అన్వేషించండి

Naga Panchami Serial Today April 2nd: 'నాగ పంచమి' సీరియల్: పంచమిపై ముంగిసల దాడి, అన్నావదినలపై మోక్ష విశ్వరూపం.. షాకైన కరాళి!

Naga Panchami Serial Today Episode పంచమి కడుపులో పెరుగుతున్నది నాగలోక మహారాణి అని నాగేశ్వరి కారళితో చెప్పడంతో ఇవాళ్లి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Naga Panchami Today Episode కరాళి ప్రయోగించిన ముంగిసలు మోక్ష ఇంట్లోకి చేరుకొని నాగేశ్వరి పామును వెంబడిస్తాయి. కొన్ని ముంగిసలు పంచమి కూడా పాము అని గ్రహించి పంచమి మీద కూడా దాడి చేస్తాయి. మోక్ష వాటి నుంచి పంచమికి కాపాడుకుంటాడు. ఇక నాగేశ్వరి పాము బయటకు వెళ్లడంతో ముంగిసలు పాము వెనకాలే బయటకు వెళ్లిపోతాయి. నాగేశ్వరి పాము ఎదురు దాడి చేసి ఆ ముంగిసలను చంపేస్తుంది. ఇక కారళి తన దివ్య దృష్టితో వాటిని కాల్చేస్తుంది. నాగేశ్వరి మనిషిగా మారి ఇదంతా కరాళి పనే అని గ్రహించి ముందు కరాళి అడ్డు తొలగించాలి అనుకుంటుంది.   

జ్వాల: ఇప్పటి కూడా మీకు పంచమి ఎవరో అర్థం కాకపోతే మిమల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. 
చిత్ర: మనం ఇంతమంది ఉంటే ఆ ముంగిసలు మన ఎవరి మీద దాడి చేయలేదు. ఒక్క క్షణంలో పంచమి పాము అని గుర్తుపట్టేశాయ్. అది మీకే తెలీడం లేదు.
మోక్ష: షట్ అప్.. తనకి ఏమైనా అయిందేమో అని మేం వర్రీ అవుతుంటే ఫూలీష్‌గా మాట్లాడుతున్నారు మీకు మ్యానర్స్ ఉందా అసలు.
భార్గవ్: డోంట్ టాక్ రబ్బీష్ మోక్ష. ఎవిడెన్స్ ఉంది కాబట్టే మాట్లాడుతున్నాం. పంచమి మనిషి కాదు పామే.
మోక్ష: నువ్వు చూశావా.. నువ్వు చూశావా పాముని చెప్పు.. చెప్పు.. అంటూ భార్గవ్ మీదకు వెళ్తాడు. ఇంకోసారి నా భార్యని పాము అన్నారంటే మీరు ప్రాణాలతో ఉండరు. ఏం మాట్లాడుతున్నారు వాళ్లు. 
జ్వాల: వంద సార్లు అంటామ్. ఇప్పుడే నీ కళ్లు ముందు ఫ్రూవ్ చేస్తాం. అప్పుడేం చేస్తావ్.
రఘురాం: ఏయ్ జ్వాలా మీకు ఏమైనా పిచ్చి పట్టిందా.. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుసా.
భార్గవ్: తెలుసు నాన్న. వీళ్లు చెప్తుంటే ఇన్నాళ్లు మేం నమ్మలేదు కానీ మా కళ్లతో మేం చూశాక నమ్మకతప్పలేదు.
వైదేహి: ఏంట్రా మీరు చూసేది పంచమి పాముగా మారడం మీరు చూశారా.
చిత్ర: పంచమి బంధువు పాముగా మారడం నేను చూశాను అది వీడియో కూడా తీశాను. 
భార్గవ్: మన ఇంట్లో ఇవన్నీ మోక్షకు తెలిసే జరుగుతున్నాయి నాన్న. ఆ వీడియోలో మోక్ష కూడా ఉన్నాడు. 
వైదేహి: ఏంటి మోక్ష వీళ్లు చెప్పేది.
మోక్ష: అబద్ధం అమ్మ.
చిత్ర: నువ్వు నిజం ఒప్పుకో మోక్ష. నువ్వు పంచమి బంధువు అని చెప్పిన అతను మాట్లాడుకోవడం నేను వీడియో తీశాను. నీ కళ్లు ముందే అతను పాములా మారి వెళ్లిపోయాడు. నాగేశ్వరి అక్కడికి వస్తుంది. 
జ్వాలా: ఏ మోక్ష మాట్లాడవేం.
భార్గవ్: ఆ వీడియో తీసింది మన ఇంట్లో ఫంక్షన్ అప్పుడే వీడియో తీశాం కానీ సరైన సమయంలో బయట పెడదామని వెయిట్ చేశాం.
జ్వాల: మామయ్య ఆ వీడియో చూసే ముందు ఒక్క మాట అందులో ఉన్నది పంచమి బంధువు. మన మోక్షతో ఘర్షణ పడుతూ కనిపించాడు. ఆ వ్యక్తి పాము అయినప్పుడు పంచమి కూడా పామే.
చిత్ర: వీడియో చూసిన తర్వాత మనం ఏం చేయక్కర్లేదు అక్క పంచమి పాము అయిపోతుంది. మోక్ష ముఖం చూపించలేక ఫారిన్ చెక్కేస్తాడు.
భార్గవ్: చిత్ర వీడియో టీవీకి కనెక్ట్ చేయ్. బొమ్మ క్లారిటీగా ఉంటుంది. 

చిత్ర వీడియోని టీవీకి కనెక్ట్ చేయగానే వద్దు రా సోదరా పెళ్లంటే నూరేళ్ల మంటరా అంటూ నాగార్జున సాంగ్ వస్తుంది. చిత్ర వాళ్లు షాక్ అయిపోతారు. మోక్ష ఊపిరి పీల్చుకుంటాడు. ఫోన్‌లో ఎంత వెతికినా ఆ వీడియో ఉండదు. డిలీట్ అయిపోయింటుంది. అందరూ చిత్ర వాళ్లని కోపంగా చూస్తారు. వైదేహి చిత్రని గట్టిగా కొట్టి పంచమి గురించి మాట్లాడితే చంపేస్తా అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. జ్వాల, భార్గవ్‌లు కూడా చిత్ర మీద చిరాకు పడతారు. 

మోక్ష పంచమిని రూమ్‌కి తీసుకొస్తాడు. పంచమి ఏడుస్తుంది. తమకు పుట్టబోయే బిడ్డకు ఏమైనా అవుతుంది అని పంచమి భయపడుతుంది. తమ బిడ్డ కూడా నాగాంశతో పుడుతుందని అందుకే ముంగిసలు దాడి చేశాయని అంటుంది.

పంచమి: మనసులో నేను భయపడతాను అని మోక్షాబాబు పైకి ఏం చెప్పడం లేదు. నాలో ఉన్న అనుమానమే తనలోనూ ఉంది.
మోక్ష: పంచమి అనుమానమే నిజం అయితే నో అలా జరగకూడదు. ఆ విష లక్షణాలు నా బిడ్డ మీద పడకూడదు.
పంచమి: ఏం జరిగినా అది మనకు భగవంతుడి హెచ్చిరికలా చూడాలి మోక్ష బాబు. ఏదో ప్రమాదం పొంచి ఉందని గ్రహించాలి. కరాళి తన మంత్ర శక్తులతో ఇలాంటివి చాలా చేయగలదు. నేను అనుభవించాను కాబట్టి నాకు తెలుసు. నేను నా అనుమానమే చెప్పాను. అది నిజం అవ్వాలి అని లేదు.
మోక్ష: ఏమైనా తేడాగా ఉంటే మనకు ప్రెగ్నెన్సీ టెస్ట్‌లోనే తెలిసేది కదా నువ్వు ఏం ఆలోచించకు. ఇక మోక్ష పని ఉందని బయటకు వెళ్తా అంటే పంచమి గుడి దగ్గర దింపమని అడుగుతుంది.

మరోవైపు నాగేశ్వరి కరాళి దగ్గరకు వస్తుంది. మాయాజాల విద్యలతో  పంచమిని ఏం చేయలేవని నాగేశ్వరి కరాళిని అంటుంది. దీంతో కరాళి పంచమి నాగలోకం రాలేదు అని అంటుంది. యువరాణి ఎక్కడున్నా యువరాణే అని నేను తనకు రక్షణగా ఉంటానని అంటుంది. కరాళి కూడా తనని ఏం చేయలేవు అని నాగేశ్వరితో అంటుంది. నాగలోకం వెళ్లిపో లేకపోతే చంపేస్తా అని కరాళి నాగేశ్వరితో అంటుంది. పంచమి బిడ్డను చంపేస్తా అని అంటుంది. దీంతో నాగేశ్వరి పంచమి కడుపులో పెరుగుతున్నది మమూలు బిడ్డ కాదు మా నాగలోక మహారాణి విశాలాక్షి అని చెప్తుంది. దీంతో కరాళి షాక్ అయిపోతుంది. చనిపోయిన మహారాణి కూతురిగా పుట్టబోతుంది అని తనే నాగలోకానికి కాబోయే యువరాణి అని చెప్తుంది. మరోవైపు పంచమి, మోక్షలు గుడికి రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.  

Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్: కృష్ణ, ముకుందలకు పోటీగా మరో క్యారెక్టర్ ఎంట్రీ.. రావడం రావడమే రచ్చ చేసేసిన రజినీ!

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 17th:కోర్టులో వివేక్ మిశ్రాకు చుక్కలు చూపించిన జేడీ...కేసు ఓడిపోతే ఉద్యోగం వదిలేస్తానని ఛాలెంజ్‌
జగద్ధాత్రి సీరియల్: కోర్టులో వివేక్ మిశ్రాకు చుక్కలు చూపించిన జేడీ...కేసు ఓడిపోతే ఉద్యోగం వదిలేస్తానని ఛాలెంజ్‌
Karthika Deepam 2 Serial Today August 18th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న సూరజ్‌కి మనసులో మాట చెప్పేస్తుందా! సూరజ్ భర్త్‌డేకి మాలిని సందడేంటి?
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న సూరజ్‌కి మనసులో మాట చెప్పేస్తుందా! సూరజ్ భర్త్‌డేకి మాలిని సందడేంటి?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని చూసిన లక్ష్మీకి తెలిసిన నిజం! కేడీ, సంధ్యలకు షాక్‌ ఇచ్చిన సిరి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని చూసిన లక్ష్మీకి తెలిసిన నిజం! కేడీ, సంధ్యలకు షాక్‌ ఇచ్చిన సిరి!
Gundeninda Gudigantalu August 17th:ప్రభావతిని ఆడుకున్న మీనా,బాలు...పార్లరమ్మకు శృతి చేసిన మేలు ఏంటి..?
గుండెనిండా గుడిగంటలు: ప్రభావతిని ఆడుకున్న మీనా,బాలు..! పార్లరమ్మకు శృతి చేసిన మేలు ఏంటి..?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget