Naga Panchami Serial Today December 18th Episode: 'నాగ పంచమి' సీరియల్ - మోక్షని కాటేసి చంపేయ్, పంచమి పాముగా మారితే తనతో బిడ్డను కను: ఫణేంద్రతో నాగదేవత!
Naga Panchami Today Episode పంచమి పాముగా మారిన తర్వాత తనతో పిల్లల్ని కనాలని నాగదేవత ఫణేంద్రకు చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Naga Panchami Serial Today Episode
పంచమి: మిమల్ని కాటేసి చంపే బాధ్యత నా నుంచి నాగదేవత తీసేసుకుంది. మీరు ఊహించుకున్నట్లే ఏ క్షణం అయినా మిమల్ని చంపాలి అని నిర్ణయం తీసుకుంది. కాళ్ల మీద పడి వేడుకోవడంతో రానున్న ముక్కోటి ఏకాదశి వరకు మీకు ప్రాణ భిక్ష పెట్టింది. ముక్కోటి ఏకాదశి ముందు రోజు వరకు నాకు అవకాశం ఇవ్వండి. నేను గెలిస్తే చరిత్ర అవుతుంది. నేను ఓడిపోతే నాగ దేవతతో పోరాడిన ఘనత అవుతుంది.
మోక్ష: సరే పంచమి నా చావునైనా నా ఇష్ట ప్రకారం జరిగే అవకాశం ఇవ్వు. ఏ పాము చేతిలోనో చావడం నాకు ఇష్టం. నా చివరి క్షణం నీ ఒడిలో కన్ను మూసే అవకాశం ఇవ్వు.
పంచమి: నేను మాటిస్తే ఒప్పుకోవడమే మోక్షాబాబు. నేను గెలవాలి అని కోరుకోండి.
నాగదేవత: నేనొక నిర్ణయానికి వచ్చాను యువరాజా.. ఇక మీదట తనలో ఏదైనా మార్పు వస్తుంది అని ఆశ పడటం వృథా ప్రయాసే అవుతుంది. మోక్ష మీద పరితాపం తప్ప యువరాణిలో అనువంత కూడా పశ్చాత్తాపం లేదు. ఒకరి పగ మరొకరు తీర్చుకోవడం మన నాగలోక నియమాలకు వ్యతిరేకం. అయినా మరో మార్గం లేక అలాంటి నిర్ణయానికి రావాల్సి వచ్చింది. మోక్షని మన యువరాణి కాటేసి చంపదు అని నిర్థారణ అయింది. అందుకే ఆ బాధ్యత నీకు అప్పగిస్తున్నా యువరాజా.. మోక్షని నువ్వే కాటేసి చంపేయాలి యువరాజా. ఇదే ప్రత్యక్షంగా పరోక్షంగా యువరాణికి చెప్పి వచ్చాను. వచ్చే ముక్కోటి ఏకాదశి రోజున నువ్వు మోక్షని కాటేసి చంపాలి యువరాజా. ఇక యువరాణికి నాగలోక ప్రవేశం లేదు.
ఫణేంద్ర: అప్పుడు నాగలోకం రాణి లేకుండా ఉంటుంది కదా మాతా. అది అంత శ్రేయస్కరం కాదు కదా.
నాగదేవత: నిజమే యువరాజా. రాణి వంశానికి మరో సంతానం లేదు. కేవలం రాణులు మాత్రమే పీఠం మీద కూర్చొని పరిపాలించడం తరతరాలుగా నాగలోక ఆచారం. ఇంతవరకు ఈ లోకానికి ఇలాంటి విపత్కర పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదు.
ఫణేంద్ర: ఇప్పుడు అలాంటి సమస్య ఎదురైంది కాబట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి మాతా. ఎక్కువ కాలం రాణి పీఠం అలా ఉంచడం అంత మంచిది కాదు.
నాగదేవత: నాగలోకం ఆరాధించే నాగమణిని తాకే శక్తి ఒక్క నాగలోక రాణులకు తప్ప మరోకరికి ఉండదు. ఈలోకానికి శక్తిని ఇచ్చేదే నాగమణి. పుష్కరానికి ఒకసారి నాగమణిని తీసుకెళ్లి.. పౌర్ణమి నాడు నిండు చంద్రుడి వెన్నెల కాంతుల్లో పెట్టి పూజలు జరిపించాలి. అప్పుడే ఆ నాగమణికి అన్ని శక్తులు సంక్రమిస్తాయి. ఇవన్నీ రాణి వంశస్తుల చేతుల మీదగానే జరగాలి. అలా జరగకపోతే ఆ నాగమణి శక్తి హీమమై నాగలోకమే అంధకారం అయిపోతుంది.
ఫణేంద్ర: ఇంత ముఖ్యమైన రాణి పీఠం ఖాళీగా ఉంచాలి అంటే నాగవంశం, నాగలోకం అంతమైపోతుంది కదా మాతా. మరేమైనా మార్గం ఉంటే చెప్పండి మాతా.
నాగదేవత: ఒకే ఒక మార్గం ఉంది. కానీ అది ఎంతవరకు జరుగుతుందో నాకు తెలీదు. అయితే ఆ కార్యం నువ్వే చేయాలి. నువ్వు భూలోకంలో ఉండే యువరాణి పాముగా మారిన సమయంలో నువ్వు యువరాణి కలిసి ఒక బిడ్డకు జన్మనివ్వగలిగితే అది సాధ్యమవుతుంది. మీ ఇద్దరికి పుట్టే బిడ్డకు రాణి వంశస్తుల రక్తం సంక్రమిస్తుంది. ఈ పీఠం మీద కూర్చొనే హక్కు అధికారం ఆ బిడ్డకు ఉంటుంది. అది సాధ్యమేనా అని ఆలోచించు. యువరాణి పాముగా మారినప్పుడు మాత్రమే తన మనసు మార్చే ప్రయత్నం చేయగలవు. మోక్ష భార్యగా మానవకాంతగా ఉన్నంత వరకు నువ్వు తనని తాకడం కూడా కష్టమే.
ఫణేంద్ర: మోక్ష ప్రాణాలతో ఉన్నంత వరకు యువరాణి ఎవరి మాటా వినదు మాతా. మొదట మోక్షని కాటేసి చంపిన తర్వాత మీరు చెప్పిన దాని కోసం ఆలోచిస్తా.
నాగదేవత: సరే యువరాజా. ఉన్న ఒక్క అవకాశం గురించి చెప్పాను. అలాగే వచ్చే ముక్కోటి ఏకాదశి రోజున మోక్షని కాటేసి చంపే బాధ్యత కూడా నీకే అప్పగించాను.
మరోవైపు కరాళి తన ఆశ్రమంలో కొత్తగా మారిన రూపం చూసుకొని మురిసిపోతుంది. ఈ సారి తాను మేఘనలా మోక్షని తన వశం చేసుకుంటానని శపథం చేస్తుంది. ఇక తర్వాత తన అన్న ఆత్మని రప్పిస్తుంది. ఇక ఆలస్యం చేస్తే తన భౌతికకాయం పాడవుతుందని నంబూద్రీ చెప్తాడు. ఇక ఈసారి నాగమణితోనే తాను నంబూద్రీని కలుస్తాను అని కరాళి మాటిస్తుంది. ఇక కరాళి మోక్ష ఇంటికి ఫోన్ చేసి మోహినిలా వైదేహితో మాట్లాడుతుంది.
మోక్ష: అమ్మా మోహిని నంబూద్రీ చెల్లెలు అని చెప్తే తనని ఇక్కడ ఉండటానికి ఒప్పుకోను అనా నాతో అబద్ధం చెప్పావు. నాకు అన్నీ తెలుసు మమ్మీ. ఇప్పుడు నాకు నంబూద్రీ గారి మీద ఎలాంటి కోపం లేదు. తనకి మంత్ర శక్తులు ఉన్నాయని నీలాగే నేను నమ్ముతున్నాను.
చిత్ర: అక్క మనకు తెలీకుండా ఈ ఇంట్లో ఏవేవో జరిగిపోతున్నాయి. ఈ ఇంటి కోడళ్లుగా మనకు కొంచెం కూడా మర్యాద లేకుండా పోతుంది.
శబరి: ఏమైనా మోహిని చాలా మంచి అమ్మాయి. ఇంకా కొన్ని రోజులు మనతో ఉండాల్సింది.
మోక్ష: తను వెళ్లటం వలన నాకు చాలా నష్టం శబరి. తను చాలా తెలివి అయిన అమ్మాయి. పాముల మీద తనకు చాలా జ్ఞానం ఉంది. తను నా పక్కన ఉండుంటే నా రీసెర్చ్ విషయంలో నాకు చాలా ఉపయోగపడేది.
ఇక చిత్ర, జ్వాలలు మోహిని వెళ్లిపోయింది అని తమ భర్తలు చాలా బాధపడుతున్నారని సెటైర్లు వేస్తారు. తర్వాత ఇద్దరూ తమ గదికి వెళ్లి చూసే సరికి అక్కడ క్షుద్ర పూజలు జరిగినట్లు గుర్తిస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read : విన్నర్ నేనే, నాకు తెలుసు - ‘బిగ్ బాస్’పై శివాజీ షాకింగ్ కామెంట్స్