అన్వేషించండి

Hi Nanna OTT Release: ‘హాయ్ నాన్న’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్, స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడో తెలుసా?

Hi Nanna OTT Release: నాని తాజా చిత్రం 'హాయ్ నాన్న' ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతోంది. కొత్త సంసత్సరంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Hi Nanna OTT Release Date Lock: నేచురల్ స్టార్ నాని, ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాగూర్ నటించిన రీసెంట్ మూవీ ‘హాయ్ నాన్న’. నూతన దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 7న థియేటర్లలో విడుదల అయ్యింది. ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ, తండ్రీ కూతుర్ల మధ్య బాండింగ్ అలరించింది. నాని కెరియర్ లోనే బెస్ట్  ఫీల్ గుడ్ మూవీగా నిలిచింది. నాని కూతురుగా నటించిన కియారా ఖన్నా, చక్కటి నటనతో ఆకట్టుకోగా, నాని, మృణాల్ బెస్ట్ పర్ఫామెన్స్ తో ఆడియన్స్ చేత కంటతడి పెట్టించారు.  

జనవరి 4 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ‘హాయ్ నాన్న’ స్ట్రీమింగ్

థియేటర్లలో విడుదలై ఆడియెన్స్ ను ఎంతగానో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి అడుగు పెట్టబోతోంది. 'హాయ్ నాన్న' డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా కోసం నెట్ ఫ్లిక్స్ ఏకంగా రూ. 37 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. జనవరి 4 నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మళయాలంతో పాటు హిందీలోనూ విడుదలకానుంది.

ఓవర్సీస్ లో ‘నాని’ సరికొత్త రికార్డు

ఇక ‘హాయ్ నాన్న’ సినిమా వసూళ్ల పరంగానూ సత్తా చాటింది. ఓవర్సీస్ లో వీకెండ్ పూర్తవక ముందే మిలియన్ మార్క్ దాటింది.  టైర్ 2 హీరోల్లో ఎక్కువ సార్లు ఓవర్సీస్ మార్కెట్ దగ్గర 1 మిలియన్ మార్క్ అందుకున్న హీరోగా నాని సరికొత్త రికార్డ్ క్రేయేట్ చేశాడు. ఈ సినిమాతో కలిపి మొత్తం నాని నటించిన తొమ్మిది సినిమాలు ఈ ఘనతను సాధించడం విశేషం. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.  

'సరిపోదా శనివారం' షూటింగ్ లో నాని బిజీ

ఇక ఈ ఏడాది ‘దసరా’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు నాని. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. ఇక ‘హాయ్ నాన్న’ సినిమాలతో రెండో విజయాన్ని అందుకున్నారు. నాని ప్రస్తుతం 'సరిపోదా శనివారం' అనే సినిమా చేస్తున్నారు.. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాని వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Read Also: అసలే నెగెటివిటీ, ఇప్పుడో బూతు పాట - ఇప్పుడు చీప్‌గా అనిపించడం లేదా త్రివిక్రమ్? అప్పటి కామెంట్స్ మరిచారా?

టాప్ హెడ్ లైన్స్

MegaVerse Teaser : ఇది నా అడ్డా... CHIRA'N'JEEVI - మెగాస్టార్ టాక్ షో మెగావర్స్ టీజర్ వచ్చేసింది
ఇది నా అడ్డా... CHIRA'N'JEEVI - మెగాస్టార్ టాక్ షో మెగావర్స్ టీజర్ వచ్చేసింది
Mookuthi Amman2 OTT : ఓటీటీలోకి నయనతార మహాశక్తి - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి నయనతార మహాశక్తి - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Srimathi Movie Trailer : ఒకే ఒక్క ప్రశ్న... ఆలోచింపచేసే ట్రైలర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తోన్న నివేదా 'శ్రీమతి'... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఒకే ఒక్క ప్రశ్న... ఆలోచింపచేసే ట్రైలర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తోన్న నివేదా 'శ్రీమతి'... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Ramayana Part 1 OTT : ఓటీటీలోకి రామాయణ పార్ట్ 1 - మైథలాజికల్ ఎపిక్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి రామాయణ పార్ట్ 1 - మైథలాజికల్ ఎపిక్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trainee IPS Harassment Case: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ట్విస్ట్.. ఏ2గా సోదరుడు ప్రణయ్ పేరు చేర్చిన పోలీసులు
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ట్విస్ట్.. ఏ2గా సోదరుడు ప్రణయ్ పేరు
దేవ దీపావళి 2026: వారణాసిలో లేజర్, డ్రోన్ షోలతో 11 లక్షల దీపాల వెలుగులు!
దేవ దీపావళి 2026: వారణాసిలో లేజర్, డ్రోన్ షోలతో 11 లక్షల దీపాల వెలుగులు!
MIM Murtuza Pahalwan Murder: శంషాబాద్‌లో ఎంఐఎం నేత ముర్తుజ పైల్వాన్ దారుణ హత్య.. కత్తులతో 10 మంది మెరుపు దాడి!
శంషాబాద్‌లో ఎంఐఎం నేత ముర్తుజ పైల్వాన్ దారుణ హత్య.. కత్తులతో 10 మంది మెరుపు దాడి!
లాంచ్‌కు ముందే షోరూమ్‌లో దర్శనమిచ్చిన Bajaj Pulsar 125 Neon.. పాత క్లాసిక్ లుక్‌తో అదరగొడుతున్న బైక్!
తక్కువ ధరలో కొత్త పల్సర్ 125 వస్తోందా? లాంచ్‌కు ముందే కనిపించిన Bajaj Pulsar 125 Neon
Contaminated Drinking Water : కలుషితమైన నీరు తాగుతున్నారా? కిడ్నీలు, లివర్‌పై ప్రభావం ఎలా ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
కలుషితమైన నీరు తాగుతున్నారా? కిడ్నీలు, లివర్‌పై ప్రభావం ఎలా ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
కార్తీక పౌర్ణమి 2026: ఇంటి పైకప్పుపై ఆకాశ దీపం.. పితృ మోక్షం, శ్రేయస్సు
కార్తీక పౌర్ణమి 2026: ఇంటి పైకప్పుపై ఆకాశ దీపం.. పితృ మోక్షం, శ్రేయస్సు
Nvidia CEO జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. ఒక్కరోజులో 31శాతం పెరిగిన షేర్ల విలువ, AI స్టాక్స్‌ భారీ ర్యాలీ
Nvidia CEO జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. ఒక్కరోజులో 31శాతం పెరిగిన షేర్ల విలువ
Renigunta Temple Removal: రేణిగుంట ఆలయ తొలగింపుపై భూమన ఆరోపణలు అవాస్తవం.. భక్తుల మనోభావాలను రెచ్చగొడుతున్నారు: మంత్రి ఆనం
రేణిగుంట ఆలయ తొలగింపుపై భూమన ఆరోపణలు అవాస్తవం.. భక్తుల మనోభావాలను రెచ్చగొడుతున్నారు: మంత్రి ఆనం
Embed widget