Naga Panchami December 30th Episode - ‘నాగపంచమి’ సీరియల్: పంచమిని ఇంట్లోంచి వెళ్లగొట్టిన వైదేహి – తన ప్రాణమే పోయిందన్న మోక్ష
Naga Panchami Serial Today Episode: పంచమిని తిట్టి ఇంట్లోంచి వెళ్లగొడుతుంది వైదేహి. విషయం తెలియడంతో తన ప్రాణం పోయిందని మోక్ష బాధపడతాడు. ఇలాంటి మలుపులతో బిగ్ ట్విస్టులతో ఇవాళ్టీ ఎపిసోడ్ జరిగింది.
Naga Panchami Telugu Serial Today Episode: మోక్ష పంచమిని వెతుక్కుంటూ వస్తాడు. అందరూ హాల్లో నిలబడి చర్చించుకుంటుంటారు. పంచమి ఎక్కడుందని కనిపించడం లేదని వైదేహిని అడుగుతాడు మోక్ష. పంచమిని నువ్వు ఇక మర్చిపోవాలని తను ఇక రాదని అంటుంది వైదేహి. దీంతో కోపంగా మోక్ష, వైదేహిని తిట్టి ఇంట్లో పంచమిని పిలుస్తూ వెతుకుతాడు. ఎక్కడా పంచమి కనిపించకపోవడంతో మళ్లీ వైదేహి దగ్గరకు వచ్చి
మోక్ష: అమ్మా ఏమైంది పంచమి కనిపించడం లేదు.
వైదేహి: పంచమి ఇంకెప్పటికీ రాదు. నువ్వు కూడా పంచమిని శాశ్వతంగా మర్చిపో
అని వైదేహి కోపంగా చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. పంచమి ఎక్కడో అడవిలో నడుచుకుంటూ ఏడుస్తూ వెళ్తుంది. వెళ్తూ వెళ్తూ రాత్రి వైదేహి అన్న మాటలు గుర్తు చేసుకుంటుంది.
వైదేహి: మోక్ష నిన్ను నెత్తిన పెట్టుకుని చూస్తున్నాడని ఇంతకాలం నేను చూసి చూడనట్లు ఉన్నాను. ఈరోజుతో తేటతెల్లం అయిపోయింది. మా మోక్ష కూడా నిన్ను బలవంతంగా మోస్తున్నాడని ఎవ్వరినీ పల్లెతు మాట కూడా అనని మా మోక్ష ఈరోజు ఒక ఆడపిల్ల మీద చెయ్యి చేసుకున్నాడంటే.. దానికి కారణం నువ్వే వాణ్ని ఎంతగానో రాచి రంపాన పెట్టి నరకాన్ని చూపించి మా మోక్షని ఒక రాక్షసుణ్ని చేశావు. నిన్ను ఇలాగే వదిలేస్తే వాణ్ని మాకు దక్కకుండా చేస్తావు. ఇక వెంటనే నువ్వు మా ఇంట్లోంచి వెళ్లిపో
అంటూ వైదేహి వార్నింగ్ ఇవ్వడంతో..
పంచమి: మోక్ష బాబు కోపంతోనో ధ్వేషం తోనో నన్ను కొట్టలేదు.
వైదేహి: మరి ఎందుకు కొట్టాడు. ప్రేమ ఎక్కువై కొట్టాడా?
పంచమి: అంతకన్నా ఎక్కువే అని నిన్ను నమ్మించలేను ( అంటూ మనసులో అనుకుంటుంది పంచమి)
వైదేహి: నాకొడుకు ఎంత మంచి వాడైనా వాడు ఉప్పు కారం తినే మగాడు. ఏవో మాయమాటలతో నువ్వు వాణ్ని దగ్గరకు రానివ్వకపోతే ఇలాగే జరుగుతుంది. నీకున్న కారణాలు మాకనవసరం మావాడు నీతో సుఖంగా లేడు. అందుకే మీరింత కాలం మమ్మల్ని మభ్యపెడుతూ వచ్చారు. ఇక వాడిలో సహనం నశించి చుట్టూ ఎవరున్నారో చూసుకోకుండా వాడి వ్యక్తిత్వాన్ని కూడా చంపుకుని నీమీద చెయ్యి చేసుకున్నాడు.
పంచమి: మోక్ష బాబు నన్ను కొట్టిన కారణం వేరు. మా మధ్య ఉన్నది ఎవరో తెంచేస్తే తెగిపోయే బంధం కాదు. మేమిద్దరం ఒకరికోసం ఒకరం త్యాగం కోసం పోటీ పడే వాళ్లమే కానీ విడిపోవడానికి గొడవపడే వాళ్లం కాదు. మమ్మల్ని అర్థం చేసుకోండి.
అనగానే వైదేహి కోపంగా నా కొడుకు సంతోషంగా లేడు. నువ్వు వెళ్లిపో లేదంటే నీకే నష్టం అంటూ వైదేహి ఇచ్చిన వార్నింగ్‌ను గుర్తు చేసుకుని పంచమి ఏడుస్తూ అడవిలో నడుస్తూ వెళ్తుంది. మరోవైపు అందరూ హాల్లో డల్‌గా కూర్చోవడం చూసిన మోక్ష వాళ్ల నాన్న ఏంటి అందరూ డల్ గా ఉన్నారని అడుగుతే ఎవ్వరూ పలకరు. పంచమి ఎక్కడని మోక్షని అడుగుతే మోక్ష కూడా పలకడు. ఇంతలో అక్కడకు వైదేహి వచ్చి పంచమి లేదని తనను నేనే ఇంట్లోంచి పంపించి వేశానని. తను ఎప్పటికి రాదని చెప్తుంది. దీంతో మోక్ష లేచి వెళ్లిపోతుంటే వైదేహి మోక్షను ఆపి నువ్వు వెళ్లి తీసుకొస్తావని నాకు ముందే తెలుసు అందుకే పంచమితో ఎప్పటికి ఎవ్వరికీ కనిపించకూడదని మాట తీసుకున్నాను అంటుంది వైదేహి. దీంతో ఇంట్లో వాళ్లు వైదేహిని తిడతారు.
మోక్ష: నేను బాధపడుతున్నాను అని మీకెవరికైనా చెప్పానా?
వైదేహి: ఆ విషయం నీ ముఖమే చెప్తుంది మోక్ష. బిడ్డ ఆకలి తల్లికి చెప్పక్కర్లేదు. అలాగే పంచమితో నువ్వు సంతోషంగా లేవని తెలిసి నేను పంచమిని పంపించేశాను.
మోక్ష: నా సంతోషమే పంచమి అమ్మా.. తను లేకపోతే నా జీవితం శూన్యం. ఇంక నీ కన్నకొడుకు నీ కళ్ల ముందే ఉన్నాడంటే అది పంచమి పుణ్యమే తను నా పక్కన లేకుండ ఉంటే నేను ఎప్పుడో చనిపోయి ఉండేవాణ్ని. నువ్వు పంపంచేసింది పంచమిని కాదమ్మా.. నా ప్రాణాన్ని.
అంటూ మోక్ష ఏడుస్తూ లోపలికి వెళ్లిపోతాడు. దీంతో ఇంట్లో వాళ్లందరూ వైదేహిని తిడుతూ నువ్వు అన్యాయం చేసింది మోక్షకే కాదు ఒక అమ్మాయి జీవితానికి కూడా అంటారు. అందరూ తలో మాట అని వెళ్లిపోతారు. అందరం కలిసి పంచమికి ఏమీ కాకూడదని దేవుణ్ని వేడుకోవాలని చెప్తారు. మరోవైపు పంచమి అడవిలో ఏడుస్తూ వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read : ‘హాయ్ నాన్న’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్, స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడో తెలుసా?