Meghasandesam Serial Today November 1st: ‘మేఘసందేశం’ సీరియల్: మీరాను ఓదార్చిన శరత్ చంద్ర – భూమితో బాధపడ్డ శారద
Meghasandesam serial today episode November 1st: కేపీ బతికే ఉన్నాడన్న నిజం చెబుదామని శారద చెప్పడంతో వద్దని కేపీకి డేంజర్ అని చెప్తుంది భూమి. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: చీకటి రూంలో ఏడుస్తూ కేపీ ఫోటో ముందు కూర్చున్న మీరా దగ్గరకు భోజనం తీసుకుని వెళ్తాడు శరత చంద్ర. ఆ స్థితిలో మీరాను చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు. పక్కనే కూర్చుని ఏడుస్తుంటాడు.
శరత్: అమ్మా మీరా నా తల్లివి కదమ్మా ఒక్క ముద్ద తినమ్మా నువ్వు ఇలా తిండి తిప్పలు మానేసి నువ్వు ఇలా దిగులుగా కూర్చుంటే నా గుండె తరుక్కు పోతుందమ్మా నా తల్లి కదూ మీ అన్నయ్య తినిపిస్తే తింటావు కదూ నాకోసం ఒక్క ముద్ద తినమ్మా..!
మీరా: అన్నయ్య నీకో విషయం తెలుసా..? నేను ఎప్పుడైనా ఆయన మీద అలిగి అన్నం తినకపోతే ఆయన కూడా తినేవారు కాదు అన్నయ్య. మళ్లీ నేను ఎక్కడ ఆకలితో ఇబ్బంది పడతానోనని ఇదిగో ఇలాగే ప్లేట్‌లో అన్నం పెట్టుకుని వచ్చి నేను నిద్ర పోతున్నా.. లేపి మరీ బతిమాలి బుజ్జగించి నాకు తినిపించే వారు అన్నయ్య. నా కోపం నెమ్మదించింది అని తెలిశాక ఆ అన్నం గిన్నే నా చేతిలో పెట్టి ఏం చేసేవారో తెలుసా..? చిన్న పిల్లాడిలా నాకు కూడా తినిపించవా అని ఇలా తినిపించుకునే వారు అన్నయ్య. ఇప్పుడు తినిపించడానికి ఆయన లేరు అన్నయ్య.
శరత్: ( మనసులో) దేవుడా నా చెల్లిని రక్షించు.. మళ్లీ నా చెల్లిని మామూలు మనిషిని చేయి దేవుడా..?
అంటూ ఏడుస్తుంటాడు శరత్ చంద్ర. మరోవైపు రూంలో కూర్చుని ఏడుస్తున్న శారద దగ్గరకు భూమి వెళ్తుంది. శారద ఏడవడం చూసి కంగారు పడుతుంది. అత్తయ్యా ఏం జరిగింది అంటూ ఆరా తీస్తుంది.
భూమి: చెప్పండి అత్తయ్యా ఏమైంది ఎందుకు ఇలా ఏడుస్తున్నావు..?
శారద: భూమి వద్దు భూమి మీ మామయ్య బతికే ఉన్నారని చెప్పేద్దాం భూమి.. ఆయన బతికే ఉన్నా ఈ పసుపుకుంకాలు తీసేయలేదనే ఈ నిందలు నేను భరించలేకపోతున్నాను భూమి..
అంటూ శారద బోరున ఏడుస్తుంది.
భూమి: అత్తయ్య మీరు ఇంత బాధపడుతున్నారంటే కచ్చితంగా మిమ్మల్ని ఎవరో ఏదో అన్నారు. చెప్పండి అత్తయ్యా అసలు ఏం జరిగింది. ఎవరు ఏమన్నారు..?
అంటూ భూమి అడగ్గానే.. ఏడుస్తున్న శారద ఉదయం గుడిలో అంటూ అపూర్వ అవమానించిన విషయం మొత్తం చెప్పేస్తుంది. దీంతో భూమి బాధపడుతుంది.
భూమి: నిజంగా ఇలాంటి అవమానం ఏ ఆడదానికి జరగకూడదు అత్తయ్య.. నేను ఒప్పుకుంటాను అత్తయ్య. అపూర్వ పదే పదే ఇలా అవమానించే అవకాశం కచ్చితంగా ఉంది. కనుక మామయ్య బతికే ఉన్నాడని మనం చెప్పేయాల్సిందే అత్తయ్య
శారద: అదే కదా భూమి నేను అంటుంది.
భూమి: ఒక్క నిమిషం అత్తయ్యా (అంటూ లోపలికి వెళ్లి కేపీ ఫోన్ తీసుకొచ్చి శారదకు చూపిస్తుంది.) ఇదిగోండి అత్తయ్య ఇది మామయ్య ఫోన్. ఇందులోంచి మామయ్య ఆఖరి కాల్ ఎవరికి వెళ్లిందో తెలుసా..? అంటే మామయ్య ఫోన్ చేసిన తర్వాత అపూర్వని మామయ్య కలిశారు. అది ఎంత దుర్మార్గురాలో మనకు తెలుసు అన్నయ్య. అదే మామయ్యని గన్ తో షూట్ చేసి చంపేయాలి అనుకోవచ్చు కదా..? అదృష్టం కొద్ది మామయ్య బతికారు. ఇప్పుడు మామయ్య బతికే ఉన్నారని తెలిస్తే మళ్లీ అపూర్వ మామయ్యను చంపేయదని గ్యారంటీ ఏంటి అత్తయ్య.. మీరు ఏ అపూర్వ గురించి భయపడుతున్నారో.. ఆ అపూర్వ నుంచే మామయ్య ప్రాణానికి ప్రమాదం ఉంది అత్తయ్య.. మరోవైపు ఆ ఎస్పీ సూర్య కూడా ఇప్పటికీ మామయ్యే వాళ్ల అన్నయ్యను చంపేశాడని నమ్ముతున్నాడు అత్తయ్య. ఈ పరిస్థితుల్లో మామయ్య బతికే ఉన్నాడని చెప్పి మామయ్యను దూరం చేసుకుందామా అత్తయ్యా..?
శారద: నువ్వు చెప్తుంది నిజమే అమ్మా.. కానీ ఈ దాగుడు మూతలు ఎన్ని రోజులు..
భూమి: అపూర్వ బండారం మొత్తం కోర్టులో బయట పెట్టే వరకే అత్తయ్య. అంత వరకు మీరు ఓపికగా ఉండండి. ఈ నిజాన్ని మీ గుండెల్లోనే దాచుకోండి అత్తయ్య
అని భూమి చెప్పగానే.. శారద ఆలోచిస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















