Meghasandesam Serial Today March 31st: ‘మేఘసందేశం’ సీరియల్: భూమి వేలు నోట్లో పెట్టుకున్న గగన్ – ఇది శరత్ చంద్ర రక్తం అన్న భూమి
Meghasandesam Today Episode: కూరగాయలు కట్ చేస్తున్న భూమి వేలు తెగిపోవడంతో గగన్ వెళ్లి రక్తం కారకుండా నోట్లో పెట్టుకోవడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode : భూమి మీదకు పంపించిన రౌడీల గురించి ఆరా తీయాలా..? అని ప్రసాద్ అడుగుతాడు. దీంతో భూమి ఇప్పుడు అయిపోయిన వాటి గురించి ఎందుకులే మామయ్యా అంటుంది. అపూర్వ గురించి కనిపెట్టాలని చెప్తుంది భూమి. డీఎన్‌ఏ టెస్ట్ రిపోర్టు మార్చేస్తుంది. దాన్ని మీరు అడ్డుకోవాలని చెప్తుంది. గగన్‌ను నేనే హెల్ప్ అడగొచ్చు కానీ నా మీద కోపంగా ఉన్నాడని అందుకే అడగడం లేదని చెప్తుంది.
చెర్రి: మా అన్నయ్యను అడిగితే ఒకటి మమ్మల్ని అడిగితే ఒకటా..? నువ్వుచెప్పేదంతా ఆలోచిస్తుంటే కరెక్టే అనిపిస్తుంది. ఇక నుంచి ఫుల్ కాంసట్రేషన్ అత్తయ్య మీదే పెడతాను.
అని చెర్రి చెప్తాడు. మరోవైపు నక్షత్ర గగన్ ఆఫీసుకు కోపంగా వెళ్తుంది. ఫైల్స్ కింద పడేస్తుంది.
గగన్: ఏయ్ నక్షత్ర ఏం చేస్తున్నావు.. కళ్లు కనిపించడం లేదా..? ఏంటి అలా చూస్తున్నావు. నువ్వు అలా చూస్తే వణికిపోయి జ్వరం వచ్చేవాళ్లు ఎవరూ లేరు ఇక్కడ. నిన్ను నా ప్యూన్‌తో బయటకు గెంటి వేసే రైట్స్ నాకున్నాయి.
నక్షత్ర: ఆ గెంటివేస్తావా… గెంటేయ్ నాకంటే ముందు ఆ భూమిని గెంటేయ్. ఏ భూమిని గెంటేయ్ అంటే నీ హార్ట్ లబ్ డబ్ అంటూ కొట్టుకుంటుందా..? ఆ లబ్ డబ్ పేరు లవ్వా..? అయ్యో శరత్ చంద్ర మీ పర్మినెంట్ శత్రువు సార్ భూమి ఆకాశం ఏకమైనా.. భూమి అంతా స్మశానం అయి శరత్ చంద్ర కూతురు, మీరు మిగిలినా.. మీరు శరత్ చంద్ర కూతురును పెళ్లి చేసుకోరు అన్న మీ మాటలు మర్చిపోయారా..? సార్.
గగన్: మర్చిపోవడానికి నాకేం జబ్బు లేదు. అయినా నీ కారు పెట్రోల్, టైం వేస్ట్ చేసుకుని నాకు గుర్తు ఉన్న విషయాన్నే మళ్లీ గుర్తు చేయడానికి వచ్చావు కదా దారి ఖర్చుల కోసం ఇవి తీసుకో..
నక్షత్ర: నువ్వు విసిరిన చిల్లర కోసం నీ ప్రేమ కోసం నీ చుట్టు తిరుగుతున్నాను. శరత్ చంద్ర కూతురు అంటే పడదని ప్రగల్బాలు పలికిన తమరికి భూమి కూడా శరత్ చంద్ర కూతురే అని గుర్తు చేయడానికి వచ్చాను. మరి భూమిని ఇంట్లో ఎందుకు పెట్టుకున్నావు.
గగన్: చూడు నక్షత్ర భూమి నీలా కఠోర కాదు. అందువల్ల మ అమ్మకు భూమి అంటే చాలా ఇష్టం. అమ్మకు ఇష్టం కావడం వల్ల భూమికి నేను షెల్టర్ ఇచ్చాను. భూమి ప్రాణానికి ప్రమాదం ఉంది. అమ్మ కోసమైనా భూమిని కాపాడుకోవాలి. అందుకే భూమికి షెల్టర్ ఇచ్చాను. ఇక ఫైనల్ ఏంటంటే భూమిని ప్రేమించాను. కానీ ఇప్పుడు కాదు. క్లారిఫికేషన్ ఇచ్చాను కదా ఇంకా ఎందుకు చూస్తున్నావు. గెట్ అవుట్.
నక్షత్ర: చూడు బావ భూమి మీద ప్రేమ లేదని ఇప్పుడు నువ్వు అంటున్నావు. తర్వాత అది వచ్చిందని దాని మెడలో తాళి కట్టావంటే నిన్ను దాన్ని కలసి తగలబెడతాను.
అంటూ వార్నింగ్ ఇస్తూ.. నక్షత్ర అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు అపూర్వ డీఎన్‌ఏ టెస్ట్ రిపోర్ట్ ఇచ్చే డాక్టర్ దగ్గరకు వెళ్తుంది. డాక్టర్ చెప్పండి అపూర్వ గారు ఇక్కడకు వచ్చారు అని అడుగుతాడు.
అపూర్వ: మీకు తెలిసే ఉంటుంది మా ఇంటి పరిస్తితులు. భూమి మా ఇంటి వారసురాలు అని కోర్టులో చెప్పిన దగ్గర నుంచి నాకు చాలా ఎగ్జైంటింగ్ గా ఉంటుంది. నిజంగా మా శోభా చంద్ర అక్క కూతురు బతికే ఉంటే ఆశ్చర్యం ఒకవైపు, ఆనందం ఒకవైపు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అదేనండి ఈ ఫారెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్‌గా డీఎన్‌ఏ రిపోర్ట్ మీకు తెలిసే ఉంటుంది. అదే విషయం తెలుసుకుందామని వచ్చాను.
డాక్టర్: ఇవన్నీ చాలా కాన్పిడెంషియల్ మ్యాటర్స్. చెప్పకూడదు.
అపూర్వ: ఫ్లీజ్ సార్
డాక్టర్: మీ అక్క కూతురు వస్తే బాగుంటుందని మీరు బాగా కోరుకుంటున్నట్టు ఉంది.
అపూర్వ: అవును సార్…
డాక్టర్: మీ ఆశ నెరవేరుతుంది. మీ అక్క కూతురు వస్తుంది.
అని డాక్టర్ చెప్పగానే.. అపూర్వ షాక్ అవుతుంది. తర్వాత డాక్టర్‌తో మాట మార్చి ఎలాగైనా డీఎన్‌ఏ రిపోర్టు మార్చమని అడుగుతుంది. దీంతో డాక్టర్ ఒప్పుకోడు అపూర్వ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు శారద ఇంటికి వెళ్లిన భూమి హ్యాపీగా ఆంటీ గుడ్ న్యూస్ అని చెప్తుంది. రేపు నేను మా నాన్న కూతురుని అని అలాగే నేనే తప్పు చేయలేదని కోర్టు తీర్పు ఇవ్వబోతుందని చెప్తుంది. ఈ సంతోషంలో ఈరోజు వంట నేనే చేస్తాను అంటుంది. అందుకోసం కూరగాయలు తరుగుతుంటే భూమి వేలు తెగుతుంది. వెంటనే గగన్ వచ్చి భూమి వేలును నోట్లో పెట్టుకుంటాడు. అది చూసిన శారద, పౌర్ని సిగ్గుగా చూస్తుంటారు. ఇంతలో భూమి మీరు ఆపాలనుకుంటున్న ఈరక్తం శరత్ చంద్ర గారిది అని చెప్తుంది. దీంతో గగన్ షాకింగ్ గా వేలు విడిచిపెడతాడు. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















