Meghasandesam Serial Today February 9th: ‘మేఘసందేశం’ సీరియల్: శరత్ చంద్ర ఇంటికి వెళ్లిన భూమి - బయటకు గెంటేసిన అపూర్వ
Meghasandesam serial today episode February 9th: పుట్టిన రోజని ఇంటికి వచ్చిన భూమిని అపూర్వ చేత బయటకు గెంటి వేయిస్తాడు శరత్ చంద్ర. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Meghasandesam Serial Today Episode: పూరి, శారద ఇంటి ముందు భోగి మంటలు వేయడానికి అంతా రెడీ చేస్తుంటారు. ఇద్దరే ఉండటంతో శారద ఇంకా ఎవ్వరూ రాలేదేంటి ఇంట్లోకి వెళ్లి తీసుకురాపో పూరి అని చెప్తుంది. దీంతో పూరి సరే అమ్మా అంటూ లోపలికి వెళ్లి శివను తీసుకుని వస్తుంది. శివ బయటకు వస్తాడు.
శివ: హ్యాపీ భోగీ ఆంటీ..?
శారద: హ్యాపీ భోగీ.. ఏయ్ పూరి అందరినీ పిలుచుకురమ్మంటే అందరినీ పిలుచు రావాలి అంతే కానీ నీకు కాబోయే శ్రీవారిని వెనకేసుకుని రమ్మని కాదు.
పూరి: అంటే అన్నయ్య భూమి కలిసి వస్తారు కద అమ్మా..? వాళ్లను డిస్టర్బ్ చేయడం ఎందుకని..?
శారద: డిస్టర్బ్ ఏముంది పూరి. వాళ్ల పెళ్లి అయ్యాక మొదటి పండుగ ఇది. మనం ప్రాముఖ్యత ఇవ్వాల్సింది. మీ అన్నయ్య, వదినలకే.. అదీ కాక ఇవాళ మన భూమి పుట్టిన రోజు. శుభాకాంక్షలు చెప్పి మరీ మీ వదినను లేపుదాం పదండి
పూరి: సరే అమ్మ వెళ్దాం.. పద
అంటూ ముగ్గురు కలిసి ఇంట్లోకి భూమిని నిద్ర లేపడానికి వెళ్తారు. అప్పటికే బెడ్ రూంలో బెలూన్స్ తో డెకరేట్ చేసి ఉంటాడు గగన్. భూమి నిద్ర లేస్తే సర్‌ప్రైజ్ చేయడానికి ఎదురుచూస్తుంటాడు. ఇంతలో శారద, పూరి, శివ లోపలికి వస్తుంటారు. వాళ్లను చూసి గగన్ చాటుకు వెళ్తాడు. అప్పుడే భూమి నిద్ర లేస్తుంది.
శారద: భూమి పుట్టినరోజు శుభాకాంక్షలు..
పూరి: హ్యాపీ బర్తుడే వదిన..
భూమి: థాంక్యూ..
శివ: హ్యాపీ బర్తుడే అక్కా..
భూమి: థాంక్యూ..
గగన్: మెనీ మెనీ హ్యాపీ రిటర్న్ ఆఫ్ ది డే భూమి..
భూమి: థాంక్యూ.. బావ..
శారద: సరే సరే బయట భోగీ మంటకు ఏర్పాట్లు చేశాం మీరు త్వరగా రెడీ అయి వచ్చేయండి
భూమి: సరే అత్తయ్యా..
అని చెప్పగానే.. శారద, పూరి, శివ వెళ్లిపోతారు.
భూమి: చూశావా బావ.. అత్తయ్య నా పుట్టినరోజుకు ఎంత బాగా డెకరేట్ చేసిందో..? అసలు ఇదంతా నువ్వే చేసి ఉంటే ఎంత సంతోషించేదాన్నో..
అంటూ చెప్పి భూమి వెళ్లిపోతుంది. గగన్ మాత్రం ఈరోజు కాకపోతే రేపైనా తెలిసిపోతుంది. అనుకుంటాడు. తర్వాత రెడీ అయిన భూమి శరత్ చంద్ర ఇంటికి అక్షింతలు తీసుకుని వెళ్తుంది. ఇంట్లో అటూ ఇటూ తిరిగి చూస్తుంది ఎవ్వరూ కనిపించరు దీంతో గట్టిగా పిలుస్తుంది.
భూమి: నాన్నా.. నాన్నా..
అప్పుడే పై నుంచి శరత్, అపూర్వ అందరూ వస్తారు. శరత్ చంద్ర భూమిని చూడగానే కోప్పడుతుంటాడు. అపూర్వ ఓదార్చినట్టే ఓదార్చి శరత్ చంద్రను రెచ్చగొడుతుంది.
శరత్: ఎందుకు వచ్చావు.. నా ఇంటికి ఎందుకొచ్చావు..?
భూమి: నాన్న ఈరోజు నా పుట్టినరోజు నాన్న. మీ ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను..
శరత్: నా దేవత చనిపోయిన రోజని నేను ఏడుస్తుంటే.. ఘనంగా చేసుకుంటున్న నీ పుట్టిన రోజు వేడుకకు నా ఆశీర్వాదం కావాలా..? పో బయటికి నా ఇంట్లోంచి వెళ్లిపో..
అంటూ శరత్ చంద్ర తిట్టగానే.. అపూర్వ కోపంగా భూమిని ఇంట్లోంచి బయటకు గెంటేసి డోర్ వేస్తుంది. బయట పడిపోయిన భూమి ఇంట్లోకి ఏడుస్తూ చూస్తుంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
Before You Go
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు





















