Naga Panchami Serial Today April 4th: 'నాగ పంచమి' సీరియల్: ఫణేంద్ర వర్సెస్ నాగేశ్వరి, హెచ్చరించిన నాగదేవత.. పంచమి బిడ్డను చంపేయాలనుకున్న జ్వాలా టీమ్!
Naga Panchami Serial Today Episode పంచమికి హాని తలపెడుతున్నాడని ఫణేంద్రను నాగదేవత శపించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Naga Panchami Today Episode పంచమిని బయటకు తీసుకెళ్లినందుకు మోక్షకు వైదేహి కోపమవుతుంది. ఇక పంచమికి బిడ్డ పుట్టే వరకు బయటకు వెళ్లొద్దని చెప్తుంది. రఘురాం పంచమితో మీ అత్తయ్య చెప్పినట్లు చేయమని చెప్తాడు. వాళ్ల ప్రేమలను చూసి జ్వాల, చిత్రలు కుళ్లుకుంటారు. వెటకారంగా మాట్లాడుతారు. శబరి, మీనాక్షి చిత్ర, జ్వాలలకు చురకలు వేస్తారు. ఇక శబరి పంచమిని బయటకు రావొద్దని చెప్తుంది. ఇక వీడియో మిసింగ్ గురించి చిత్ర, జ్వాల, భార్గవ్, వరుణ్‌లు ఆలోచిస్తూ ఉంటారు. వీడియో డిలీట్ అవ్వడం వెనుక ఎవరో ఉన్నారు అని తమని ఎవరో కనిపెడుతున్నారు అని అనుకుంటారు. పంచమిని ఇలాగే వదిలేస్తే తమని ఇంటి నుంచి గెంటేస్తుంది అని భయపడతారు. ఏదో ఒకటి చేసి పంచమికి బిడ్డ పుట్టకుండా చేయాలి అనుకుంటారు.
నాగేశ్వరి: నాగదేవతని ప్రసన్నం చేసుకుంటుంది. మాతా నా శక్తికి మించి బాధ్యతలు మోస్తున్నా. ఇక్కడి పరిస్థితులు నాకు ఆందోళన కలిగిస్తున్నాయి. మన మహారాణి కోరిక తీర్చడం అసాధ్యం అనిపిస్తుంది మాత. పంచమికి ఇంట్లో శత్రువులతో పాటు ఆ మహా మాంత్రికురాలు కరాళి పోరు ఎక్కువ అయింది. దానికి తోడు యువరాజు ఫణేంద్ర కరాళితో చేతులు కలిపి దాడికి పాల్పడుతున్నాడు. పంచమి కడుపులో పెరుగుతున్న మహారాణిని కాపాడటం నాకు కష్టతరంగా మారింది.
నాగదేవత: నీ నాగశక్తిని ఇంకా శక్తి వంతం చేస్తాను నాగేశ్వరి. నువ్వు ఎలా అయినా ఈ కార్యం నెరవేర్చాలి. మళ్లీ మహారాణి పుట్టి నాగలోకం రానుంది అని అంతా సంతోషంగా ఉన్నారు. ఈ అవకాశం పోతే ఇక శాశ్వతంగా నాగలోకానికి రాని లేకుండా పోతుంది. అంతా నీ చేతుల్లో ఉంది.
నాగేశ్వరి: అయితే ఓ పని చేయండి మాతా. ఫణేంద్రని కట్టడి చేస్తే నాకు ఓ శత్రువు తగ్గుతాడు.
నాగదేవత: కట్టడి చేయడం కాదు అది ఎవరైనా తప్పునకు తగిన శిక్ష అనుభవిస్తారు. నేను ఫణేంద్రని కనిపెట్టుకుంటూ ఉంటా. తన కార్యాలు నాగలోకం నియమాలకు విరుద్ధంగా ఉంటే అక్కడికి అక్కడే శిక్ష విధిస్తాను. అందులో ఎలాంటి సందేహం లేదు.
నాగేశ్వరి: అలాగే మాత. ఇక నేను కరాళిని ఎదుర్కొవాలి అంటే నాకు ఇంకా శక్తి కావాలి మాతా
నాగదేవత: ఇప్పుడే నీ శక్తిని రెండింతలు చేస్తా అని శక్తి ప్రసాదిస్తుంది.
పంచమి డల్‌గా ఉంటే మోక్ష దగ్గరకు తీసుకొని ఇంకా ముంగిసల గురించే ఆలోచిస్తున్నావా అని అంటాడు. దానికి పంచమి ముంగిసల దాడి యాదృశ్చికం అయితే ఓకే కానీ ఇంకేమైనా అయితే ఆలోచించాలి అంటుంది. ఇక మోక్ష పంచమికి ధైర్యం చెప్తాడు. సైన్స్ డెవలప్ అవుతుంది. ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుందని అంటాడు. ఇక పంచమిని ప్రశాంతంగా ఉండమని చెప్తాడు. ఇక కరాళి గురించి పంచమి భయపడితే తన గురించి నేను చూసుకుంటా అని మోక్ష అంటాడు. దాంతో భయపడిన పంచమి కరాళి జోలికి వెళ్లొద్దని అంటుంది. ఇక పంచమి మోక్ష గుండెలపై పడుకుంటుంది. మరోవైపు నాగేశ్వరి పాము, ఫణేంద్ర పాము ఒకదానికి మరొకటి బుసలు కొట్టుంటాయి.
నాగేశ్వరి: యువరాజా. నామీద దాడి చేయడం మీకు న్యాయం కాదు.
ఫణేంద్ర: నువ్వేంటి నాకు నీతులు చెప్పేది నా మీదకు దాడి చేసిన నిన్ను ఈ రోజు చంపేతీరుతాను.
నాగేశ్వరి: మీకు దండం పెడతా యువరాజా..మీరు ఆ కరాళితో చేరి మనసు పాడు చేసుకున్నారు. ఆ నంబూద్రీ, కరాళి మనకు శత్రువులు. మీరు వాళ్లతో చేతులు కలపడం అంటే నాగలోకానికి ద్రోహం చేయడమే.
ఫణేంద్ర: యువరాణి నన్ను మోసం చేసింది. అమెను బతకనివ్వను.
నాగేశ్వరి: నాలో ప్రాణం ఉన్నంత వరకు అలా జరగనివ్వను ఫణేంద్ర. యువరాణిని కాపాడుకోవడానికి నేను కూడా ఎంతకైనా తెగిస్తాను.
ఫణేంద్ర: సరే అదే చూద్దాం. ఈరోజు నేను చనిపోవడమో నువ్వు చనిపోవడమే జరగాలి.
నాగేశ్వరి: నేను చనిపోతే నిన్ను నాగలోకం వదలదు ఫణేంద్ర. కానివ్వు చూసుకుందాం. అని ఇద్దరూ పాములుగా మారి గొడవ పడతారు. ఇంతలో నాగదేవత ప్రత్యక్షమవుతుంది. నాగేశ్వరికి తగిలిన గాయాలు మాన్పుతుంది. ఫణేంద్రని కోపంగా చూస్తుంది.
నాగదేవత: నాగేశ్వరి కాపాడమంటే ప్రత్యక్షమయ్యాను. తనతో పోరాడాల్సిన అవసరం నీకు ఏముంది.
ఫణేంద్ర: నేను యువరాజు అని మర్చిపోయి నాతో గొడవకు దిగింది మాతా.
నాగేశ్వరి: అబద్ధం మాతా మన యువరాణికి ద్రోహం తలపెట్టాడు. అందుకు నేను అడ్డు వచ్చాను అని నన్ను చంపాలి అని ప్రయత్నిస్తున్నాడు.
నాగదేవత: నీ ప్రవర్తన నాగలోకానికి అవమానం తెచ్చేలా ఉంది ఫణేంద్ర. అది క్షమించరాని నేరం. యువరాణిని శిక్షించే అధికారం నీకు లేదు. నీకు అప్పగించిన పని మాత్రమే నువ్వు చేయాలి. యువరాణి తప్పు చేస్తే నాగలోకం చూసుకుంటుంది. నువ్వు చేసిన తప్పునకు మరణ దండనే నీకు సరైన శిక్ష.
ఫణేంద్ర: నన్ను క్షమించండి మాతా.
నాగదేవత: యువరాజువి కాబట్టే నీ క్షమాపణ మన్నిస్తున్నాను. ఇక నీకు నాగలోకంలోకి వచ్చే అవకాశం లేదు. భూలోకంలో పడి నీ పాట్లు నువ్వు పడు.
నాగేశ్వరి: క్షమించండి మాతా ఇంకా పెద్ద శిక్ష వేయండి లేదంటే ఆ కరాళితో కలిసి యువరాణికి హాని చేస్తాడు.
నాగదేవత: మళ్లీ అలాంటి తప్పు పునరావృతం అయితే అక్కడికి అక్కడే మరణ శిక్ష వేస్తాను. నాగేశ్వరి యువరాణికి గానీ తన కడుపులో పెరుగుతున్న మహారాణికి నువ్వే రక్షణగా ఉండాలి. యువరాణి దగ్గరే ఉండి ఆ బిడ్డను నాగలోకం చేర్చాల్సిన బాధ్యత నీదే నాగేశ్వరి. మళ్లీ తప్పు చేసి ప్రాణం మీదకు తెచ్చుకోకు ఫణేంద్ర.
ఫణేంద్ర: నేను ఇప్పుడు స్వేచ్ఛా జీవిని ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. నన్ను ఎవరూ ఆపలేరు.
మరోవైపు జ్వాల అండ్ బ్యాచ్ మీటింగ్ పెట్టుకుంటారు. వీడియో గురించి ఆలోచిస్తారు. పంచమినే అలా చేసుంటుంది. పంచమికి ప్రెగ్నెన్సీ లేదని కావాలనే మాయ చేస్తుందని అనుకుంటారు. ఇక ఫణేంద్ర అక్కడికి వస్తాడు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.