అన్వేషించండి

Naga Panchami Serial Today February 14th: 'నాగ పంచమి' సీరియల్: పంచమిని ముద్దు పెట్టుకొని ప్రాణాల మీదకు తెచ్చుకున్న మోక్ష!

Naga Panchami Serial Today Episode పంచమిని మోక్ష ముద్దు పెట్టుకోవడంతో మోక్ష పెదాలు నల్లగా మారిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Naga Panchami Today Episode పంచమికి బుద్ధి చెప్పినప్పుడే పోయిన తన పరువు తిరిగి వస్తుందని వైదేహి అంటుంది. ఇక వరుణ్, భార్గవ్‌లు అయితే పంచమి మంచి కోడలు అని భవిష్యత్‌లో నిన్ను తనే బాగా చూసుకుంటుంది అని అంటారు. దీంతో అదేంట్రా నన్ను చూసుకొనేది అని వైదేహి సీరియస్ అవుతుంది.

వైదేహి: ఎవరు నాతో ఏకీభవించినా లేకపోయినా నేను వెనకడుగు వేసేదే లేదు. మోక్షకి, మేఘనకు పెళ్లి చేసి తీరుతాను. ఈ మాట రాసిపెట్టుకో మేఘన మీ ఇద్దరికీ పెళ్లి చేయకపోతే నా పేరు వైదేహినే కాదు. 
జ్వాల: మరి పంచమిని ఏం చేస్తావ్ అత్తయ్య.
వైదేహి: తన్ని తరిమేస్తాను. ఎదురు తిరిగితే అడ్డంగా నరికి పాతరేస్తాను.
జ్వాల: కానీ మోక్షకి మేఘనతో పెళ్లి చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు అత్తయ్య.
మేఘన: మనసులో.. కొంపముంచేశావ్ అన్నయ్య.. 
జ్వాల: ఏంటి అందరూ నన్ను అలా చూస్తున్నారు. మోక్ష ఓ ప్రేమ పిచ్చోడు. పంచమిని పంపించేసి మోక్షని అలాగే వదిలేయండి. 
వైదేహి: ఏమైంది జ్వాల నీకు. మోక్ష, మేఘన మంచి జోడీ వాళ్లకి పెళ్లి చేయమని నువ్వే కదా చెప్పావ్.
జ్వాల: నేనా ఛీఛీ నేనెప్పుడు చెప్పాను.
శబరి: పూటకు ఒక మాట మార్చే ఇలాంటి వారిని పట్టుకుంటే కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్లే. 
వైదేహి: నాకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు. మేఘన నువ్వు ఇక్కడే ఉంటున్నావ్ వీలైనంత త్వరగా నీ పెళ్లి చేస్తాను. 
శబరి: మేఘన నువ్వు అనవసరంగా లేనిపోని ఆశలు పెట్టుకోవద్దు అమ్మ. 

మరోవైపు జ్వాలని చిత్ర, వరుణ్, భార్గవ్‌లు ప్రశ్నిస్తారు. అయితే జ్వాల తాను క్లారిటీగా ఉన్నాను అని మీరే  హాస్పిటల్‌లో చూపించుకోండి అని చెప్తుంది. ఇక మోక్షని పక్కకు తోసి ఆస్తి తాము సొంతం చేసుకోవాలి అని నలుగురు ప్లాన్ చేస్తారు. మరోవైపు పంచమి తన తల్లిని ఎదురించిన మాటలు తలచుకొని మోక్ష హ్యాపీగా ఫీలవుతాడు. పంచమి అప్పుడే స్నానం చేసి వస్తుంది. మోక్ష పంచమి దగ్గరకు వెళ్లి పంచమిని రెడీ చేస్తాడు. పంచమి సిగ్గు పడుతుంది. పంచమి తలలో మళ్లెపూలు పెడతాడు. చాలా అందంగా ఉన్నావని ప్రతీ రోజు కొత్తగా కనిపిస్తున్నావు అని అంటాడు. 

మోక్ష: పంచమి నువ్వు నాకోసమే పుట్టావు. నాతోనే ఉంటావు. ఇది ఫిక్స్ పంచమి. అందుకే మన లైఫ్ ఎన్ని మలుపులు తిరిగినా చివరకు ఒక్క దగ్గరకు చేరాం.
పంచమి: ఇదే చివరి దశ కాదు మోక్షాబాబు. ముందు ముందు ఎన్నో అంతు చిక్కని మార్పులు ఉంటాయి. మనం కలిసి అనుభవించింది చాలా తక్కువ కాలం. అందులో ఎన్నో అనుభవించాం. మళ్లీ కలుస్తామో లేదో అనుకున్నాం.
మోక్ష: అన్నీ దాటి వచ్చేశాం పంచమి. మనల్ని భయపెట్టిన ప్రతీ ఘటన మనకు ఇప్పుడు ఒక జ్ఞాపకం మాత్రమే. 
పంచమి: కొత్త కొత్తవి పుట్టుకొస్తాయి. రానున్న కాలంలో ఏం జరుగుతాయో మనకు తెలీదు కానీ అన్నింటికి సిద్ధంగా ఉండాలి. 
మోక్ష: నాకు నువ్వు నీకు నేను అంతే.. అంటూ హగ్ చేసుకుంటాడు. ఇక పంచమిని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుంటాడు. 
పంచమి: మోక్షాబాబు ఎంత పని చేశారు. నేను విషకన్యని అని మర్చిపోయారా.. 
మోక్ష:  ఏమైంది పంచమి. ముద్దు కూడా పెట్టుకోకూడదా.
పంచమి: నా భయాన్ని నిజం చేశారు. తొందర పడి తప్పు చేశారు. మీ పెదాలు రంగు మారిపోతున్నాయి మోక్షాబాబు.

పంచమి పంచమి అంటూ మోక్ష కళ్లు తిరిగి పడిపోతాడు. పంచమి ఏడుస్తుంది. ఫణేంద్ర అయితేనే కాపాడగలడు అని పంచమి ఆలోచిస్తుంది. త్వరగా ఏదో ఒకటి చేయాలి అని లేదంటే ఘోరం జరిగిపోతుంది అని పంచమి పరుగులు తీస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: నాగచైతన్య, సాయిపల్లవి వాలంటైన్స్ డే విషెస్, ‘సేవ్ ది టైగర్స్ సీజన్ 2’ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
New Maruti Dzire: ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
New Maruti Dzire: ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
Best Selling Smartphones: 2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Embed widget