Naga Panchami Serial Today April 27th: 'నాగ పంచమి' సీరియల్: తన కడుపులో కన్నతల్లి పెరుగుతుందని పంచమి చెప్పడంతో బిత్తరపోయిన మోక్ష.. పూర్తిగా గరుడగా మారిపోయిన ఫణేంద్ర!
Naga Panchami Serial Today Episode పంచమి గర్బం పోగొట్టడానికి ఫణేంద్రను పూర్తి గరుడ రాజుగా కరాళి మార్చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Naga Panchami Today Episode పంచమి తన కడుపులో బిడ్డను తలచుకొని ఏడుస్తుంది. మోక్ష పంచమి దగ్గరకు వస్తాడు. పంచమిని ఏం కాలేదని ఏడ్వొద్దని చెప్తాడు. తానో సైంటిస్ట్ అని తన బిడ్డ గురించి తాను చూసుకుంటానని చెప్తాడు. పంచమికి ధైర్యం చెప్తాడు.
మోక్ష: మనకు పుట్టబోయే బిడ్డలో ఎలాంటి లోపం ఉండదు. నువ్వు ధైర్యంగా ఉండు.
పంచమి: మీరు నన్ను క్షమించాలి మోక్షాబాబు. నా కడుపులో పెరుగుతున్నది నా తల్లి. మోక్ష షాక్ అయిపోతాడు.
మోక్ష: నువ్వు చెప్పేది నిజమా..
పంచమి: అవును మోక్షాబాబు.. మొదట్లో నేను నమ్మలేకపోయాను కానీ నేను చెప్పేది నిజం. నా కన్నతల్లే నా కడుపులో పెరుగుతుంది.
మోక్ష: అదెలా సాధ్యం పంచమి.
పంచమి: నాగేశ్వరి చెప్పింది మోక్షాబాబు. నా తల్లిని చూసే అవకాశం నాకు లేదు. నేను పుట్టగానే నా తల్లి చనిపోయింది. నాకు పుట్టబోయే బిడ్డ రూపంలో అయినా చూసుకుందాం అనుకున్నా. నేను తల్లి ప్రేమను పొందలేకపోయాను. కనీసం నా బిడ్డ రూపంలో పుట్టబోయే నా తల్లికి నా ప్రేమ పంచాలి అని ఆశ పడ్డాను. కానీ అది కూడా తీరని కోరికలా మిగిలిపోనుంది.
మోక్ష: అలా జరగదు పంచమి. నీ ఆశను నేను తీర్చుతాను. నీ కన్న తల్లికి కచ్చితంగా నువ్వు తల్లివి అయ్యే అదృష్టాన్ని కల్పిస్తాను. నిజం పంచమి నా మాట విను. మీ అమ్మగారు మన బిడ్డగా పుట్టబోతున్నారు. అనగానే పంచమి భర్తను ప్రేమగా హత్తుకుంటుంది.
చిత్ర: భర్త నోరు తీపి చేస్తూ.. పంచమి గర్భంలో ప్రాబ్లమ్. ఇక జ్వాల అక్క పిల్లల్ని కంటుంది అని నమ్మకం లేదు. ఇక ఈ ఆస్తి మొత్తం మన పాపకే కదా..
భార్గవ్: పెళ్లానికి రెండు చేతులతో దండం పెట్టి.. నీ ఆడవాళ్ల తెలివి తేటలకు మెచ్చుకోవాలి. ఇంతలో వరుణ్, జ్వాల వస్తే చిత్ర కవర్ చేస్తుంది.
కరాళి: ఫణేంద్ర ఇక నువ్వు రంగంలోకి దిగాలి.
ఫణేంద్ర: నేను సిద్ధంగా ఉన్నాను కరాళి. ఎంత త్వరగా మనం నాగలోకాన్ని నాశనం చేస్తే నేను అంత సంతోషిస్తాను.
కరాళి: ముందు పంచమి గర్భంలోని విశాలాక్షిని నాశనం చేద్దాం. నాలో ఉన్న గరుడ శక్తితో నిన్ను గరుడగా మార్చేస్తాను. ఇప్పుడు మనం ఏదైనా ఈ శక్తితోనే మనం సాధించగలం.
ఫణేంద్ర: నాకు ఈ గరుడు శక్తి వస్తే ఆ పని మీదే ఉంటాను. ఎవరూ ఆ పంచమిని తప్పించలేరు.
కరాళి: నాలో ఉన్న గరుడ శక్తిని ఎక్కువ సేపు ఉంచుకోలేను. నీకు ఇచ్చేస్తా ఇక నువ్వు గరుడ శక్తితోనే ఉండి మన కార్యం పూర్తి చేయాలి. ఆ గరుడ శక్తి నీ శరీరంలోకి రాగానే నువ్వు ఫణేంద్ర అని మర్చిపోతావు. సంపూర్ణ గరుడ శక్తిగా నా స్వాధీనంలో ఉంటావు. మనం అనుకున్నది సాధించిన తర్వాత నిన్ను మళ్లీ ఫణేంద్రగా మార్చుతాను.
కరాళి: ఈ క్షణం నుంచి నువ్వు గాలిలో విహరిస్తూ నీ సూక్ష్మ శక్తితో పంచమిని అనుసరిస్తూ కనిపెడుతూ ఉండాలి. సమయం చూసి నేను ఆలోచిస్తాను. అప్పుడు పంచమి మీద దాడి చేసి గర్భం విచ్ఛిన్నం చేయాలి.
ఫణేంద్ర: అలాగే కరాళి నీ ఆదేశాల మేరకు నేను దాడి చేస్తాను. నేను గగనంలో తిరుగుతున్నా నీ ఆధీనంలోనే ఉంటాను.
కరాళి: సరే గరుడరాజ నువ్వు పక్షిలా మారి ఆకాశంలో విహరించు. అవసరం అయినప్పుడు నేను నిన్ను నా ఆధీనంలోకి తీసుకుంటాను.
చిత్ర: (చిత్ర, జ్వాల, భార్గవ్, వరుణ్‌లు మాట్లాడుకుంటారు.) పంచమి కడుపులో పిండం అందరిలా కాకుండా ఆసాధారణంగా పెరుగుతుంది అంటే నిజంగా పాము అయింటుందేమో.
జ్వాల: పంచమి కూడా మనం చూసిన వాళ్లలా పాముగా మనిషిగా మారింది అంటే మాత్రం పంచమి కూడా అలాంటిదే.
వరుణ్: మొదట్లో మీరు చెప్తే మేం నమ్మడం లేదు కానీ ఆ వ్యక్తి పాములా మారడం చూశాకా నమ్మాం.
భార్గవ్: అవును మళ్లీ అప్పటి నుంచి మనకు పాములు కనిపించలేదు.
జ్వాల: ఈ ఇంట్లో మళ్లీ పాములు కనిపించకూడదు అని వైదేహి అత్తయ్య వార్నింగ్ ఇచ్చింది కదా. అప్పుడే నాగేశ్వరి పాము అక్కడికి వస్తుంది.
చిత్ర: అసలు ఈ పంచమి ఏదైనా చేసి పిల్లలు కావాలి అనుకుంటే మనం అయినా ఏదో ఒకటి చేసి తన గర్భాన్ని పొగొట్టాలి. లేదంటే ఆ పుట్టబోయే పాముతో మనకు చాలా ప్రమాదం అవుతుంది అత్తయ్య.
ఇక నాగేశ్వరి పాము అందరి కాల దగ్గరకు వెళ్లి తోకతో కొడుతుంది. అందరూ దోమలు అనకుంటారు. తర్వాత వారి ఎదురుగా ఉన్న కుర్చీ మీదకు పాము వెళ్తుంది. దీంతో నలుగురు అరిచి గోల చేస్తారు. తర్వాత పాము కనిపించకపోవడంతో వెళ్లిపోయింది అనుకుంటారు. తర్వాత వారి పైన రూఫ్ మీద కనిపిస్తుంది. మళ్లీ అరిచి గోల చేస్తారు. తర్వాత నలుగురు దండం పెట్టుకోవడంతో వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: అందరినీ అలా పిలిచే అలవాటు నాకు లేదు, ఇండస్ట్రీలో ఆ ఇద్దరే నాకు అన్నయ్యలు - జయసుధ