పుడు తాను కాదా..
మోక్ష: మీరు మరొక సారి పంచమిని పాము అంటే నేను ఊరుకోను. తర్వాత మీ ఇష్టం.
జ్వాల: ఏం చేస్తావ్ నేను అంటాను. పాముని పాము అనకు ఇంకేం అంటారు.
మోక్ష: నాకు కోపం తెప్పించకండి తర్వాత మీరే బాధ పడతారు.
మీనాక్షి: మోక్ష మీరు వెళ్లండి. ఈమధ్య వీరికి బాగా నోరు పెరిగింది. ఎవరో ఒకరి చేత దెబ్బలు తింటారు.
చిత్ర: అసలు వీళ్లు రాత్రే దొరికిపోవాల్సింది కొంచెంలో మిస్ అయిపోయారు.
వైదేహి: అసలు నేను నీతో మాట్లాడాలి అనుకోవడం లేదు. అయినా తప్పడం లేదు. చిత్ర, జ్వాలలు ఇద్దరూ చెప్తున్నారు నీ పక్కన ఉన్నది మనిషి కాదు పాము అని. అయినా నువ్వు ఇంకా దాన్నే వెనకేసుకొస్తున్నావ్.
మోక్ష: అమ్మా మనిషిని పాము అంటే నువ్వు ఒప్పుకుంటావా..
జ్వాల: పంచమి పాము అని నీకు తెలుసు మోక్ష. కానీ ఒప్పుకోలేకపోతున్నావ్.
చిత్ర: పంచమిని ఒక అబ్బాయితో చూశాం అని మేం చెప్తే అప్పుడు నువ్వే చెప్పావ్ ఆ అబ్బాయి పంచమి బంధువు అని.
జ్వాల: ఆ అబ్బాయి పాముగా మారడం నేను చూశాను.
చిత్ర: రాత్రి నేను చూసింది కూడా అతన్నే.
వరుణ్: మోక్ష వీళ్లు చెప్ఇపంది అబద్ధం అని గట్టిగా వీళ్ల నోరు మూయించు లేదంటే వీళ్ల గోల వినలేం.
భార్గవ్: మోక్ష మీరు మౌనంగా ఉంటే అబద్ధం కూడా నిజం అయిపోతుంది. వీళ్లు ఇంతగా చెప్తున్నారు అంటే అందులో ఎంతో కొంత నిజం ఉంటుంది కదా. ఆ అబ్బాయి గురించి చెప్పు మోక్ష.
జ్వాల: భార్య పనికి మాలిన సంబంధాన్ని ఏ భర్త బయట పెట్టుకోడు.
మోక్ష: వదినా మాటలు జాగ్రత్తగా మాట్లాడు.
జ్వాల: నీకు చెప్తే అర్థం కాదా.. నేను చెప్పేది నిజం నిజం.. అంటే మోక్షజ్వాల గొంతు పట్టేస్తాడు. అందరూ వదలమని అంటే వదలడు. వరుణ్ వచ్చి మోక్షని నెట్టేస్తాడు.
మోక్ష: మళ్లీ ఇలాంటి మాటలు మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు మిమల్ని వదినలు అని కూడా చూడను.
వరుణ్: రేయ్ బుద్దుందా నీకు మీ వదిన మీద చేయి చేసుకుంటావా.. సారీ చెప్పరా. అడగరా మోక్ష.
మీనాక్షి: ఎందుకురా ఎందుకు మోక్ష సారీ చెప్పాలి. మీ ఆవిడ మాట్లాడిన మాటలు బాగున్నాయా.. నీకు పౌరుషం ఉంటే నువ్వే నీ భార్యకి బుద్ధి చెప్పు.
వైదేహి: మోక్ష ఇలాంటి సంఘటనలు మన ఇంట్లో ఎప్పుడైనా చూశామా. నీ భార్యగా ఎప్పుడు ఇంట్లో అడుగు పెట్టిందో అప్పుడు నుంచే ఇలా అవుతుంది.
జ్వాల: నేను చెప్పేది అబద్ధం అయితే నేను ఏ శిక్షకి అయినా రెడీ. ఈ పంచమి ఎవరితో మాట్లాడుతుందో మనందరికీ తెలియాలి.
వైదేహి: నువ్వు దాచాలి అని చూడకు మోక్ష. వాడు ఎవడో దాని నోటి నుంచే చెప్పించు.
మోక్ష: మంచి బుద్ధితో అడిగితే చెప్పొచ్చు. వక్రబుద్ధితో అడిగితే చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఆ వ్యక్తిని ఈ సారి చూసినప్పుడు గట్టిగా పట్టుకొని అందర్ని పిలవండి.
చిత్ర: మేం పట్టుకుంటే తను పాముగా మారి మమల్ని కాటేస్తే.
మోక్ష: అయితే ఫొటో తీయండి. మీ ఇద్దరికి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఈ ఇంట్లో ఇంకెవరైనా పంచమిని తిట్టినా కొట్టినా నా రియాక్షన్ ఇలాగే ఉంటుంది. అని మోక్ష చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: ‘దేవర’ రిలీజ్ డేట్, ‘భ్రమయుగం’, ‘భామా కలాపం’ రివ్యూలు - నేటి టాప్ సినీ విశేషాలివే!