Meghasandesam Serial Today February 6th: ‘మేఘసందేశం’ సీరియల్: దెయ్యంలా వచ్చిన చెర్రి – భయంతో వణికిపోయిన నక్షత్ర
Meghasandesam serial today episode February 6th: నక్షత్ర, సుజాత భోజనం చేస్తుంటే చెర్రి దెయ్యంలా వస్తాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఫన్నీగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: ఎస్పీ సూర్య అపూర్వను కలుస్తాడు. గగన్ తన నుంచి తప్పించుకున్నాడని లేదంటే గగన్, భూమిలను చంపేసేవాడినని చెప్తాడు. అంతా ఆ భూమి వల్లే జరిగిందని చెప్పడంతో అపూర్వ భయపడుతుంది. ఇరిటేటింగ్ గా ఫీలవుతుంది.
అపూర్వ: అందుకే సూర్య గారు దొరికిన వారిని దొరికినట్టే తెగ నరుకుదాం అన్నాను. మీరు వినలేదు.
సూర్య: మేడం మీకు ప్రాబ్లమ్ అర్థం కావడం లేదు. మనకు దొరికింది ఆ గగన్ గాడు అయితే అక్కడికక్కడే తెగ నరికేవాడిని కానీ మనకు భూమి కదా దొరికింది. దొరికిన దాన్ని సరదాగా చంపేసేమే అనుకోండి ఆ గగన్ గాడు ఊరుకునే వాడా..? ఆ మరుక్షణమే మనల్ని లేపేసేవాడు. ముందు వాళ్ల మనసుల్లో ప్రేమను చంపి వాళ్లను పిచ్చి వాళ్లను చేసి తర్వాత చంపుదామనుకున్నాను. అది కూడా అవ్వలేదు. విచిత్రం ఏంటో తెలుసా..? మేడం ఇద్దరు కలిసి చస్తారని నేను ఆ భూమికి బాంబు సెట్ చేశాను. కానీ ఆ గగన్ గాడు బతకాలని వాడికి దూరంగా భూమి పరుగెత్తింది. మధ్య దారిలోనే ఆ గగన్ గాడిని మిస్ గైడ్ చేసి చంపాలి అనుకున్నాను కానీ ఆ భూమి తిరిగి వచ్చి బతికించేసుకుంది. జరిగింది తలుచుకుంటుంటే ఇంకా నేను ఎందుకు బతికి ఉన్నానని బాధగా ఉంది మేడం. పోని చద్దామనుకుంటే ఆ గగన్ గాడిని చంపకుండా చస్తే ఓడిపోయిన వాడి కిందే లెక్క అవుతుంది. అందుకే బతికి ఉన్నాను మేడం..
అపూర్వ: మరీ అంత వైరాగ్యం వద్దు సూర్య గారు. ఆ గగన్, భూమిల అంతం చూడాలంటే మనం బతికే ఉండాలిగా
సూర్య: కానీ వారు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు ఒకర్ని ఒకరు రక్షించుకుంటున్నారు.
అపూర్వ: అది నిజమే. ఆ నిజం మీకంటే మాకే బాగా తెలుసు. కనుక తనను దాటి ఆలోచించాలి. ఎస్ సూర్య గారు మనం వాళ్లిద్దరినీ ఒకేసారి చంపాలి ఒకే టైంలో చంపాలి కానీ వాళ్లిద్దరూ వేరు వేరు ప్లేస్‌ల్లో ఉండాలి.
సూర్య: ఎస్ మేడం ఫర్ఫెక్ట్ ప్లాన్ ఇది. ఇలాగే చేద్దాం
అంటూ సూర్య చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత నక్షత్ర, సుజాత ఇద్దరూ టిఫిన్ చేస్తుంటే.. అప్పుడే కేపీ వచ్చి చెర్రి ఎక్కడ అని అడుగుతాడు. దీంతో నక్షత్ర, సుజాత టెన్షన్ పడతారు. ఇంతలో చెర్రి దెయ్యంలా తయారై డోంట్ వర్రీ నాన్న నేను వచ్చేశాను అంటాడు. చెర్రి మాటలేవీ వినబడనట్టు కేపీ భోజనం చేస్తుంటాడు. చెర్రి టేబుల్ దగ్గరకు వస్తాడు. నక్షత్ర, సుజాత, చెర్రిని చూసి టెన్షన్ పడుతుంటారు.
చెర్రి: అన్ని రొటీన్ మనుషులు తినే ఐటమ్స్ మాత్రమే ఉన్నాయి.. ఆత్మకు…
కేపీ: అమ్మా నక్షత్ర..
నక్షత్ర: మామయ్య.. మామయ్యా.. చెప్పండి.. చెప్పండి..
కేపీ: ఏంటమ్మా నేను ఒకసారి పిలిస్తే అన్ని సార్లు పలుకుతున్నావు..
నక్షత్ర: అంటే మామయ్య మీకు మీ అబ్బాయి చెర్రి కనిపించడం లేదా మామయ్య..
కేపీ: చెర్రి వచ్చాడా..? ఎక్కడ..?
నక్షత్ర: మీ పక్కనే ఉన్నాడు మామయ్య..
కేపీ: పక్కనా..? ఏడీ ఎక్కడ..? ఏంటి నక్షత్ర ఏంటి నీ కన్ఫీజన్..
సుజాత: ( భయంగా) ఏం లేదు కేపీ మధ్యాహ్నం బేబీ పిడేల్ హడేల్ అని ఒక కొరియన్ సినిమా చూసింది. ఆ కొరియన్ సినిమా గుర్తుకు వచ్చినప్పుడల్లా ఇలా భయపడుతూనే ఉంది.
కేపీ: గోరింటాకు గారు అలాంటి హర్రర్ సినిమా చూడటం ఎందుకు ఇలా భయపడటం ఎందుకు..?
సుజాత: బేబీ వచ్చింది చెర్రి గాడి ఆత్మనే..
అని చెప్తూ సుజాత భయపడుతుంది. నక్షత్ర భయంతో వణికిపోతుంటుంది. కేపీ అలాంటి సినిమాలు చూడటం ఎందుకు ఇలా భయపడటం ఎందుకు అంటూ చెప్పి వెళ్లిపోతాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
Before You Go
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు





















