Meghasandesam Serial Today November 28th: ‘మేఘసందేశం’ సీరియల్: భూమికి ప్రపోజ్ చేసిన గగన్ – హాస్పిటల్ నుంచి భూమిని తీసుకెళ్లిన శరత్ చంద్ర
Meghasandesam Today Episode: హాస్పిటల్ కు వెళ్లిన గగన్, భూమికి ప్రపోజ్ చేయడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: బెడ్ మీద నిద్రపోతున్న భూమిని గుర్రుగా చూస్తుంది అపూర్వ. నిద్ర లేచిన భూమి నవ్వుతూ గుడ్ మార్నింగ్ చెప్తూ ఇక్కడ కెమెరాలు ఉన్నాయి మమ్మీ మర్చిపోయినట్టు ఉన్నావు అంటుంది. దీంతో అపూర్వ నవ్వుతున్నట్టు నటిస్తుంది. నాకు కాఫీ తీసుకొచ్చావా..? మమ్మీ అని అడుగుతుంది. తీసుకొచ్చానని అపూర్వ చెప్పగానే ఎంత సేపు అయింది ఈ కాఫీ తీసుకొచ్చి అని భూమి అడుగుతుంది. జస్ట్ అరగంటే అవుతుందని చెప్తుంది అపూర్వ. దీంతో భూమి అరగంట క్రితం తీసుకొచ్చిన కాఫీ నాకు ఇస్తావా..? నాకు ప్రెష్ గా కావాలని అడుగుతుంది. సరేనని అపూర్వ కాఫీ తీసుకురావడానికి వెళ్తుంది. ఇంతలో అక్కడకు గగన్ వస్తాడు. గగన్ ను చూసి భూమి హ్యాపీగా ఫీలవుతుంది.
భూమి: తలతిక్కగారు..
గగన్: తైతక్కగారు..
భూమి: ఇప్పటికి గుర్తొచ్చానా..?
గగన్: అమ్మ చెల్లితో కలిసి నేను వచ్చేశాను. నేను లోపలికి వచ్చేసరికి నిద్రపోయారు.
భూమి: ఆంటీ చెప్పింది. నాకోసం మీరు పూజలు చేశారట. అసలు మీరు దేవుణ్ని నమ్మరు కదా..?
గగన్: అది అమ్మ నీ కోసం మొక్కకుంది. అమ్మ చేయలేకపోతే నేను చేశాను.
భూమి: ఓ అయితే ఆంటీ కోసం చేశారా..?
గగన్: అంటే అది అమ్మ కోసం నీ కోసం కూడా..?
భూమి: చేతిలో ఏంటది..?
గగన్: గిఫ్ట్ .. నెక్లెస్
భూమి: దేనికీ..?
గగన్: నీకు గిఫ్ట్ గా ఇద్దామని తెచ్చాను.
భూమి: దేనికీ..
గగన్: అంటే నువ్వు నన్ను సేవ్ చేశావు కదా..
భూమి: అంటే మీ ప్రాణం ఖరీదు నెక్లెస్సా..?
గగన్: అంటే అది కాదు.. అమ్మ తనకు కాబోయే కోడలు కోసం ఎంతో ఇష్టంగా చేయించింది అన్నమాట.
భూమి: ఆంటీ తనకు కాబోయే కోడలు కోసం చేయించింది. అంటే మీ భార్యకు ఇవ్వాలన్నమాట. మరి నాకెందుకు ఇస్తున్నారు.
గగన్: నేను చెప్పేది నీకు నిజంగా అర్థం కాలేదా..?
భూమి: కాలేదు..
గగన్: నిజంగా నీకు అర్థం కాలేదా..? అయితే నేను స్ర్టెయిట్ గా చెప్పేస్తాను. ఐ లవ్ యూ..
భూమి: మీ డ్రెస్ మీ ప్రపోజల్ రెండూ బిజినెస్ ప్రపోజల్ లాగానే ఉన్నాయి.
గగన్: ఏమో నా మనసులో మాట చెప్పేశాను. నీ మనసులో మాట వినాలని ఉంది. ఏంటి ఏం బదులు చెప్పవా..?
భూమి: ఏం నా చూపులో నీకు ప్రేమ కనిపించలేదా..?
గగన్: కనిపించింది కాకపోతే నీ నోటితో విందామని..
భూమి: మీరు చెప్పే ఐ లవ్యూ కోసం నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. ఐ లవ్యూ టూ.. తలతిక్క గారు.
గగన్: నిన్ను ప్రేమిస్తున్నానో లేదో అనే తడబాటు నాకు ఎప్పటి నుంచో ఉంది తైతక్క. కానీ మీ కోసం నేను ఆయన్ని కాపాడాను. చావుకు ఎదురెళ్లాను అని అమ్మా చెల్లితో చెప్పావే అప్పుడు ఫిక్స్ అయ్యాను. మా అమ్మ చెల్లిని చూసుకునే నీలాంటి అమ్మాయి నాకు కావాలనుకున్నాను. దొరికేసింది.
అంటూ నెక్లెస్ తీసి భూమి మెడలో పెడతాడు గగన్. ఏడుస్తూ ఇంకోసారి ఐ లవ్యూ చెప్పు అంటాడు. భూమి ఎమోషనల్ అవుతుంది. కట్ చేస్తే అదంతా గగన్ కారులో వస్తూ కలగంటాడు. హాస్పిటల్ ముందు కారు ఆపిన గగన్ నెక్లెస్ తీసుకుని లోపలికి వెళ్తాడు. అక్కడ భూమి కనిపించదు. నర్స్ వచ్చి భూమి డిశ్చార్జ్ అయిపోయిందని వాళ్ల నాన్నగారు వచ్చి తీసుకెళ్లిపోయారు అని చెప్పగానే గగన్ బాధపడతాడు. మరోవైపు భూమిని ఇంటికి తీసుకెళ్తాడు శరత్ చంద్ర. భూమిని చూడగానే చెర్రి హ్యాపీగా ఫీలవుతాడు. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన భూమికి అపూర్వ చేత దిష్టి తీయిస్తాడు శరత్ చంద్ర. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

