Meghasandesam Serial Today January 1st: ‘మేఘసందేశం’ సీరియల్: గగన్ ను కొట్టి ఇంటరాగేషన్ చేస్తున్న సూర్య – స్టేషన్‌కు వెళ్లిన కేపీ, భూమి
Meghasandesam serial today episode January 1st: గగన్‌ను సూర్య కొడుతూ ఇంటరాగేషన్ చేస్తుంటాడు. కేపీ, భూమి స్టేషన్‌కు వెళ్తారు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Meghasandesam Serial Today Episode: కేపీ మీరాలకు చెప్పి బిందు కాలేజీకి వెళ్తుంది. డోర్ దగ్గరకు వెళ్లగానే అపూర్వ చూసి ఆగు అంటుంది. బిందు ఆశ్చర్యంగా ఆగిపోతుంది. ఈ రోజు నుంచి నువ్వు కాలేజీకి వెళ్లడం లేదు అంటుంది అపూర్వ. బిందు షాక్ అవుతుంది. కేపీ, మీరా ఇద్దరూ అపూర్వ దగ్గరకు వెళ్తారు.
కేపీ: అదేంటి అపూర్వ గారు బిందు కాలేజీ ఎందుకు మానేయాలండి.
అపూర్వ: ఏమ్ మీరు ఇద్దరూ మన బిందును పూరి కొట్టిన సంగతి మర్చిపోయారా..?
కేపీ: చిన్న పిల్లలు అండి కొట్టుకుంటారు.. తిట్టుకుంటారు… కలిసిపోతారు. ఆ మాత్రం దానికే బిందును కాలేజీ మాన్పించాలా..?
అపూర్వ: కొట్టుకుంటారు కలిసిపోతారా..? అంటే ఏంటి నీ ఉద్దేశం ఆ శారద ఫ్యామిలీతో మనం అందరం కలిసిపోవాలా..?
కేపీ: అపూర్వ గారు టాపిక్ డైవర్ట్ చేయకండి. నేను అడుగుతుంది బిందు చదువును మధ్యలో ఆపేసి దాని కేరియర్‌ను ఎందుకు నాశనం చేయడమని..
అపూర్వ: నువ్వు నన్ను అడగడం కాదు కేపీ.. బిందును అడగాలి. అమ్మా కాలేజీకి వెళ్తున్నాను అనగానే.. టిఫిన్ చేయమని ఒకరు.. ఇంకా కాలేజీకి టైం ఉంది కదమ్మా..? ఎందుకు ఇప్పుడే వెళ్తున్నావు అని అడుగుతున్నారే కానీ అసలు పూరిని బిందు ఎందుకు కొట్టిందో ఆలోచించారా..? ఆ శివ గాణ్ని ఇది అందరి ముందు కౌగిలించుకుందని కొట్టింది. ఏమో వాణ్ని ఎందుకు కౌగిలించుకున్నావని అడగరే..?
కేపీ: ఏం మాట్లాడుతున్నారు అపూర్వ గారు మనం ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఉన్నాం ఫ్రెండ్లీగా హగ్ చేసుకోవడాన్ని కూడా అనుమానిస్తే ఎలా..? పిల్లలను అనుమానిస్తే అప్పుడు వాళ్లు చేయకూడని పనులే చేస్తారు.
అపూర్వ: చాలు చాలు కేపీ బిందును సమర్థించాలని చూడకు. ఇది ఈ ఇంటి పరువు విషయం. నువ్వు తీసినట్టే ఈ ఇంటి పరువు నీ కూతురు కూడా తీస్తుంటే.. ఇక్కడ నేను కళ్లు మూసుకుని చూస్తూ ఉంటానని మాత్రం అనుకోకు.
మీరా: వదిన అడిగేంత వరకు నాకు తట్టనేలేదు. అవునే వాణ్ని కౌగిలించుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందే..?
బిందు: అంటే అమ్మా అది శివ నా క్లోజ్ ఫ్రెండ్ అమ్మా.. నాన్న చెప్పినట్టు శివ రన్నింగ్ రేసులో గెలిచాడని అప్రిసియేట్ చేశానమ్మ..? అంతేనమ్మా మా ఇద్దరి మధ్య ఏమీ లేదు..
అపూర్వ: ఏమ్మా శివ నీకు ఒక్కడే ఫ్రెండా..? లేకపోతే గెలిచిన ప్రతివాణ్ని ఇలాగే కౌగిలించుకుని ఎంకరేజ్ చేస్తున్నావా..?
బిందు: అత్తయ్యా..?
అపూర్వ: ఏంటే నోరు లేస్తుంది. మీ నాన్నే నా ముందు నోరు ఎత్తడానికి ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాడు. ఇంతున్నావో లేదో నువ్వేంటే నా ముందు నోరు లేస్తుంది. ఈ పరిస్థితుల్లో ఉన్నాను కదా కొట్టలేనేమోనని అరుస్తున్నావా..? చూడు నేను పిలుస్తే రావాలి. నేను కొడితే పడాలి. అది ఈ ఇంట్లో నా స్థానం. ఎవ్వరి స్థానం వాళ్లు గుర్తు పెట్టుకుంటే మంచిది. అర్థం అవుతుందా..?
బిందు: అత్తయ్యా ఫ్లీజ్ అత్తయ్యా నన్ను చదువుకోనివ్వండి అత్తయ్యా..? నాకు చదువుకోవాలని జాబ్ చేయాలని ఉంది.
అపూర్వ: ఏం అవసరం లేదు.. ఏమే మీ అక్క ఇందు ఏం చేస్తుంది. చక్కగా పెళ్లి చేశాము. కాపురం చేసుకోవడం లేదు. అలాగే నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాం చక్కగా కాపురం చేసుకో.
బిందు: నాన్న అత్తయ్యకు నువ్వైనా చెప్పు నాన్నా..? అమ్మా అత్తయ్యకు నువ్వైనా చెప్పమ్మా..?
అపూర్వ: నేను చెప్పింది మాటైతే వాళ్లు నాతో మాట్లాడటానికి ప్రయత్నిస్తారు. తీసుకుంది నిర్ణయం అయితే ఇక్కడ ఎవ్వరూ మాట్లాడరు. నువ్విక కాలేజీకి వెళ్లడం లేదు లోపలికి వెళ్లు.
అంటూ అపూర్వ కోపంగా బిందును తిట్టగానే.. బిందు ఏడుస్తూ లోపలికి వెళ్తుంది. పిల్లల్ని పెంచడం కూడా ఓ కల అంటూ అపూర్వ లోపలికి వెళ్లిపోతుంది. తర్వాత సూర్య, గగన్‌ను అరెస్ట్ చేశాడని తెలిసి భూమి, కేపీ స్టేషన్‌కు వెళ్తారు. గగన్ ఎక్కడున్నాడని అడుగుతారు. ఇంటరాగేషన్ నడుస్తుందని చెప్తాడు. దీంతో భూమి కోపంగా సూర్యను తిడుతుంది. పాత పగ మనసులో పెట్టుకుని ఆయన్ని అరెస్ట్ చేశావని నువ్వు దానికి బదులు చెల్లించాల్సి వస్తుందని చెప్పి వెళ్లిపోతారు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!



















