Naga Panchami Serial Promo Today January 10th: ఫణేంద్ర మోసం చేస్తున్నాడు అని పంచమిని హెచ్చరించిన నాగసాధువు!
Naga Panchami Serial Promo Today నాగలోకం నుంచి నాగమణిని తీసుకురావడం అసాధ్యమని నాగసాధువు పంచమితో చెప్పడంతో ఇవాళ్టి ప్రోమో ఆసక్తికరంగా మారింది.
Naga Panchami Promo Today: మోక్షని కాటేసి నాగమణితో బతికించాలి అని పంచమి ఫణేంద్ర ఏం చెప్తే అది చేయడానికి సిద్ధమైపోంది. ఇష్టరూప నాగుల శక్తుల సొంతం చేసుకున్న పంచమి పాములా మారినప్పటికీ మోక్షని కాటేయలేకపోతుంది. ఈ తరుణంలో ఇవాళ వచ్చిన ప్రోమో చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంది. అసలు ప్రోమోలో ఏం జరిగిందంటే..
" పంచమి, మోక్షలు ముందుగా నాగసాధువు దగ్గరకు వెళ్తారు. అక్కడ నాగసాధువు హోమం చేస్తుంటారు. ఇక నాగసాధువు పంచమి వాళ్లతో.. నాగలోకం నుంచి నాగమణి తీసుకురావడం అసంభవమని నా అభిప్రాయం అని అంటారు. నాగలోకానికి శక్తిని పంచే ఆయువు పట్టు నాగమణి దాన్ని అంత సులభంగా భూలోకానికి తీసుకురావడం ఆలోచించాల్సిన విషయం అని అంటారు. దానికి పంచమి ఫణేంద్ర చాలా నమ్మకంగా చెప్పున్నాడు స్వామి అని అంటుంది. దాంతో నాగసాధువు నిజంగా ఫణేంద్ర మీకు సాయం చేయాలి అనుకుంటే నాగలోకంలో దొరికే నాగ చంద్రకాంత మొక్కని తీసుకొస్తే చాలు.. ఇష్టరూప నాగుల విషానికి విరుగుడుగా అదొక్కటే పనిచేస్తుంది అని అంటారు. పంచమి మోక్ష షాకైపోతారు."
నిన్నటి ఎపిసోడ్‌లో ఏం జరిగింది అంటే..
పాములా మారిన పంచమి మోక్షని కాటేయకుండా తరిగి మనిషిలా మారిపోతుంది. దీంతో మోక్ష తనని కాటేసి చంపమని పంచమిని వేడుకుంటాడు. దీంతో ఫణేంద్ర వద్దులే యువరాణి. ఒకవేళ నువ్వు ఇష్టం లేకుండా బలవంతంగా కాటేసినా ఆ బాధ భరించలేక మోక్ష గట్టిగా అరిచాడు అంటే ఇంట్లో అందరూ వచ్చేస్తారు. ఈ ఇంట్లో కాకుండా ఇంకెక్కడైనా పర్లేదు. ఇక్కడ మాత్రం ఈ కార్యక్రమం వద్దే వద్దు అని చెప్తేస్తాడు. ఇక పంచమి ఫణేంద్రతో.. యువరాజా నాగమణి కాకుండా నేను చెప్పిన నాగ చంద్రకాంత మొక్కను తీసుకురాలేమా అని అడుగుతుంది. దీంతో ఫణేంద్ర ఏం తీసుకురావాలి అన్నా మీరు ముందు కాటేయాలి యువరాణి. ముందు ఆ కార్యక్రమం ఎక్కడ చేయాలో తేల్చండి అంటుంది. ఇక పంచమి ఒక పని చేద్దాం యువరాజా మా ఊరి కొండల్లో నాగసాధువు ఉన్నారు. వారి ఆశ్రమంలో అయితే ఎవరికీ అనుమానం ఉండదు. మనం తిరిగి వచ్చేవరకు మోక్షాబాబుని తనైతే జాగ్రత్తగా చూసుకుంటారు అంటుంది. దానికి మోక్ష సరే అని.. ఆలస్యం చేయకుండా వెంటనే అక్కడికి వెళదామని చెప్తాడు.
మరోవైపు మేఘన మీ ముగ్గురు వెళ్లండి నేను కనిపించకపోతే మీ వాళ్లకి అనుమానం వస్తుంది. ఎలాగూ ఈ రాత్రికి మనం అనుకున్నది జరగదు కదా. రేపటికి నేను అక్కడికి చేరుకుంటా అని వాళ్లకు చెప్తుంది. ఇక మనసులో మాత్రం.. పంచమి మళ్లీ నాగమణిని వదిలేసి ఆ మొక్క వైపే మొగ్గు చూపుతోంది. వాళ్లని నమ్మకూడదు. నా ప్రయత్నం నేను చేసుకోవాలి. ఫణేంద్ర పంచమిని మోసం చేస్తే ఇక్కడ మోక్ష చనిపోతాడు. అక్కడ నుంచి నాగమణి రాదు. అలా జరగకుండా ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటుంది.
వైదేహి, తన భర్త మాట్లాడుకుంటూ ఉంటారు. వైదేహి తన భర్తతో మన మోక్షని పంచమి పూర్తిగా మార్చేసింది అండీ. వాడు అసలు ఏం చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలీడం లేదు అని అంటుంద. అప్పుడే అక్కడికి మేఘన వచ్చి మీరు భయపడకండి ఆంటీ వాళ్లు ఎక్కడికి వెళ్లుండరు. పంచమికి నాలాగా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ల దగ్గరకు వెళ్లి ఉంటుందని.. ఈ ఊర్లోనే తనకు పంచమికి తెలిసిన ఫ్రెండ్స్ ఒకరిద్దరు ఉన్నారు. అలా బయటకు వెళ్తే వాళ్ల గురించి తెలుసుకుంటా అని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్తుంది. ఇక చిత్ర, జ్వాలలు మేఘన వెళ్లిపోగానే తన గదికి వెళ్లి వెతుకుతారు. అక్కడ ఓ నల్ల బ్యాగ్ దొరుకుతుంది. ఈ విషయం మేఘనకు తెలిసిపోతుంది. దీంతో మేఘన తన మంత్ర శక్తులు వాళ్లమీద ప్రయోగిస్తుంది. ఇక ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు దెయ్యంలా మారి కొట్టుకుంటారు.
మరోవైపు పంచమి, మోక్ష, ఫణేంద్ర సుబ్రహ్మణ్య స్వామి గుడికి వస్తారు. దేవుడి దయ ఉండాలి అని పంచమి అంటే.. ముందు మీరు నన్ను నమ్మితే అంతా సవ్యంగా జరిగిపోతుందని ఫణేంద్ర అంటాడు. ఇక మోక్ష అయితే తనకు ఇప్పుడు ఏ ఆశలూ, కోరికలు లేవని.. అన్నీ వదులు కొని చావుకు సిద్ధమైపోయానని అంటాడు. ఇక మోక్ష ఫణేంద్రతో నాకు ఏం జరిగినా పర్లేదు. పంచమికి ఎలాంటి కష్టం రాకూడదని చెప్తాడు. దానికి ఫణేంద్ర.. తన మనసులో.. ఈ రాత్రి వరకే నీకు పంచమి. రేపటి నుంచి తను మా నాగలోకానికి యువరాణి. నాకు కాబోయే పట్టపురాణి అని అనుకుంటాడు. బయటకు మాత్రం మీరు బాగా భయపడుతున్నారు మోక్ష. ధైర్యంగా ఉండండి. ఏం జరగాలో అదే జరుగుతుంది. అంటాడు. ఇక పంచమి దేవుడిని మొక్కుకుంటోన్న సమయంలో సుబ్బు తనకు పిలిచి కనిపించి అంతలోనే మాయమై పంచమిని తిప్పిస్తాడు.
Also Read: Trinayani Serial Today January 10th: నయని, హాసిని ప్రాణాలు తీసేస్తున్న తల్లీకొడుకులు!