Meghasandesam Serial Today February 2nd: ‘మేఘసందేశం’ సీరియల్: గగన్ ను తిట్టిన భూమి - భూమిని దత్తత తీసుకున్న శరత్
Meghasandesam Today Episode: భూమి కోపంగా గగన్‌ను తిట్టి వెళ్లిపోమ్మని చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode : గగన్ తాను తీసుకొచ్చిన నెక్లెస్ భూమి మెడలో వేస్తానని. ఇది వేయడమంటే.. నీ మెడలో తాళి కట్టినట్టే అంటూ నెక్లెస్ వేయడానికి గగన్ వెళ్తుంటే.. శరత్ చంద్ర అడ్డు వచ్చి భూమి నువ్వు నిజంగా వీణ్ని ప్రేమించావా అని అడుగుతాడు. భూమి ఏం చెప్పాలో అర్థం కాక చూస్తుంటుంది. ఒకవేళ నువ్వు వీణ్ని ప్రేమిస్తే వాడితో వెళ్లిపోవచ్చు అని చెప్తాడు. వీడు నీ మెడలో నెక్లెస్ వేసి తీసుకెళ్లడానికి ఇది కళ్యాణ మంటపం కాదు నా ఇల్లు.. చెప్పు వీణ్ని నువ్వు ప్రేమించావా..? అని అడుగుతాడు.
అపూర్వ: ఒప్పేసుకోవే ఒప్పేసుకో.. వాణ్ని ప్రేమిస్తున్నానని ఒప్పేసుకో.. ( అని మనసులో అనుకుంటుంది)
సుజాత: ఇంకేం చెప్తుంది దాని ముఖం.. ముందు చూస్తే గొయ్యి.. వెనక చూస్తే నుయ్యి అలా ఉంది దాని పరిస్థితి. అవునని చెప్పలేదు.. కాదని చెప్పలేదు ( అని మనసులో అనుకుంటుంది)
గగన్: ఎవరికీ ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు భూమి. నాలుగు రోజులు ఆశ్రయం ఇచ్చి నిజంగా నాన్నలా అధికారం చెలాయించే వాళ్లకు అస్సలు చెప్పక్కర్లేదు. నువ్వేమైనా ఈయన కూతురివా ఏంటి..?
శరత్: ఓహో అదా నీ ధైర్యం.. ఆ ధైర్యంతోనే నా ఇంట్లో అడుగుపెట్టావా..? అయితే విను.. శోభా నువ్వు నా జీవితంలోకి వచ్చిన దగ్గరి నుంచి నీకు చెప్పకుండా నేను ఏ పని చేయలేదు. ఇప్పుడు నీకు చెప్పే చేస్తున్నాను. ఈ క్షణం నుంచి ఈ భూమి మన భూమి. మన అమ్మాయి వస్తే తనకు ఇచ్చే స్థానం తనకు ఉంటుంది. తనతో పాటు మన భూమికి ఉంటుంది. అలా అని నేను నీ మీద ప్రమాణం చేస్తున్నాను. నేను ఈ భూమిని దత్తత తీసుకుంటున్నాను.
సుజాత: సొంత కూతురుని దత్తత తీసుకునే వింత నేను ఇక్కడే చూస్తున్నాను. ఏమిటో ఈ వింత. ( అని మనసులో అనుకుంటుంది)
శరత్: చెప్పరా ఇప్పుడు చెప్పు భూమి నా కూతురు కాదని చెప్పగలవా..?
అపూర్వ: దేశంలో ఎక్కడా లేని వింతలన్నీ నా ఇంట్లోనే చూస్తున్నాను. మా బావకు చిప్ప దొబ్బింది. నేను వేసిన ఏ ఒక్కప్లాన్ సక్సెస్ కాకుండా చేస్తున్నాడు. ( అని మనసులో అనుకుంటాడు)
గగన్: చెప్పగలను.. నీ నోటి మాటే వేదం కాదు. నువ్వు దత్తత తీసుకున్నాను అన్నంతలోనే భూమి నీ కూతురు అయిపోదు. అయినా నువ్వు దత్తత తీసుకున్నాను అంటే కట్టుకుంటున్న నేను ఎలా ఒప్పుకోగలను. భూమి.. ఈ ఇంటిని ఈయన కళ్యాణ మంటపం అనుకుంటాడో స్మశానం అనుకుంటాడో నాకు అనవసరం. వీళ్ల అనుమానం తీర్చడానికైనా ఈ నెక్లెస్ నీ మెడలో వేసి నిన్ను తీసుకెళ్తాను.
అంటూ గగన్ నెక్లెస్ వేయబోతుంటే.. భూమి ఆపుతుంది. దీంతో గగన్ మనం ఎవ్వరికీ భయపడనవసరం లేదు అంటూ నెక్లెస్ వేయబోతుంటే.. భూమి కోపంగా నెక్లెస్ విసిరి కొట్టి గగన్ ను తోసేస్తుంది. అందరూ షాక్ అవుతారు. శరత్ చంద్ర హ్యాపీగా ఫీలవుతాడు.
భూమి: నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఎప్పుడైనా చెప్పానా..?
గగన్: భూమి నువ్వు అలా మాట్లాడుతున్నావేంటి..? నువ్వు నన్ను ప్రేమించలేదూ..
భూమి: నేను చెప్పానా..?
గగన్: మరి బర్తుడే పార్టీలో
అంటూ భూమి కిస్ చేసింది గుర్తు చేసుకుంటాడు గగన్. భూమి కోపంగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పానా..? అంటుంది. మరి వనభోజనాల దగ్గర అని మళ్లీ బూమి కిస్ ఇచ్చింది గుర్తు చేసుకుంటాడు గగన్. ఏంటి వనభోజనాల దగ్గర నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పానా..? అంటుంది. మధ్యలో శారద కల్పించుకోగానే.. మీకు కూడా ఎప్పుడైనా మీ అబ్బాయి గురించి ఇష్టమని చెప్పానా..? అంటూ ఏడుస్తూ అడుగుతుంది భూమి. గగన్ బాధగా భూమికి, శరత్‌చంద్రకు అందరికీ సారీ చెప్పి.. శారద, పూరిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















