Krishna Mukunda Murari Serial Today April 2nd: కృష్ణ ముకుంద మురారి సీరియల్: కృష్ణ, ముకుందలకు పోటీగా మరో క్యారెక్టర్ ఎంట్రీ.. రావడం రావడమే రచ్చ చేసేసిన రజినీ!
Krishna Mukunda Murari Serial Today Episode: తన కూతురు సంగీతని ఆదర్శ్‌కి ఇచ్చి పెళ్లి చేస్తానని భవాని వదిన రజిని ఎంట్రీ ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Krishna Mukunda Murari Today Episode: కృష్ణ భవాని దగ్గరకు వెళ్లి సారీ చెప్తుంది. ఆదర్శ్, ముకుంద కలిసి ఉండాలి అనే ఆదర్శ్‌ని తీసుకొచ్చానని చెప్తుంది. దీంతో భవాని.. బండరాయిలా ముకుంద మారిపోయింది అని దాన్ని మార్చలేమని తెలిసే నీకు వద్దని చెప్పానని అంటుంది. కృష్ణ ఏడుస్తుంది.
భవాని: ముకుంద ఒక బండరాయి. మూర్ఖురాలు. తాను కోరుకున్నది దక్కదు అని తెలిసి కూడా మురారిని కోరుకుంది. నువ్వే గుడ్డిగా తనని నమ్మావు. మారింది అని ఛాన్స్ ఇచ్చావు. దాని అంతరంగం తెలుసుకోలేకపోయావు.
కృష్ణ: వాళ్లు కూడా సంతోషంగా ఉంటేనే కదా మేం కూడా సంతోషంగా ఉండేది. అందుకే మా శక్తికి మించి ప్రయత్నించాం.
భవాని: అయిపోయింది కదా ఇప్పుడు ప్రయత్నించడానికి కూడా ఏం లేదు కదా. అంతా మర్చిపోయి వేరే వాళ్ల కోసం ఆలోచించడం మానేయ్. ఇక నైనా మీ జీవితాలు మీరు జీవించండి. అర్థమవుతుందా..
ఇంతలో వదినా అని రజిని తన కూతురు సంగీతని తీసుకొని వస్తుంది. రావడం రావడమే అందర్ని దెప్పిపొడుస్తుంది. ఆదర్శ్‌కి తన కూతురుని ఇచ్చి పెళ్లి చేయమంటే వంకలు తీసి ఆ ముకుందతో పెళ్లి చేశావని ఇప్పటికైనా మించిపోయింది లేదని తన కూతుర్ని ఆదర్శ్‌కి ఇచ్చి పెళ్లి చేయమని చెప్తుంది.
భవాని: రజిని వచ్చీ రాగానే మొదలెట్టావా.. ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు.
రజిని: అవును నీకు తెలుసు. ఇప్పటి వరకు నీ ఇష్ట ప్రకారమే చేశావ్. వచ్చీ రాగానే ముకుందని శవాన్ని చేశావ్.
మీరా: ఫుల్లుగా తాగేసి ఉన్న ఆదర్శ్‌ని తీసుకొని వస్తూ.. ఎవరీ కొత్త బ్యాచ్.. ఏంటీ హడావుడి..
రజిని: అదిగో వీడినేమో తాగుబోతుని చేశావ్ ఏం సాధించావ్ భవాని.
కృష్ణ: పిన్ని మాటలు కొంచెం మర్యాదగా రానివ్వండి.
రజిని: ఏయ్ ఎవర్తివే నువ్వు ఇది నా అన్న ఇళ్లు నా వదిని ఇళ్లు నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతా..
కృష్ణ: మీరు ఎవరైనా కానివ్వండి ఏమైనా మాట్లాడండి. కానీ..
భవాని: కృష్ణ..
కృష్ణ: లేకపోతే ఏంటి పెద్దత్తయ్య ఏం మాట్లాడుతున్నారు ఆమె. మీరు లేని పోని చనువు తెచ్చుకొని మా పెద్దత్తయ్యని ఏమైనా అంటే నేను చూస్తూ ఊరుకోను.
రజిని: ఊరుకోకపోతే ఏం చేస్తావ్..
రేవతి: వదినా..
రజిని: కోడల్ని అదుపులో పెట్టుకోవడం తెలీదు కానీ ఆడబిడ్డని అదుపు చేస్తావా.. నువ్వుండగానే నీ ఆడబిడ్డకి వార్నింగ్ ఇస్తుంది నీ కోడలు.
భవాని: రజిని తనని ఏమీ అనొద్దు.
రజిని: అంటే ముందొచ్చిన ఆడబిడ్డ కంటే వెనక వచ్చే కోడలు ముఖ్యమా.. ఇప్పుడు పేరు పెట్టొద్దు అంటుంది తర్వాత ఇక్కడ కూర్చొవద్దు అక్కడ కూర్చొవద్దు అంటుంది. ఇలా అయితే మేం ఇక్కడ ఉండలేం. పదవే ఈ రాత్రికి ఎక్కడో సత్రంలో పడుకొని ఉదయం వెళ్లిపోదాం.
భవాని: తనని ప్రేమ రజిని. నువ్వు ఇలా చూపించావ్. తను అలా చూపించింది. అంతే.. వెళ్లి రెస్ట్ తీసుకోండి.
ఇక రజిని తన కూతురు సంగీతని ఆదర్శ్‌కి సపర్యలు చేయమని చెప్తుంది. ఇక ఆ కొత్త క్యారెక్టర్లును తాను ఉపయోగించుకుంటాను అని మీరా అనుకుంటుంది. ఆదర్శ్ ముకుంద గురించి మీరా చెప్పిన మాటలు తలచుకొని బాధ పడతాడు. ఏడుస్తూ నిన్ను మర్చిపోలేను ముకుంద అనుకుంటాడు. ఇంతలో సంగీత అక్కడికి వస్తుంది. బావ అంటూ మాట్లాడుతుంది. ఆదర్శ్ తనని బయటకు వెళ్లిపోమంటాడు. దీంతో సంగీత చనువు తీసుకొని బావ నన్ను చూసి ఆ మాట చెప్పు అంటుంది. ఆదర్శ్‌ని కాకాపడుతుంది. ఆదర్శ్ సంగీత మీద అరుస్తాడు. దీంతో సంగీత తాగుతున్నాడు కదా అందుకే చిరాకు పడుతున్నాడు. తర్వాత చూస్తా కానీ వదిలేది లేదు అనుకొని వెళ్లిపోతుంది.
ఉదయం కృష్ణ రజిని గురించి మురారితో మాట్లాడుతుంది. ఆవిడ అంతే అని మురారి చెప్పినా కృష్ణ వినిపించుకోదు. రజినీని దారిలో పెడతా అంటూ వాగ్దానాలు చేస్తుంది. దీంతో మురారి అమ్మా తల్లి ఈ సంఘసేవలు మానుకో అని చెప్తాడు. ఇక రజిని ఇళ్లంతా చూస్తుంది.
రజిని: ఈ ఇంటి కోడలు పోతే కానీ ఇంట్లో అడుగు పెట్టే అదృష్టం దక్కలేదు. ఈసారి ఈ అదృష్టాన్ని వదులుకోకూడదు. ఇక తన కూతురు సంగీత అప్పుడే నిద్ర లేచి వస్తే ఆమె మీద రజిని అరుస్తుంది. సంగీత కాఫీ అడుగుతుంది. ఇక అప్పుడే వచ్చిన కృష్ణని చూసి ఉందిగా పని మనిషి అని అంటుంది.
ఏయ్ ఆగు చుట్టాలకు ఉదయం కాఫీ టీ ఇవ్వాలి అని తెలీదా అడగనే లేదు.
కృష్ణ: అయ్యో అడుగుతాను అండీ. చుట్టాలు అయితే లేపి మరీ అడుగుతాను. కానీ మీరే రాత్రి మీరు ఈ ఇంటి మనుషులు అని అన్నారు కదా అందుకే పెద్దగా పట్టించుకోలేదు. చుట్టాలు అని మీకు క్లారిటీ ఉంది కదా ఇప్పుడు చెప్పండి. ఏం కావాలి. కాఫీనా టీనా..
సంగీత: కాఫీ మా అమ్మకి ఒకటి నాకు ఒకటి.
రజిని: ఎంత పొగరో చూశావా దానికి రాత్రేమో మా వదినను పేరు పెట్టి పిలిస్తే నిలదీసింది. ఇప్పుడేమో మీరు చుట్టాలే కదా క్లారిటీ ఉంది కదా అంటుంది.
సంగీత: తప్పు నీదే అమ్మ నేను కాఫీ అడగ్గానే నువ్వు పెట్టి ఉంటే సరిపోయేది. నువ్వు తనని పనిమనిషిని చేయాలి అనుకున్నావ్ అదేమో మనల్ని చుట్టాలను చేసేసింది.
రజిని: ఈ సారి ఈ ఇంట్లో అడుగు పెట్టింది నేను యజమాని అవ్వడానికి దాన్ని పనిమనిషిని చేస్తా.. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.