Rangula Ratnam July 17th: రేఖను మోసం చేసిన మూర్తి.. శంకర్ గురించి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన సత్యం?
శంకర్ ఎక్కడ కనిపించకపోవడంతో ఇంట్లో వాళ్ళందరూ టెన్షన్ పడటం వల్ల సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Rangula Ratnam July 17th: రోడ్డు మీద వెళ్తున్న శంకర్ ప్రసాద్ కు రేఖ ఎదురు పడుతుంది. ఇక రేఖను చూసి నువ్వా అని అనటంతో.. కళ్ళు వచ్చాయా అని వెటకారం చేస్తూ మాట్లాడుతుంది రేఖ. తనని దెబ్బ కొట్టినందుకు ఈ గతి వచ్చిందని చెబుతుంది. అయినా నీకు కళ్ళు వచ్చి మంచి పని అయ్యాయి.. ఇప్పుడు నేను రాజభోగం అనుభవిస్తున్నాను అని అంటుంది.
ఒకప్పుడు నేను ఇదే పరిస్థితుల్లో ఉంటే నువ్వు నాకు నీడని ఇచ్చావు.. కానీ నేను మాత్రం నిన్ను ఎండలో నిలబెట్టాను అని పొగరుగా మాట్లాడుతూ ఉంటుంది. అంతేకాకుండా వర్ష గురించి కూడా మాట్లాడుతూ తన పరిస్థితి కూడా రోడ్డున పడింది నువ్వు కూడా తన దగ్గరికి వెళ్ళు అని అనటంతో వెంటనే శంకర్ నీవల్ల నా వర్ష ఈ లోకానికి దూరమయ్యింది అని బాధపడతాడు.
దాంతో వర్ష చనిపోయిందని రేఖ సంతోషపడుతుంది. నీవల్లే నా కూతుర్ని ఇంట్లోకి రానివ్వకుండా చేశాను అని.. ఇక గుడ్డివాడిని అయ్యాక ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది తెలుసుకున్నాను అని ఇక నిన్ను వదిలేది లేదు అని తన గొంతు పట్టుకోవడానికి ప్రయత్నించగా వెంటనే డ్రైవర్ వచ్చి శంకర్ కు వార్నింగ్ ఇవ్వటంతో చూసావా డబ్బు ఉంటే ఎలా ఉంటుందో అని పొగరుగా మాట్లాడుతుంది రేఖ.
ఇక ఎప్పుడు తిన్నావో ఏమో నా పేరు చెప్పుకొని రోడ్డు పక్కన ఈ బిర్యానీ తిను అని 100 రూపాయలు విసిరేసి అక్కడి నుండి వెళ్తుంది. ఇక శంకర్ కూడా అక్కడి నుంచి బాధపడుతూ వెళ్తాడు. మరోవైపు వర్ష గురించి తలుచుకొని బాధపడుతూ నీ దగ్గరికి రావాలనుకున్న నీ తండ్రి ఇప్పుడు జాడ లేకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు అని ఏడుస్తూ కుమిలిపోతూ ఉంటుంది.
ఇక అందరూ శంకర్ వస్తారులే అని పూర్ణకు ధైర్యం చెబుతూ ఉంటారు. అప్పుడే సీత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే చెరోవైపు వెతుక్కోవచ్చు అని సలహా ఇస్తుంది. ఇక రఘు తనకు కూడా ఈ ఐడియా వచ్చిందని.. తర్వాతకు నాన్న నా గురించి కంప్లైంట్ ఇస్తారా అని అంటాడేమో అని భయంతో కంప్లైంట్ చేయలేకపోయాను అని అంటాడు.
ఎప్పుడూ అనే దాని గురించి ఇప్పుడు ఎందుకు అని సత్యం.. వెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వెళ్దాము అని రఘుని తీసుకొని వెళ్తాడు. మరోవైపు రేఖకు మూర్తి కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చి డబ్బు ఆశ చూపించి సైన్ చేయమని అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన చక్రి మూర్తి చేస్తున్న మోసాని గురించి చెప్పటంతో వెంటనే కోపంతో రగిలిపోయి ఉద్యోగంలో నుంచి తీసేస్తాను అని అంటుంది.
దాంతో మూర్తి పిల్లలు ఉన్నారని అలా చేశాను అంటూ క్షమాపణలు కోరుకుంటాడు. చక్రి కూడా అతని వదిలేసేయ్.. ఇంతకాలం ఇక్కడే చేస్తున్నాడు కాబట్టి అతడికి అన్ని తెలుసు కాబట్టి వదిలేసేయ్ అని అంటాడు. మరోవైపు పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన సత్యం జరిగిన విషయం మాత్రం చెప్పి శంకర్ ప్రసాద్ కనిపించడం లేదని కంప్లైంట్ ఇస్తాడు. ఇక తరువాయి భాగంలో సత్యం పూర్ణకి శంకర్ ప్రసాద్ దొరుకుతాడు అని ధైర్యం ఇస్తాడు.
also read : Trinayani July 17th: ‘త్రినయని’ సీరియల్: వల్లభ గొంతు గట్టిగా నొక్కిన తిలోత్తమ, బోనం ఎత్తనంటూ దొంగనాటకాలు!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial